బొద్దుగా, లావుగా ఉండేవారు డబుల్ చిన్(Double chin), ఫేస్ ఫ్యాట్ సమస్యల(Face Fat problems)తో బాధపడతారనే సంగతి తెలిసిందే. అయితే, బరువు తగ్గిన తర్వాత కూడా కొందరిలో ఇవి అలాగే ఉంటాయి. దీనవల్ల ముఖం అంత అందంగా కనిపించదు. ఫొటోల్లో కూడా రూపురేఖలు మారిపోతాయి. అయితే, ఈ సమస్యను మనం కొన్ని అలవాట్ల ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేయండి మరి.

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించండి:

రిఫైన్డ్(Refined) కార్బోహైడ్రేట్స్‌(Carbohydrates) ను ప్రోసెస్డ్ కార్బ్స్(Processed Carbos)  అని కూడా అంటారు. వాటి నుంచి ఫైబర్‌(Fiber)ను తొలగిస్తారు. వైట్ బ్రెడ్, వైట్ రైస్, చక్కెర, సోడా, స్వీట్లలో వీటిని ఎక్కువగా కలుపుతారు. అటువంటి పిండి పదార్థాలు తినడం వల్ల కొవ్వు నిల్వలు పెరుగుతాయి. అందుకే ప్రాసెస్డ్ కార్బ్స్‌ కు బదులుగా తృణధాన్యాలు(millets) తినడం మంచిది.

మద్యం తగ్గించండి:

ఆల్కహాల్(Alcohol) అతిగా తాగినా ముఖం వద్ద కొవ్వు పేరుకుపోతుంది. రోజుకు ఒక గ్లాసు మించి  మద్యాన్ని సేవించవద్దు. ఎక్కువ నీటిని తాగడం ద్వారా దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు.

కార్డియో లేదా ఏరోబిక్ వ్యాయామం:

కార్డియో(Cardio) లేదా ఏరోబియ్(Aerobic) వ్యాయమం ద్వారా మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముఖం చుట్టు పేరుకొనే కొవ్వును కరిగించవచ్చు. రోజుకు కనీసం 20-40 నిమిషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

సోడియం తక్కువగా తీసుకోండి:

సోడియం(Sodium) అతిగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోండి. దాదాపు అన్నిరకాల ప్రోసెస్డ్ ఫుడ్‌లో ఉప్పు కలిపి ఉంటుంది. ఉప్పు.. మన శరీరంలో అదనపు నీటిని ఉండేలా చేస్తుంది. దీనివల్ల ఫేస్ ఫ్యాట్ పెరుగుతుంది.

ముఖ వ్యాయామం చేయండి:

రోజూ ముఖ వ్యాయామం (Facial Exercise) చేయడం చాలామంచిది. దీనివల్ల ముఖ కండరాలకు బలం చేకూరుతుంది. మా నాలుకను బయటకు తీసి 10 సెకన్లు బయటకు ఉంచండి. మీ గడ్డం, మెడ వద్ద కండరాల(Muscle)పై ఒత్తిడి(Stress) పడేవరకు అలాగే ఉంచండి. ఈ వ్యాయమం డబుల్ చిన్‌(Double chin)తోపాటు కొవ్వును కూడా తగ్గించి మీ ముఖానికి మంచి రూపం ఇస్తుంది.

నిద్ర(Sleep) అనేది బరువు తగ్గించడాని(Reduce Weight)కి చాలా ఎఫెక్టివ్ రెమిడీ(Effective Remdy).ఇది ముఖంపై ఉన్న కొవ్వును తగ్గించటానికి సాయపడతుంది.నిద్ర లేమి కార్టిసాల్ స్థాయిల(Cartisol Levels)ను పెంచుతుంది.

ఇది ఒత్తిడి హార్మోన్(Hormone Stress), దీని వల్ల బరువు పెరుగటంతో పాటు అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.అధిక కార్టిసాల్ స్థాయిలు ఆకలిని పెంచుతాయి. జీవక్రియను మారుస్తాయని ఫలితంగా కొవ్వు నిల్వ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయ.ఓ అధ్యయనం ప్రకారం మంచి నిద్ర వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని తేలింది.

దీనికి విరుద్ధంగా, నిద్ర లేమి వల్ల ఆహారం తీసుకోవడం పెరుగుతుందని, బరువు పెరగడానికి, జీవక్రియ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.బరువు నియంత్రణ(control weight), ఫేస్ ఫ్యాట్ తగ్గడాని(Reduce face fat)కి రాత్రికి కనీసం ఎనిమిది గంటల నిద్ర(Eight Hours of sleep) అవసరం.

నిద్ర లేమి జీవక్రియను మారుస్తుంది.ఆహారం తీసుకోవడం, బరువు పెరగడం, కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది.