నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(Medical Science) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్(Social Worker), డేటా ఎంట్రీ ఆపరేటర్(Data Entry Operator) వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఒక సంవత్సరం కాంట్రాక్ట్ విధానంలో(Contract Base) పని చేయాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా పోస్టుల వివరాలిలా..

  1. సోషల్ వర్కర్ (Social Worker) విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి.
  2. డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator) విభాగంలో మొత్తం 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి.

ముఖ్య సమాచారం

సోషల్ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి లైఫ్ సైన్స్(Life Science) విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో ఒకటి లేదా రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం(Computer Knowledge) ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా డిగ్రీ(Degree) అర్హత ఉండాలి. దీంతో పాటు.. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ముఖ్యంగా సెక్రటేరియల్ స్కిల్స్‌(Secretariat Skills) తో పాటు లోయర్ లేదా హైయర్ లో డేటా బేస్‌ల(Data Bases)ను టైప్ చేయగలగాలి.

వయోపరిమితి: అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల(Age) మధ్య ఉండాలి.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30 వేల నుంచి రూ.19 వేల వరకు చెల్లిస్తారు. సోషల్ వర్కర్ కు రూ.30వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.19 వేలు చెల్లిస్తారు.

దరఖాస్తుల(Application)ను ఆఫ్ లైన్(Offline) విధానంలో పంపించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్(Official Website) నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్(Download) చేసుకొని ఫారమ్ లో పూర్తి వివరాల(Full Details)ను నింపాలి. దానితో పాటు విద్యార్హత సర్టిఫికేట్ల(EQ Certificate)ను జతచేసి ది డీన్, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ -500082, తెలంగాణ అడ్రస్ కు జనవరి 25, 2023 లోపు పంపించాలి. అప్లికేషన్ పంపే ఎన్వలప్ పై నోటిఫికేషన్ నంబర్ ను తప్పనిసరిగా రాయాలి.  నోటిఫికేషన్ నంబర్ Notification No:AC-3/R&P/593/2022. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పీడీఎఫ్(PDF) కొరకు వెబ్సైటు ని సందర్శించండి