సొట్ట బుగ్గల సుందరిగా, ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల నటి తాప్సీ పన్ను (Taapsee Pannu). పలు భాష‌ల్లో సినిమాలు చేస్తూ విభిన్న నటిగా పేరు తెచ్చుకుంది.మహిళా ఆధిక్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ తనకుంటూ ఒక  ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అంతేకాకుండా ఏకంగా బాలీవుడ్ కి మకాం మార్చేసింది.

ఈ భామ  ప్రస్తుతం  ర‌ష్మీ రాకెట్‌, త‌మిళం‌లో జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాతోపాటు మ‌రో సినిమా కూడా చేస్తోంది.

పెళ్లి గురించి తాప్సీ మాట్లాడుతూ..

గతంలో ఈ భామను లవ్‌ లైఫ్‌ గురించి ఎప్పుడు అడిగినా ఎప్పుడూ స్పందించలేదు….

‘నేను ఏదో ఒక‌సారి అయిదారు సినిమాలు చేయ‌డానికి బ‌దులు రెండు మూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడ‌తాను. అప్పుడే నా వ్య‌క్తిగ‌త జీవితం కోసం స‌మ‌యాన్ని కేటాయించే అవ‌కాశం లభిస్తుందని ఆశిస్తాను. ప్ర‌స్తుతానికి త‌న దృష్టి అంత మూవీల పైనే అని, త‌ర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని అంటుంది  తాప్సీ.

ఇపుడు

బాలీవుడ్‌ లో బిజీ అయిన తరువాత ఈ భామ తనకు బాయ్‌ ఫ్రెండ్ ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చినా అతనెవరో మాత్రం వెల్లడించలేదు.

ఇటీవల తాప్సీ మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లడం, అక్కడికి తన బాయ్ ఫ్రెండ్  మథియాస్  రావడం వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా తాప్సీ షేర్ చేయడం వలన తనని అందరికి పరిచయం చేయక తప్పలేదు.

దీనితో ఇపుడు  తాను ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌ బోతో ప్రేమలో ఉన్నాను అని వెల్లడించింది తాప్సీ….

నాకు సంబంధించిన వారి పుట్టినరోజుల్లో,ఫంక్షన్ల్లో  పాల్గొన్నపుడు ఏదో ఒక స్టిల్ను పంచుకుంటాను.

త‌న రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి పబ్లిక్‌గా ఎప్పుడూ మాట్లాడ‌రెందుక‌ని తాప్సీని  అడగ్గా.. ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తితో డేట్ చేయ‌డం తనకిష్టం లేదని తెలిపింది. ‘నా వ్య‌క్తిగ‌త, వృత్తిప‌ర‌మైన జీవితాలు వేర్వేరుగా ఉంచాలనుకుంటాను. అందుకే వేరే రంగానికి చెందిన మాథియాస్‌ తో ప్రేమలో పడ్డాను. అతడు నా అంతర్గత జీవితంలో కీలకంగా మారాడు’ అని  చెప్పుకొచ్చింది తాప్సీ.

ఇలా చెప్తూ మొత్తానికి తను రిలేషన్ లో ఉన్నాను అని చెప్పకనే చెప్పింది. చూద్దాం ఈ రిలేషన్ పెళ్లి కి దారి తీస్తుందో లేదో…