ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి తన బర్త్ డే (Birthday)సందర్భంగా ఆయన మూవీ అప్ డేట్స్ (Movie Updates) తో ఫాన్స్ (Fans) ని సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.

తాజా గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే (Power Star Pavan Kalyan Birthday0 సందర్భంగా, అభిమానులకు తన మూవీ అప్ డేట్స్ తో సర్ప్రైజ్ చేయనున్నారు.

మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా అయ్యప్పన్ కోషియమ్. ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ (Remake)భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ (Police Character) పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ టీజర్ రిలీజయ్యింది.

ఈ టీజర్ (Teaser) ఇటు పవన్ ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ని అద్భుతం గా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి (Pongal) కి విడుదలచేయనున్నటు సమాచారం.

ఈ మూవీ లో రానా దగ్గుబాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నిత్య మీనన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం లో సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం (Direction) వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజా గా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కి సంబంధించిన ఆడియో రైట్స్ (Audio Rights) భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) దాదాపు 5.04 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

అయితే దీని కి సంబంధించిన వార్త అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే కి సంబంధించిన ఫస్ట్ సింగల్ రిలీజ్ కి రెడీ గా వుంది. పవన్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే.

క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రానికి హరి హర వీర మల్లు అనే పేరు ను ఖరారు చేసారు. ఈ మూవీ పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ (High Budget) తో రూపొందిస్తున్నారు.

ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ సెట్లు వేస్తోంది. ఈ మూవీ భారీ సెట్ల కోసం పెద్దమొత్తం లో ఖర్చు చేస్తున్నారట. చారిత్రక నేపథ్యంలో పవన్ నటిస్తున్న చిత్రం కావడం తో , ఈ చిత్రం పై అంచనాలు భారీ గానే వున్నాయి.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ (Surya productions Banner) పై ఏ ఏం రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ (Bollywood Beauty) జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం (Music) కీరవాణి అందిస్తున్నారు.

దానితో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఇది వీరి కాంబినేషన్ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ (Black Buster)  గా నిలిచింది. ప్రస్తుతం తెరకెక్కనున్న, ఈ చితం కమెర్షియల్ మూవీ గా రానున్నట్లు తెలుస్తోంది.

న్యుట్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ (Lecturer) గా కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, ఈ మూవీ కి సంచారి అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం.

దీని పై అఫిషియల్ గా ప్రకటన రావాల్సి వుంది.

మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా చిరు లాగానే తన బర్త్ డే నాడు ప్రేక్షకులని సర్ప్రైస్ (Surprise) చేయనున్నారట !