తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల(Telangana National Unity Diamond Jubilee) కోసం హైదరాబాద్ నగరం ముస్తాబైంది. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు అధికారికం(Officially)గా ఈ కార్యక్రమాల(HELDS Program)ను నిర్వహిస్తోంది.17న ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) పబ్లిక్‌ గార్డెన్‌(Public Garden)లో జరిగే అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండా(Hoists the Flag) ఎగురవేయనున్నారు.

మరోవైపు మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి(Home Minister) అమిత్‌షా(Amit shah) ముఖ్యఅతిథి(Chief Guests)గా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరం(Hyderabad City)లో ఈనెల 17న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 వరకూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు(Traffic diversions) ఉంటాయని సిటీ పోలీస్ కమిషనర్(City Police Commissioner) సీవీ ఆనంద్‌(CV Anand) వెల్లడించారు(Announced).

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా…

• లిబర్టీ(Liberty) నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌(Upper Tank Band) వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ నుంచి హిమాయత్‌నగర్‌కు మళ్లిస్తారు.
• నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు మీదుగా NTR స్టేడియం వచ్చే వాహనాలను RTC X రోడ్డు దగ్గర మళ్లించి ముషీరాబాద్‌ వైపు మళ్లిస్తారు.
• రవీంద్రభారతి నుంచి తెలుగు తల్లి(Telugu Thalli) మీదుగా కట్టమైసమ్మ గుడి వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. కట్టమైసమ్మ గుడి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం(Ambedkar Statue) ఉండే రహదారి మూసేస్తారు.
• నెక్లెస్‌ రోడ్డు మీదుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
• కవాడిగూడ క్రాస్‌ రోడ్డు నుంచి సెయిలింగ్‌ క్లబ్‌/లోయర్‌ ట్యాంక్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌ రోడ్డు మీదుగా బైబిల్‌ హౌస్‌కు మళ్లించనున్నారు.
• అశోక్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను NTR స్టేడియం వైపు అనుమతించకుండా బాకారం బ్రిడ్జి నుంచి సీజీవో టవర్స్‌ బన్సీలాల్‌పేట వైపు మళ్లిస్తారు.
• అజామాబాద్‌ జంక్షన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వచ్చే వాహనాలను వీఎస్‌టీ క్రాస్‌ రోడ్డు నుంచి బాగ్‌లింగంపల్లి వైపు మళ్లిస్తారు.
• సదరం కంటి ఆసుపత్రి, ఏవీ కళాశాల నుంచి NTR స్టేడియం వచ్చే వాహనాలను దోమలగూడ దగ్గర మళ్లించి చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌ వైపు పంపిస్తారు.
• రాణిగంజ్‌/ఎంజీరోడ్‌/ ఆర్పీరోడ్డు మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వచ్చే వాహనాలను కర్బలా మైదాన్‌ నుంచి బైబిల్‌ హౌస్‌ వైపు మళ్లిస్తారు.

పార్కింగ్‌ ఏర్పాట్లు ఎక్కడంటే,

  • ఈ వజ్రోత్సవాల(Vajrostava)కు రాష్ట్రం(State)లోని ఇతర ప్రాంతాల నుంచి హాజరయ్యే వారి వాహనాల(Vehicles)ను పార్కింగ్‌ చేసుకునే ప్రాంతాలు ఇవే!
  •  వరంగల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ముషీరాబాద్‌ బస్‌ డిపో వద్ద నిలపాలి.
  •  సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద పార్క్ చేయాలి.
  •  నిజామాబాద్, కరీంనగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు బుద్ధ భవన్‌ వద్ద పార్కింగ్ చేయాలి.
  •  మహబూబ్‌నగర్‌, నల్గొండ వైపు నుంచి వచ్చే వాహనాలు నిజాం కాలేజీ 4వ నెంబర్‌ గేటు వద్ద, తెలంగాణ గిరిజన గురుకుల సొసైటీ డిగ్రీ కళాశాల విద్యార్థుల వాహనాలు ప్రసాద్‌ ఐమాక్స్‌ సమీపంలోని డాక్టర్‌ కార్స్‌ వద్ద వాహనాలు నిలపాలి.