వాట్సాప్‌ (WhatsApp) యూజర్లకు మరో గుడ్‌న్యూస్‌. ఇటీవలి కాలంలో చాలా రకాల అప్‌డేట్స్‌తో, కొత్త ఫీచర్లతో తమ యూజర్లను ఆకట్టుకుంటున్న WhatsApp తాజాగా ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ అనే సరి కొత్త గోప్యతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎందుకంటే.. ఈ మధ్య స్పామ్‌ కాల్స్‌ (spam calls) చాలా ఎక్కువైపోయాయి.దీనితో యూజర్స్ (users)అందరూ విసిగి పోతున్నారనే చెప్పాలి. దాంతో ఇటీవల చాలా మంది నుంచి ఫిర్యాదులు ఎక్కువ మొత్తం లో వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ నెంబర్లతో వస్తున్న కాల్స్‌ బాగా చికాకు తెప్పిస్తున్నాయనే చెప్పాలి . వీటికి పరిష్కారంగా వాట్సాప్‌  ఇప్పుడు సరి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా యూజర్లందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

స్పామ్‌,తెలియని నెంబర్లు, స్కామ్‌ కాల్స్‌ను సైలెన్స్‌ చేసేట్లా  ‘సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌ (Silence Unknown Callers)’ అనే ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్‌  ప్రకటించింది. యూజర్స్ ఈ తరహా కాల్స్‌ వచ్చినప్పుడు ఫోన్‌లో ఎలాంటి రెస్పాన్స్‌ ఉండదు. అంటే రింగ్‌ (ring) రావడం కానీ, స్క్రీన్‌పై కాల్‌ వస్తున్నట్లుగా కనిపించదని వాట్సాప్ సంస్థ తెలిపింది. అయితే.. కాల్‌ లిస్ట్‌లోకి వెళితే మాత్రం ఆ నెంబర్ నుండి కాల్‌ వచ్చినట్లు కనిపిస్తాయని స్పష్టం చేసింది. తద్వారా ఒకవేళ ఏవైనా ముఖ్యమైన కాల్స్‌ ఉంటే చూసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.అయితే దీనికంటే ముందు ప్రైవసీ చెకప్‌ (Privacy check up) అనే ఫీచర్‌ను వాట్సాప్‌ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆలస్యం ఎందుకు వాట్సాప్ లో ఇప్పుడే ఈ ఫీచర్ ని వాడుకుని అన్ నోన్ కాల్స్(unknown ) కి చెక్ పెట్టేయండి .