నిమ్మరసంలోని అనేకమైన బ్యూటీ(Beauty) మరియు హెల్త్ బెనిఫిట్స్ (Health benefits) కురులకు ఎక్కువ ప్రయోజనం కల్పిస్తుంది.

నిమ్మరసం జుట్టు రాలడం లేదా జుట్టు సమస్యలను నివారించడం మాత్రమే కాదు, దీనిలో ఉండే  సిట్రస్ జ్యూస్ (Citrus juice)  జుట్టు పెరుగుదలకు మరియు బలమైన జుట్టు సహజంగా పొందడానికి కూడా  అద్భుతంగా సహాయపడుతుంది.

మార్కెట్ లో చౌకగా లభించే నిమ్మకాయలో మన జుట్టు పోషణకు అవసరమయ్యే పోషకాలు బహు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో విటమిన్‌ బి, సి, పాస్ఫరస్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టు డ్యామేజీ తగ్గించి, జుట్టు పెరుగుదల (Hair growth) ను ప్రోత్సహిస్తుంది.

తలలో పేనుతో బాధపడుతున్నావారు –  ఒక టేబుల్ స్పూన్ (Table spoon) నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ ల  బాదం నూనె (Badam  oil) లేదా వేపనూనెను మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా పేలను నిర్మూలించడానికి నిమ్మరసంలో కొంచెం వెల్లుల్లిని మిక్స్ చేసి కూడా తలకు అప్లై చేయవచ్చు.

వారంలో కనీసం ఒక రోజైన నిమ్మరసాన్ని జుట్టు కుదళ్లకు బాగా పట్టించి మృదువుగా మసాజ్‌ (Massage) చేసుకుంటే జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి. జుట్టుకు నిమ్మరసం అప్లై చేయడం వలన కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే..

జుట్టు పెరుగుదల: నిమ్మరసాన్ని ఆముదం లేదా ఆలివ్ ఆయిల్ తో మంచిగా మిక్స్ చేసి, తలకు మసాజ్ చేయాలి. అలాగే ఒక గంట పాటు వదిలేసి తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయాలి.

నిమ్మరసం, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టించి మృదువుగా మర్ధన చేయండి. సుమారు అరగంట తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయండి. తరచుగా ఇలా చేయడం వలన జుట్టురాలడం, జుట్టు పలుచబడటం వంటి సమస్యలు తగ్గి బాగా ఒత్తుగా పెరుగుతుంది.

పేల సమస్యతో బాధపడేవారు నిమ్మరసం, బాదం నూనె లేదా వేపనూనెను మిక్స్‌ చేసి తలకు పట్టించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

నేచురల్ హై లైటర్: జుట్టు రంగు సహజంగానే పొందాలంటే కొంచెం నిమ్మరసాన్ని బాగా తలకు పట్టించాలి. ఇది జుట్టుకు నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

సేంద్రీయ గోరింటను (Henna) తీసుకొని రాత్రంతా ఫిల్టర్ చేసిన గ్రీన్ టీలో నానబెట్టండి. మీ జుట్టుకు మాస్క్ వేసుకునే ముందు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. కండిషనింగ్ (Conditioner) కోసం, మీరు ఒక చెంచా పెరుగును కూడా జోడించవచ్చు. ఈ హెన్నా (Henna)మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి, సుమారు ఒక 40 నిమిషాలు అలాగే ఉంచండి. మీకు ముదురు రంగు కావాలంటే, కాసేపు అలాగే ఉంచండి. మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.

అంతేకాకుండా జుట్టుకు నిమ్మరసాన్ని బాగా పట్టించి, బాగా మసాజ్‌ చేయడం ద్వారా సహజంగానే చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు.

జిడ్డు జుట్టు:

నిమ్మరసం తలలో ఏర్పడే అన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల(Infection)ను నివారిస్తుంది. తలను కేశాలను శుభ్రంగా ఉంచుతుంది. జిడ్డు సమస్యను తగ్గిస్తుంది.

నిమ్మరసంతో మరో ఉపయోగం, తలలో అధనపు నూనె గ్రంథుల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో తలను శుభ్రంగా ఉంచుతుంది మరియు జిడ్డును కూడా నివారిస్తుంది.

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది: ఆలివ్ ఆయిల్ నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేసి తలకు, కేశాలకు బాగా పట్టించడం వల్ల జుట్టు చిట్లడాన్ని నిరోధిస్తుంది.

ఒక నిమ్మరసం, 1 స్పూన్ ఆలివ్ నూనె , 1 స్పూన్ ఆముదం నూనె తీసుకోండి. వాటిని ఒక గిన్నెలో కలపండి , మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయండి. ఈ మిశ్రమంతో మీ తలపై కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి. ఒక గంట లేదా రెండు గంటల తర్వాత, కడిగేయండి. మీరు ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

ఆముదం నూనెలో ప్రోటీన్లు, ఖనిజాలు , విటమిన్ ఇ బహు పుష్కలంగా ఉంటాయి , అందువల్ల మీ జుట్టుకు ఔషధంగా పనిచేస్తుంది. అదనంగా, ఆముదం నూనెలో రిసినోలిక్ యాసిడ్ , ఒమేగా 6 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఇవి తలకు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి, తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

షైనీ హెయిర్(Shiny hair): మీరు నిర్జీవంగా మరియు పొడి బారిన జుట్టుతో బాధపడుతుంటే?నిమ్మరసం మరియు పెరుగు మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది షైనీ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది.

2 టీస్పూన్ల నిమ్మరసంలో ఒక టీస్పూన్ కలబంద జెల్ కలపండి. అలోవెరా అనేది నేచురల్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్, ఇది తలపై శిలీంధ్రాల పెరుగుదలను ఆపుతుంది. ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.

నిమ్మకాయలాగే, కలబంద కూడా మన చర్మం , జుట్టుకు బాగా మేలు చేస్తుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు (Vitamins), అవసరమైన జింక్ , అమైనో ఆమ్లాలు , రాగి వంటి ఖనిజాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

చూసారా … నిమ్మ వలన ఎన్ని ప్రయోజనాలో ..ఇక ఆలస్యం ఎందుకు , నిమ్మకాయ తో మీ జుట్టు కి సంరక్షణ చేసుకుని పట్టు కురులను ఆనందిచండి …