క్యారెట్ (Carrot)వలన  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Benifits) కలుగుతాయో అందరికీ తెల్సిందే ! ప్రతిరోజూ (Everyday) క్యారెట్స్ ఆహారం లో తీసుకుంటుటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, జీర్ణశక్తిని మరింతగా వృద్ధి చేస్తుందని డాక్టర్లు (Doctors) ఎప్పుడూ సలహాలు ఇస్తూనే వుంటారు.

కాబట్టి.. ఈ క్యారెట్ తో  ప్రత్యేక రెసిపీ  (Special Receipe) చేసుకుని ఆరోగ్యం గా ఉండొచ్చు . మరి , అలాగే.. ఈ క్యారెట్’తో ఖీర్, చేయడం ఎలాగో తెలుసుకుందామా ! ఈ క్యారెట్ ఖీర్ కాస్త డిఫరెంట్ స్టైల్లో వుండటంతోబాటు, ఎంతో రుచిగా వుంటుంది.

ఆలస్యం ఎందుకు మరి.. దీన్నెలా చేస్తారో చూసేద్దామా …

కావాల్సిన పదార్ధాలు (Required Ingredients)

  • ఒక కప్పు క్యారెట్ తురుము
  • 1/2 లీటర్ పాలు
  • 2 టీ స్పూన్స్ నెయ్యి
  • 25 గ్రాములు డ్రైఫ్రూట్స్
  • 100 గ్రాములు కోవా
  • 1/2 టీ స్పూన్ యాలకులపొడి
  • ఒక కప్పు పంచదార

ఇపుడు తయారు చేయు విధానం (Process) చూసేద్దాం రండి.

  1. స్టౌవ్ (Stove) మీద ఒక బాణలి పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి (Ghee) వేసి కాస్త వేడి ఎక్కించండి . నెయ్యి కాగిన తర్వాత అందులో  డ్రైఫ్రూట్స్ (Dry Fruits) ని వేసి కొద్దిసేపటి వరకు బాగా వేయించాలి . అనంతరం క్రిందకు దించేసి దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అదే పాన్’ (Pan) లో ఇంకొంచెం నెయ్యి వేసి , క్యారెట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. ఈ  తురుమును కూడా క్రిందకు దించేసి.. ఒక పక్కన వుంచుకోవాలి.
  3. మరో స్టౌవ్’పై మరొక పాత్ర పెట్టి అందులో కొంచెం పాలు (Milk) పోసి బాగా మరిగించుకోవాలి. ఇపుడు ఈ పాలు మరుగుతుండగానే అందులో కోవావేసి బాగా  కలుపుతూ వుండాలి.
  4. అలా పాలను 10 నిముషాలపాటు ఉడికించిన తర్వాత దానిలో వేయించి ఉంచుకున్న క్యారెట్ తురుమును, పందార ను వేసి మిక్స్ (Mix)  చేస్తూ మరో 10 నిముషాలు బాగా వేయించాలి.
  5. ఇలా వేడి చేసిన తర్వాత క్రిందకు దించేముందు వేయించి ఉంచిన న డ్రైఫ్రూట్స్’తో గార్నిష్ (Garnish) చేసుకోవాలి.

అంతే, చూసారా ఇపుడు నోరూరించే క్యారెట్ ఖీర్ రెడీ! ఇక ఆలస్యం ఎందుకు సర్వ్ చేసేయండి …