బిగ్‌బాస్‌ సీజన్ 5(Big Boss Season 5) లో  తెలుగు ఐదో సీజన్‌ సోమవారంతో వంద రోజులు పూర్తయింది. ఇక ఆదివారం కాజల్ ఎలిమినేషన్ (Elimination) తో  టాప్ 5 కంటెస్టెంట్స్(Contestants) ఎవరో కూడా తేలిపోయింది. ఇక బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ కి ఇచ్చే టాస్క్ లు, లగ్జరీ బడ్జెట్, కెప్టెన్, వంటివాటికి శుభం కార్డు పడినట్టే. హౌస్ లో ప్రస్తుతం ఉన్న మానస్‌, శ్రీరామ్‌, సిరి, షణ్ను, సన్నీలు గ్రాండ్‌ ఫినాలే(Grand Finale) కోసం సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో మానస్‌- సన్నీ కప్పు గురించి కబుర్లాడారు. సన్నీ మాట్లాడుతూ’టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా టైటిల్‌(Tittle) విన్ అవ్వాలని, మా అమ్మకు కప్‌ ఇస్తరా బయ్‌ ఇది ఫిక్స్‌ ఏదైనా కానీ బరాబర్‌ కప్పు ఇస్తా’ అంటూ తన గెలుపును నమ్మకంగా వ్యక్త పరిచాడు. తరువాత  బిగ్‌బాస్‌ ఫైనలిస్టు ల జర్నీ(Journey)ని కళ్లకు కట్టినట్లు చూపెట్టాడు. మొదటగా తొలి ఫైనలిస్టు(First Finalist) అయ్యిన శ్రీరామ్‌కు సర్‌ప్రైజ్‌(Surprise) ఇచ్చాడు. అతడు గార్డెన్‌ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కు(Tasks)లకు సంబంధించిన వస్తువులు చూసి సంబరపడిపోయాడు.

బిగ్‌బాస్‌(Big Boss) మాట్లాడుతూ మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని పలకరించారు. ఆట(Game)లో మీరు చూపించిన పోరాట పటిమ, స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ఆట సాగుతున్న కొద్దీ మీకు దగ్గరైనవారు ఒక్కొక్కరిగా మీకు దూరమయ్యారు. ఎంతోమంది మిమ్మల్ని లోన్‌ రేంజర్‌ అన్నా మీరు వన్‌ మ్యాన్‌ ఆర్మీలా లక్ష్యం వైపు ముందుకెళ్లారు అంటూ జర్నీ వీడియో(Video) ప్లే చేశాడు.

జర్నీ(Journey) ని చూసిన  శ్రీరామ్‌ ఎమోషనల్‌(Emotional) అయ్యాడు. నా జీవితంలో ఈ రోజును మర్చిపోలేను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, బిగ్‌బాస్‌ నా ఎమోషన్స్‌ ను బయటపెట్టగలిగింది.

ఈ జర్నీ నాకు వెరీవెరీ స్పెషల్‌(Special) అంటూ ఆనందంలో మునిగిపోయాడు. నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్‌(Big Boss) అవకాశమివ్వగా శ్రీరామ్‌ తన చెల్లితో ఉన్న ఫొటో(Photo)ను తీసుకున్నాడు.

తర్వాత మానస్‌ గార్డెన్‌ ఏరియా(Garden Area)లోకి వచ్చాడు. అమ్మ ముద్దుల కొడుకు, మామ్మాస్ బాయ్ గా ఇంట్లో అడుగుపెట్టారు. ఇంట్లో మొదటి రోజు  అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు మీ ఓర్పు(Patience), అందరినీ అర్థం చేసుకునే తత్వం ఈ ఇంట్లో మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి. స్నేహనికి మీరు ఇచ్చే విలువ(Value),వారికోసం చివరి వరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరి గుండెను హత్తుకుంది.

మీ గుండె చప్పుడు కొందరికి ప్రశాంతతను తీసుకొస్తే, మీ భుజం ప్రతి ఒక్కరు తమ మనసులోని  భావాలు మీతో పంచుకుని మనసు తేలిక పరుచుకునే చోటు గా మారిందిదని, ఈ ఇంట్లో మీకు  ఎన్నో కొత్త బంధాలు ఏర్పడ్డాయి. ప్రతి బంధాన్ని ఎంతో హుందాగా ధరించారని,  మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడమైన, అవసరమైతే గొంతెత్తి నిలదీయడం మీకే సాధ్యమైందని.  మనసు, తెలివి రెండింటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమం అని మెచ్చుకుంటూ జర్నీ వీడియో(Video) ప్లే చేశాడు బిగ్‌బాస్‌(Big Boss).

ఈ జర్నీ(Journey)లో అప్స్ అండ్ డౌన్స్ , స్వీట్‌ అండ్‌ సాడ్‌ మెమొరీస్‌(Memories) చూసి మానస్‌ చెలించిపోయాడు. తర్వాత ఒక ఫొటోగ్రాప్‌ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేసి  రెండు ఫొటో(Photos)లు తీసుకెళ్లాడు. అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్‌ సన్నీతో ఉన్న ఫొటోను జాగ్రత్తగా ఎప్పటికి తనతోనే జాగ్రత్తగా ఉంచుకుంటాను అని తెలిపాడు. ఇది చూసిన శ్రీరామ్‌ తానూ రెండు ఫొటోలు తెచ్చుకోవాల్సిందని ఫీల్ అయ్యాడు.

ఇక మిగిలిన కంటెస్టెంట్స్(Contestants) జర్నీ(Journey) చూడాలంటే  తదుపరి ఎపిసోడ్(Episode) వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.