ఓటీటీ (OTT)ల్లో ప్ర‌సారం అయ్యే వెబ్ సీరిస్ (Web series)ల‌కు సంత‌కం చేశారంటే..ఇక  ఎంత మ‌డిగ‌ట్టుకు క‌నిపించిన హీరోయిన్లు అయినా, వారెంత స్టార్ హీరోయిన్స్(star heroines) అయినా హాట్ హాట్ గా రెచ్చిపోవాల్సిందేనేమో! ఎందుకంటే ,తెలుగు స్టార్లుగా, కొంత ప‌రిమితుల‌ను ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ లు కూడా  వెబ్ సీరిస్ ల‌లో భిన్నంగా క‌నిపించ‌డంతో ఇలా అనుకోవాల్సి వ‌స్తోంది.

ఒక వెబ్ సీరిస్ లో త‌మ‌న్నా హాట్ నెస్ చ‌ర్చ‌లో నిలుస్తున్న నేప‌థ్యంలో.. గ‌తంలో నిత్యామేన‌న్, స‌మంత‌లు కూడా వెబ్ సీరిస్ ల‌తోనే ఇలాంటి చ‌ర్చ‌లో నిలిచిన విష‌యాన్ని ప్ర‌స్తావించుకోవ‌చ్చు. సినిమా తెర‌పై చాలా ప‌రిమితుల‌తో క‌నిపిస్తుంది నిత్యామేన‌న్. త‌న అందంతో క‌న్నా అభిన‌యంతోనే ఆమె మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

గ్లామ‌ర్  షో (Glamour show) ,ఎక్స్ పోజింగ్ వంటి వాటికి దూరం అనిపించుకుంది. బాల‌న‌టిగా తెర‌పైకి వ‌చ్చిన నిత్య 2010 స‌మ‌యంలో హీరోయిన్ గా మారి దాదాపు ద‌శాబ్దం పాటు సినిమాల‌తో బిజీగానే గ‌డిపింది. ప్ర‌త్యేకంగా నిలిచింది. అలాంటి నిత్యా మేన‌న్ ను ఒక లిప్ లాక్ సీన్ (Lip lock scene)లో ఊహించుకోవ‌డం పెద్ద తెర‌పై చాలా క‌ష్ట‌మ‌య్యేది.

కానీ ఆ మ‌ధ్య ఒక వెబ్ సీరిస్ లో నిత్య మీనన్ లెస్బియ‌న్ శృంగార స‌న్నివేశాల్లో న‌టించి అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అప్ప‌టికే ఏదో సినిమాలో ఆమె ఒకసారి లెస్బియ‌న్ త‌ర‌హా రోల్ చేసినా, దానిలో అలాంటి సీన్లేమీ ఉండ‌వు. పెద్ద తెర‌పై ఏ ఒక్క హీరోతోనూ ముద్దుముచ్చ‌ట‌లు చేయ‌ని నిత్య ఓటీటీలో మాత్రం తన పెద‌వుల‌ను క‌లిపేసింది! మ‌రి ముద్దు సీను అంటే అది మ‌గాడితో చేస్తే ఒక‌టి, ఆడ‌వాళ్ల‌తో చేస్తే మరొకటి అనుకోవాలా, ఏమో మ‌రి!

ఫ్యామిలీ మ్యాన్ 2 మూవీ  లో స‌మంత బోల్డ్ స‌న్నివేశాల్లో క‌నిపించింది. అయితే వాటిల్లో కొన్ని సీన్ల‌లో స‌మంత స్థానంలో డూప్ క‌నిపించి ఉండ‌వ‌చ్చు కానీ, అధికారికంగా అయితే మాత్రం  ఆమే న‌టించిన‌ట్టు! ఆమె చేసిన రోల్ కు త‌గ్గ‌ట్టుగా సీన్లు ఉన్నా,వైవాహిక జీవితంలో మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు ఈ వెబ్ సీరిస్సే కార‌ణ‌మ‌య్యింద‌నే ప్ర‌చార‌మూ కూడా  జ‌రిగింది.

ఇక నో కిస్సింగ్ పాల‌సీ (No Kissing ploicy) అంటూ, ఇన్నాళ్ల పాటు పరిశ్రమలో నెట్టుకు వ‌చ్చింది త‌మ‌న్నా. ఆమె ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హీరోయినే ఐనా చాలా ప‌రిమితుల‌తో ఒక ద‌శాబ్దంన్న‌ర పాటు బాగానే నెట్టుకువ‌చ్చింది.

అంతేకాకుండా బ‌య‌ట ఎక్క‌డైనా ఫ్యాన్స్ అడిగినా కూడా తను ఫొటోల‌కూ, సెల్ఫీల‌కు స్ట్రిక్ట్ గా నో (No) చెప్పేది. అయితే ఇండ‌స్ట్రీలో మాత్రం అంతా డ‌బ్బే ప్ర‌ధానంగా వ్య‌వ‌హ‌రిచింద‌ని ఆమెతో ప‌ని చేసిన వారంతా చెప్పారు. అంటే తన స్టార్ డ‌మ్ కొద్దీ డ‌బ్బులు బాగా డిమాండ్ చేసింది.

మొద‌ట్లో అవ‌కాశాలు తనకు ఇచ్చారు, హిట్ ఇచ్చారు అంటూ వారి కోసం త‌క్క‌వ డ‌బ్బుకు ప‌ని చేయ‌డానికి కూడా స్ట్రిక్ట్ గా నో చెబుతుంద‌ని త‌మ‌న్నాకు పేరు. అయిన‌ప్ప‌టికీ డ‌బ్బు కోస‌మే అయినా, తెర‌పై మాత్రం తను నో కిస్ పాల‌సీ అంటూ మెయింటెయిన్ (maintain)చేసింది! అయితే ఇప్పుడు మ‌రి ఆమె పాల‌సీని కూడా ఓటీటీ అడ్ర‌స్ (address)లేకుండా చేసింది అనే చెప్పాలి .

ఓటీటీ-వెబ్ సీరిస్ లు అవకాశాలు వ‌చ్చి కూడా క‌ట్టు దాట‌ని, ఆ అవ‌స‌రం రాని హీరోయిన్లు ప్రియ‌మ‌ణి (priyamani)వంటి వారు కొంద‌రున్నారు. అయితే మరి ముందు ముందు మాత్రం వెబ్ సీరిస్ ల వైపుకు వ‌చ్చే టాప్ హీరోయిన్లు(top heroines) కూడా బోల్డ్ బాట‌లో న‌డ‌వ‌క త‌ప్ప‌దేమో!