మనకు ఈ మధ్య మనం కనీ వినీ ఎరుగని అంటూ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయి అని ఆలోచిస్తుండవచ్చు. కారణం, క్రిముల బలం పెరగడం కాదు క్రిముల సంఖ్య కోటి రెట్లుగా ఎక్కడపడితే అక్కడ పెరగడం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ క్రిములను (బాక్టీరియా) మనమే ఎక్కడపడితే అక్కడికి మోసుకుంటూ తిరుగుతున్నాం. మనం రోజు వాడే వస్తువుల్లోనే కొన్ని కోటి రెట్లు బాక్టీరియా ను కలిగి ఉన్నాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవేంటో ఒక అవగాహన కలిగించేందుకే ఇవి. చదవండి మరి.

1. సెల్ ఫోన్: అతి మురికైన వస్తువుల్లో దీనికి మొదటి స్థానం దక్కింది. ఎందుకంటే దీనిని ఎక్కడపడితే అక్కడ చేతులలో ఏమి ఉన్నా అలాగే వాడేస్తుంటాం. కొన్న నాటి నుంచి దానిని కడగాల్సిన పని లేదు. ఏళ్లకేళ్ళు దానిని హోటళ్ళలో, ఇంట్లో, ఆఫీస్లలో రైల్వే, బస్సు స్టేషన్ లో పెడుతుంటాం. ఇక కొంత మందైతే ఈ సెల్ ఫోన్ ను బాత్ రూమ్ లో కూడా వాడేస్తుంటారు. ఇక తాజాగా US National Library of Medicine National Institutes of Health చేసిన ఒక సర్వే లో ఒక ఫోన్ మీద 17000 పైచిలుకు బాక్టీరియా ఉంటుందట. ఈ లెక్కన మనo ఎన్ని రకాలా బాక్టీరియా కి ఆలవాలమై ఉన్నామో ఎవరికీ వారే అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఇకనైనా ఎవరి ఫోన్ వారు, ఖచ్చితంగా వారానికి ఒకసారి disinfectant lotion తో శుభ్రం చేసుకుంటే మంచిది.

2. కీబోర్డ్: అవును మీ డెస్క్టాపు లేదా లాప్టాప్ కీబోర్డ్ రెండవ మురికైన వస్తువు. ఎందుకంటే కార్యాలయాల్లో, పబ్లిక్ నెట్ కేఫ్లలో ఎంతో మంది మురుకి చేతులతో నిత్యం వీటిని తాకుతూ ఉంటారు. Chicago కు చెందిన Northwestern Memorial Hospital బృందo చేసిన ఒక పరిశోధనలో తేలింది ఏమంటే, ఈ కీబోర్డు మీద MRSA, VRE వంటి డ్రగ్ రెసిస్తంట్ బాక్టీరియా సుమారు 24 గంటలకు పైనే ఈ కీబోర్డ్ పైన ఉండగలదు. పబ్లిక్ కేఫ్ ల దగ్గర నుంచి వ్యక్తిగత లాప్టాప్ల వరకు కీబోర్డ్ లను వారానికి ఒకసారి isopropyl alcohol లో ముంచిన దూదితో శుభ్రం చేసుకుంటే మంచిది.

3. కార్ స్టీరింగ్ వీల్:
చాలా మందికి డ్రైవింగ్ చేస్తూ ఎదో ఒకటి తినడం, తాగడం అలవాటు ఉంటుంది. అంతే కాదు డ్రైవర్లు రెస్ట్ రూమ్ కు వెళ్లి వచ్చి అవే చేతులతో తెలిసోతెలియకో స్టీరింగ్ వీల్ ముట్టుకుంటారు. ఇది చాలు క్రిములు వేలకు వేలు పెరగడానికి. స్టీరింగ్ వీల్ మీద 10 చ.సెమీ ల మేరలో 700 బాక్టీరియా ఉంటుందట. అందువల్ల ఇక పై కారును లోపల బయటా శుభ్రం చేసుకోవడం చాలా ఆవశ్యకం.

4. వంటింటి గుడ్డలు:
ఇంట్లో వంటింటి గట్టును శుభ్రపరచడానికి వాడే స్పాంజ్ లేదా గుడ్డలు కూడా అత్యంత మురికైనవి. ఎందుకంటే వీటిని చాలా మంది ఆడవారికి సబ్బుతో ఉతికి, ఎండలో ఎండబెట్టే అలవాటు ఉండదు. అలాగే తడిపి అలాగే వాడేస్తుంటారు. ఈ తేమ వల్ల అవి అత్యధిక సంఖ్యలో బాక్టీరియా ను కలిగి ఉంటాయి. University of Arizona చేసిన ఒక పరిశోధనలో ఈ స్పాంజ్ల మీద కేవలం salmonella అనే రకం బాక్టీరియా ఉందట. ఇది చాలా ప్రమాదకరమైన బాక్టీరియా. అందువల్ల వీటిని ఉపయోగించే వారు, ఈ గుడ్డలు లేదా స్పాంజ్లను వేడి నీటిలో నానబెట్టి, ఉతికి ఎండకు ఆరేస్తే మీ వంటిల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఏమంటారు.

5. వెజిటబుల్ కటింగ్ బోర్డు:
చాలా మంది దీని పై శ్రద్ధ పెట్టారు కానీ ఇవి కూడా చాలా చాలా మురికిగా ఉంది బాక్టీరియా కు స్థానమై ఉంటుంది. ఇక నాన్ వెజ్ వండే ఇళ్ళల్లో అయితే, ఆ మాంసం వల్ల ఈ బోర్డు మీద ఒక టాయిలెట్ సీట్ మీద కంటే ఈ బోర్డు మీద 200 రెట్లు ఎక్కువ బాక్టీరియా ఉంటుందట. అందువల్ల మాంసాహారులు కాయగూరలకు ఒక బోర్డు, మాంసాహారానికి ఒక బోర్డు ఉపయోగించడం శ్రేష్టం. అంతే కాదు వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

ఇక్కడితో అయిపోలేదు ఇంకా కరెన్సీ, ATM, బాత్ టబ్లు, పబ్లిక్ రెస్ట్ రూమ్లు, ఆసుపత్రులలోని డోర్ హేండిల్స్ మీద కూడా భయంకరమైన బాక్టీరియా ఉంటుందట.

అందువల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారు వీటి పై దృష్టి పెడితే మరింత మంచిది. ఇక చీటికీమాటికీ జబ్బు పడే వారు ఒకసారి పై అంశాలను దృష్టిలో పెట్టుకుని వీటిని స్పృశించిన తరువాత చేతులు కడుక్కోవడం వంటివి చేస్తే అనారోగ్యం బారిన పడే అవకాశం తగ్గుతుంది.

అన్నిటికీ మించి మీ ఇళ్ళు మొత్తం శుభ్రంగా ఉండాలంటే ముందు బయట నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం అసలు మరిచిపోవద్దు.

Courtesy