చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో తెలుగు వారి మనసుని దోచుకుంది ఈ అందాల భామ అవికా గోర్ ( Avika gor) . బుల్లి తెర పై ఒక వెలుగు వెలిగి వెండి తెరకు పరిచయం ఆవరసరం లేకుండా ఈజీ గా ఎంట్రీ (entry)ఇచ్చి తన సత్తా చూపించిది .

‘ఉయ్యాల జంపాలా‘ సినిమాతో సూపర్ హిట్ (Super hit) ను ఖాతాలో వేసుకుంది. తర్వాత వరుసగా పలు సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది అవికా గోర్ . ఈ సంవత్సరం ‘1920 హార్రర్ ఆఫ్ ది హార్ట్’ (1920 Horros of the Heart) సినిమాలో నటించింది.

ఇపుడు తాజాగా అవికా నటిస్తోన్న సినిమా ‘ఉమాపతి’.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన కలవాని (Kalavani) సినిమాను ఇపుడు మన తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.

క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనురాగ్ హీరోగా ,అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ (Village Back drop) లో ప్రేక్షకులకు ఒక వినూత్న అన్హుభూతి కలిగించేలా ఉమాపతి అనే సినిమా రూపొందిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీని (Good love story) ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్ద పీట వేస్తూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

సత్య ద్వారపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కే. కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిదా మూవీకి సంగీతం (Music) అందించిన శక్తికాంత్ కార్తిక్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్ర కెమెరా మెన్ ,సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ (Shooting) ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్.

యమహా బైక్ (Yamaha Bike) పై పంటపొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేమ ముచ్చట్లు జరుపుతున్నట్లు పోస్టర్ లో  చూపించారు. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కి తోడు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు బాగా జోడిస్తూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోందీ ఈ బ్యూటీ. పలు భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీ గానే ఉంటోంది అనే చెప్పాలి.

ఇక సోషల్ మీడియాలో (Social media )నూ బాగా యాక్టీవ్ గా ఉంటుంది అవికా. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుల మనసుని దోచేస్తుంది.

ఈ ముంబై భామ భవిష్యత్తులో మరిన్న విజయాల్ని తన జాబితా లో వేసుకోవాలి అని కోరుకుందాం ..