స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో సినిమా తో తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తన నెక్స్ట్ చిత్రం #కాజల్ 60 లో కాజల్ ఒక పవర్ ఫుల్ పాత్రలో వెండి తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉంది.

రేపు జూన్ 19 న ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు రేపు ఒక గ్లింప్స్ వీడియో ను మీడియా ముందు విడుదల చేయనున్నారు. అఖిల్ డేగల ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్నిఅవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క తమ ప్రొడక్షన్‌ లో మొదటి సినిమా గా నిర్మిస్తున్నారు. శశి కిరణ్ తిక్క ఈ సినిమా సమర్పకుడు చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు.ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల సమకూరుస్తున్నారు.

ఆల్ ది బెస్ట్ కాజల్ అగర్వాల్ …