బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) చూస్తుంటే ఆడియన్స్ కి సైతం భయం పుట్టిస్తోంది. 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ (eliminate) అవ్వగా ఈ వారం ఏడుగురు ఎలిమినేట్ అవ్వడానికి నామినేషన్ (Nomination) ప్రక్రియలో ఉన్నారు ..

బిగ్ బాస్ గొడవలు

బిగ్ బాస్ అంటేనే గొడవలు ఆర్గుమెంట్లు, ఏడుపులు ఉంటాయి కానీ గత సీజన్స్ (seasons) తో పోల్చుకుంటే ఈ సీజన్ లో ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసే దానికో లేక టిఆర్పీ పెంచడానికో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తోంది.

గొడవలు తార స్థాయి కి చేరింది. అయితే బిగ్ బాస్ కూడా  అమ్మాయిలను,అబ్బాయిలను కలిపి ఆల ఎలా ఫిసికల్ టాస్క్లు (physical task) ఆడిస్తున్నారో తెలియట్లేదు.

ఇక కంటెస్టెంట్స్ అయితే ఎవరికీ ఎవరు తీసిపోవట్లేదు ఫిసికల్ ఎటాక్ జరుగుతున్న  కూడా గేమ్ లో దూసుకుపోతున్నారు.

ఇక సెప్టెంబర్ 14 ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ , రవి కి మధ్య వాదన జరిగింది. నటరాజ్ మాస్టర్ హౌస్ లో  ఒక గుంట నక్క వుంది అని అనడం  తో రవి అతనితో డిస్కస్ చేసాడు.

నటరాజ్ మాస్టర్ ‘ఎందుకు అంతా అలా ఊహించుకుంటున్నారు మాస్టర్?’,‘మీరు దేవుడిలా మాట్లాడితే.. ఇంకేం చేయలేము  మాస్టర్.. మీరు దేవుడు.. మీరు తోపు, తురుము నాకు తెలుసు.. ప్రూఫ్ ఉంది కదా మీకు నేనే ఎక్కిస్తున్నాను అని? నాతో చక్కగా మాట్లాడరెందుకు మాస్టర్..? అంటాడు రవి. దానికి నటరాజ్ మాస్టర్ బదులిస్తూ, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? నీతో బాగానే  ఉంటున్నాను కదా?, ‘నేనేం ఊహించుకోవడం లేదు.. నామినేషన్ (Nominate) ఓట్లు ఎలా పడ్డాయో నాకు తెలుసు అంటాడు నటరాజ్ మాస్టర్ .

అయితే ఇదంతా గమనిస్తున్న  సన్నీ అడిగినప్పుడు మాత్రం గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భూజాలు తడుముకున్నట్లు..  తాను నా   దగ్గరకు వచ్చి అడిగేశాడు అని రవినే గుంట నక్క అని చెప్పకనే చెప్పేసాడు నటరాజ్ మాస్టర్.

ఇక  తరువాతి  రోజు  ఉదయం  ‘ముక్కాలా ముక్కాబులా’ పాటకు  సూపర్ స్టెప్స్ తో  డాన్స్ (dance) చేసిన హౌస్ మేట్స్. యాని మాస్టర్  శ్రీరామ్ చంద్ర,  మాట్లాడుకుంటూ.. ‘నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఏంటీ అనేది బాగా క్లారిటీ (clarity) వచ్చిందని డిస్కస్ చేసుకుంటుంటారు ఇద్దరు.

శ్వేత ఏడుస్తూనే సన్నీకి గుడ్ మార్నింగ్ చెబుతుంది. ‘పొద్దుగాలే ఏడవద్దు’ అంటాడు సన్నీ. ఇక కిచెన్ లో వున్నా ప్రియాంకను చూసి  విజిల్(Whistle) వేస్తాడు లోబో. దాంతో బుద్ధి లేదా అందమైన అమ్మాయలు కనిపిస్తే ఇలానే విజిల్స్ వేస్తారా? అంటూ తిడుతుంది. ఈ కాన్వెర్జషన్ చూసే వాళ్లకు ఫన్నీ (funny) గా  అనిపిస్తుంది.

ఇక లోబోని నామినేట్‌ (Nominate) చేసిన మానస్‌.. తను ఎందుకు చేశానో వివరించే ప్రయత్నం చేసాడు. టాస్క్ టైం లో తాను కావాలని ఆయిల్‌ వేయలేదని, అనుకోకుండా పడితే దానికి నామినేట్‌ చేయడం సిల్లీగా ఉందని బాధపడ్డాడు. ఇక శ్వేత ఏమో ఉమాదేవి మాటలకు బాగా హర్ట్‌ అయినట్లుంది. ఆమె వయసుకి ఆమె మాట్లాడిన మాటలకు సంబంధం లేదని విమర్శించింది.

మరోవైపు రవి, సిరి నటరాజ్‌ అన్న  గుంటనక్క మాటలను మరోసారి డిస్కస్  చేసుకున్నారు. ఆ మాటలతో మాస్టర్‌పై రెస్పెక్ట్‌ (Respect) పోయిందని సిరి అంటుంది,  రవి ఏమో నేను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే మాస్టర్‌ పట్టించుకోవడంలేదన్నాడు.

ఇక స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూర్చున్న ప్రియ, ఉమాదేవి.. నామినేషన్‌ గురించి మాట్లాడుకున్నారు. సెకండ్‌ వీక్‌ లో కూడా  కరెక్ట్  రీజన్స్‌ లేవని, అన్ని సిల్లీ రీజన్స్  చెప్పి నామినేట్‌ (Nominate) చేశారని ఉమా ప్రియా తో చెప్పింది.

తరువాత సన్నీ ఏమో ఉమాదేవికి నచ్చజెప్పే  ప్రయత్నం చేశాడు. ఇంట్లో కోపం, ప్రేమ రెండూ ఉండాలని, ప్రేమగా మాట్లాడాలని ఆమెను రిక్వెస్ట్‌(Respect) చేశాడు. ఇక ఉమా ఏమో ఎప్పటి మాదిరే ‘నేను ఇలాగే ఉంటా, ఎవరితోనైనా ఇలానే మాట్లాడుతా’నని తెల్చిచెప్పింది.  నేను మా ఇంట్లో నా చెల్లి, నా మొగుడితో అయినా కూడా ఇలానే  మాట్లాడుతాను నా మాట తీరే ఇంత అంటూ ఉమా రూడ్ గానే  సన్నీ తో చెప్పింది .

అందుకు సన్నీ 19 మంది ఒకేలా ఉండరు ఒక్కొక్కరు  ఒక్కొక్కలా ఉంటారని చెబుతాడు. ఇక తాను ఎవరి కోసం మారను అని ఇష్టం ఉంటే  మాట్లాడుతారు లేదంటే లేదు అని తేల్చి చెప్పేస్తుంది ఉమా.

మరోవైపు కాజల్‌ దగ్గరకు వెళ్లిన సన్నీ నీలో స్వీట్‌నెస్‌, క్యూట్‌ నెస్‌ కనిపించడం లేదని అంటాడు. నేను స్వీట్‌గా క్యూట్‌గా ఉంటే ఫేక్‌ అంటున్నారని,  వీళ్లంతా నా వాళ్ళు కారని, ఇక్కడ నాకు ఆ ఫీలింగ్‌(feeling) రాలేదని, అందుకే ఇలా ఉంటున్నానని కాజల్‌ చెప్పింది. ఇక సిరి షణ్ముఖ్, రవిలు సన్నీ మీద సెట్టైర్స్ వేసుకుని నవ్వుకుంటారు.

పంతం  నీదా నాదా

బిగ్ బాస్ (Big boss) ఇచ్చిన కెప్టెన్ (Captain) పోటీదారుల టాస్క్ మొదలైంది, పంతం  నీదా నాదా .. అనే పేరుతో గేమ్ (Game) స్టార్ట్ అయ్యింది.  ఇందులో  మొదటి టాస్క్ ‘దొంగలున్నారు జాగ్రత్త’.. టాస్క్‌ లో భాగంగా పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌ లో సన్నీ చేయి పెట్టాడని.. సిరి చాలా పెద్ద గొడవ చేస్తుంది. అయితే సన్నీ ‘నేను అలా చెయ్యలేదు..’ అంటూ, వాదిస్తాడు. మరోవైపు ఈ తోపులాటలో లోబోకు పెయిన్ రావడం తో కన్ఫెషన్ రూమ్(Confession room) కి వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు అని బిగ్ బాస్ (Big boss) చెప్తారు.

మధ్యలో రవి-విశ్వకి మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది. మొత్తంగా ఈ టాస్క్‌ లో ఒక్కొక్కరూ సైకోలుగా బిహేవ్ చేసారు.

ఆడ మగా తేడా లేకుండా ఒకరిపై ఒకరు ఎక్కేసి మరి చూడడానికి ఇబ్బంది కలిగేలా ప్రవ్తరించారు.

ఇక కెప్టెన్ పోటీదారులకు సంబంధించిన రెండో టాస్క్ ‘సాగరా సోదరా’ మొదలైంది. ఈ టాస్క్ (Task) రేపటి ఎపిసోడ్ (Episode) లో చుడాలిసిందే.

అయితే బుధవారం ఎపిసోడ్‌లో కూడా ఇలాగే ఉంటుందో లేదా అంతకు మించి ఉంటుందో  చూడాలి మరి.