సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3తో క‌థానాయిక‌గా తొలి అడుగేసింది  అందాల భామ స‌యీ మంజ్రేక‌ర్ .  బాలీవుడ్ ద‌ర్శ‌కుడు, న‌టుడు మ‌హేశ్ మంజ్రేక‌ర్ కూతురు స‌యీ మంజ్రేక‌ర్ (Saiee manjrekar).ఇప్పుడు టాలీవుడ్ లో రెండు సినిమాల్లో బిజీ గా ఉంది .’

saiee manjrekar

తాజాగా స‌యీ మంజ్రేక‌ర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రెనైసేన్స్ పిక్చ‌ర్స్ ఈ విష‌యాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ‌జేసింది. మేజ‌ర్, గ‌ని,ఈ మూవీల తో స‌యీ మంజ్రేక‌ర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతుంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈమె రెండు సినిమాలు కూడా ఒకే నెల‌లో వారాల గ్యాప్ లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

వివరాల్లో కి వెళ్తే

అడివి శేష్ క‌థానాయ‌కుడిగా,  స‌యీ మంజ్రేక‌ర్ కథా నాయికగా , శ‌శి కిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న” మేజ‌ర్ ” చిత్రం . ఎన్​ఎస్​జీ కమాండర్ మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్ జీవత చరిత్ర నేపథ్యంలో ​ తెరకెక్కుతోంది. తాజ్​​ హోటల్​లో చిక్కుకున్న 14 మందిని రక్షించే క్రమంలో 26/11 దాడుల సమయంలో సందీప్​ ఉన్నికృష్ణన్ తన  ప్రాణాలను కోల్పోయారు.​ సందీప్​ ఉన్నికృష్ణన్  జీవిత చరిత్ర తో ఈ మూవీ సూపర్​స్టార్ మహేశ్​బాబు జీఎమ్​బీ ఎంటర్​టైన్​మెంట్స్ (GMB Entertainments), సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం జూలై 2న (July 2)విడుదల కు సిద్ధం గా ఉన్నది.

మరొక చిత్రం

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా మూవీ(Sports drama movie) “గ‌ని”. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ (Boxer) గా మన ముందు  కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడట వరుణ్ తేజ్ . బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడట . ఈ చిత్రం లో కూడా అందాల భామ స‌యీ మంజ్రేక‌ర్ , వ‌రుణ్ తేజ్ సరసన మన ముందుకు రానున్నది .

ఈ చిత్రం  జూలై 30(July 30)న జ‌నం ముందుకు రానున్నదని సమాచారం.

మొత్తానికి ఈ అమ్మడు ఒకే నెలలో రెండు సినిమాల్లో మన తెలుగు వారి ముందుకు రానున్నది. ఒకే నెలలో రెండు సినిమాల్లో సంద‌డి చేయ‌నున్న స‌యీకి తెలుగు చిత్రాలు ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తాయో చూడాలి.

తెలుగు వారిని ఈ అమ్మడు తన నటన,అందచందాలతో ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం.