బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) పదకొండో వారం ముగిసింది. ఈ వారం హౌస్ మేట్స్(House mates) టాస్క్ లో చాలా మైండ్ గేమ్ ఆడారు. గొడవలు, రచ్చ లతోనే కాకుండా లవ్ ట్రాక్ లు, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం లాంటివి చూడడానికి ప్రేక్షకులకు విసుగుపుటించారు.

శనివారం నాగ్ సార్ ఇచ్చిన అడ్వైజ్ తో సెట్ రైట్ అయినా హౌస్ మేట్స్. ఇక సండే ఫండే రోజు కాబట్టి సెలబ్రిటీస్(Celebrities) కూడా బిగ్ బాస్ స్టేజి పై సందడి చేసారు. ఇక ఈ వారం హౌస్ మేట్స్ తో  ఆటలు ఆడించినప్పటికీ పెద్ద గా ఎంటర్టైన్ చేయలేకపోయారు. పైగా ఈ రోజు ఎలిమినేషన్ ప్రక్రియ వుంది.

ఇంతకీ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్లారు? నాగ్ సార్ హౌస్ మేట్స్ తో ఎలాంటి గేమ్స్ ఆడించారు. తెలియాలంటే సండే ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చూసేద్దాం….

నాగ్ సార్ హౌస్ జరిగిన ‘వావ్ తాజ్’ టాస్క్‌ ని టీవీ లో చూపించారు. ఒక్క కప్పు టీ, మీ కంటూ ఒంటరిగా ఒకరోజు గడిపే రోజు వస్తే ఎలా ఉంటారు అని చెప్పమంటూ వావ్ తాజ్‌ను ప్రమోట్(Promote) చేశారు. కంటెస్టెంట్లు తమ తమ అభిప్రాయాలను, ఊహలను, ఆశలను పంచుకున్నారు.

ప్రతీ ఒక్కరూ తమ తమ ఊహా ప్రపంచం గురించి తెలిపారు.ఆ తరువాత హౌస్ మేట్స్(House mates) తో నాగార్జున గేమ్స్ ఆడించాడు. ప్రశ్నకు వేళాయే అంటూ, కంటెస్టెంట్లు(Contestants) వేసిన ప్రశ్నలని కంటెస్టెంట్లకే వేసి వాటి సమాధానాలు బయటకు వచ్చేలా చేశాడు. ఇందులో భాగంగా మొదట శ్రీరామచంద్రకు ప్రశ్నలు వేశాడు నాగార్జున. ఆ ప్రశ్నలు మానస్ అడిగాడు.

మాస్కులతో ఉన్నావా? బాగా నటిస్తున్నావా? అని ప్రశ్నలు వేశాడు.అయితే హౌస్‌మేట్స్‌ మాత్రం అలాంటిదేం లేదని అతడు మంచివాడని చెప్పాడు. షణ్ముఖ్‌ వల్ల సిరి గేమ్‌లో వెనకబడుతుందా? సిరి-షణ్ను ముందుగా అనుకుని బిగ్‌బాస్‌(Big Boss)కు వచ్చారా? అన్న ప్రశ్నలకు సైతం కాదని బదులిస్తూ కంటెస్టెంట్లు సిరికే మద్దతు పలికారు.

ప్రియాంకతో నీ ఫ్యూచర్‌ రిలేషన్‌ ఏంటి ? అన్న ప్రశ్నకు మానస్‌ ఒక్కముక్కలో ఫ్రెండ్‌షిప్‌(Friendship) అని తేల్చేశాడు. నువ్వు మానస్‌ నుంచి ఏం ఎక్స్పెక్ట్‌ చేస్తున్నావని నాగ్‌ ప్రియాంకను సూటిగా అడగ్గా.. ఆమె మంచి ఫ్రెండ్‌షిప్‌ ఆశిస్తున్నానని చెప్పింది. ఎందుకు సిరి వెనకాల ఆమెపై జోక్స్‌ వేస్తావని ప్రియాంకను అడగ్గా ముందు వేసే జోక్సే వెనకాల కూడా వేస్తానని జవాబిచ్చింది  పింకీ. నువ్వు బీబీ టైటిల్‌(BB Tittle) గెలవడానికి వచ్చావా? గెలిపించడానికి వచ్చావా? నీ బ్రెయిన్‌ ఎప్పుడు వాడతావు? అన్న ప్రశ్నకు తాను టైటిల్‌ గెలవడానికే వచ్చానని చెప్పాడు సన్నీ.

శ్రీరామ్‌ను ఇన్‌ఫ్లూయెన్స్‌(Influence) చేయడానికి ప్రయత్నిస్తున్నావా? అన్న ప్రశ్నకు రవి లేదని చెప్పాడు. చుట్టూ ఉన్నవాళ్లను ఎందుకు వాడుకుంటున్నావన్న ప్రశ్నకు కంటెస్టెంట్లు ఉన్నదే వాడుకోవడానికి అని తెలివిగా రిప్లై ఇచ్చాడు. తర్వాత నాగ్‌ కాజల్‌ను సేవ్‌(Save) చేశాడు.

తరువాత  ‘అనుభవించు రాజా’ హీరోహీరోయిన్లు రాజ్‌ తరుణ్‌, కౌశిష్‌, నటుడు నెల్లూరు సుదర్శన్‌ బిగ్‌బాస్‌Big Boss) స్టేజీపై సందడి చేశారు. కాసేపు హౌస్‌మేట్స్‌(House mates) తో చిట్‌చాట్‌ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. ఇందులో హౌస్ మేట్స్ కి బొమ్మలు గీసే టాస్క్(Task) ఇచ్చాడు.

రెండు టీంలుగా విడొగొట్టారు. కంటెస్టెంట్ల(Contestants) పేర్లను చెబితే బొమ్మల రూపంలో వారిని కనిపెట్టాలి. అలా ఈ టాస్క్‌ లో షన్ను, సిరిలను హగ్స్ రూపంలో ఆనీ మాస్టర్ గీసి చూపించింది.ఇక ఇదే టాస్క్‌లో సుదర్శన్  హౌసేమట్లు మీద కొన్ని సెట్టైర్లు వేశాడు. బయట ఇంకో ఇద్దరున్నారని గుర్తు పెట్టుకోండని సెటైర్ వేశాడు. ఇక కశీష్ ఖాన్ కోసం తెలుసా మనసా అనే పాటను శ్రీరామచంద్ర పాడాడు. చివరకు అనుభవించు రాజా స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. అనుభవించు రాజా టీం(Movie Team) మొత్తానికి గుడ్ బై చెప్పేసింది.

ఆ తరువాత మైకులో మాట్లాడటం, చప్పట్లు వస్తే సేఫ్ అయినట్టు అని చెప్పడంతో అందరూ మాట్లాడారు. కానీ మానస్, షన్నులకు మాత్రమే చప్పట్ల శబ్దం రావడంతో వారిద్దరూ సేఫ్(Safe) అయ్యినట్టు ప్రకటించిన నాగ్. ఆ తరువాత డైలాగ్ కొట్టు గురూ అనే టాస్క్(Task) పెట్టాడు.ఈ టాస్క్ లో  ఒక్కో డైలాగ్‌ను ఒక్కొక్కరికి అంకితమివ్వాలంటూ ఓ సరదా ఆట  ఆడించాడు నాగ్‌.’నన్ను రెచ్చగొట్టకు’ అన్న డైలాగ్‌ను మానస్‌, సన్నీకిచ్చాడు.’నమ్మకం లేదు దొర’ డైలాగ్‌ను షణ్ను, రవికిచ్చాడు. రవి ‘సరె సర్లే చాలా చూశాం’ అన్న బోర్డును షణ్నుకిచ్చాడు. యానీ ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా నీలో కమల్‌ హాసన్‌’ అన్న డైలాగ్‌ బోర్డును రవికి ఇచ్చారు.

మానస్‌కు ‘ఓన్లీ వన్స్‌ ఫసక్‌’ బోర్డును ప్రియాంక ఇచ్చింది. ఏమో సర్‌, నాకు కనబడదు’ డైలాగ్‌ షణ్నుకు సరిగ్గా సెట్టవుతుందన్నాడు శ్రీరామ్‌. ‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అనేది షణ్నుకు, తనకు ఇద్దరికీ సెట్టవుతుందని చెప్పింది సిరి. శ్రీరామ్‌కు ‘నీ బొందరా నీ బొంద’ డైలాగ్‌ను  అకింతమిచ్చింది కాజల్‌. సన్నీ ‘అయిపాయే’ అనేది రవికి సెట్టవుతుందన్నాడు.

ఆ తరువాత  సిరి, ప్రియాంక సేఫ్‌ అవగా యానీ ఎలిమినేట్‌(Eliminate) అయింది. ఎలిమినేట్ అయ్యి స్టేజి  మీద కు వచ్చిన యాని హౌస్ మేట్స్ ఒక్కఒక్కరి గురించి తన అభిప్రాయం చెప్పింది అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది.

ఇక పన్నెండో వారం మొదలవుతోంది ఈ వారం హౌస్ మేట్స్(House mates) ప్రవర్తన ఎలావుంటుందో, బిగ్ బాస్(Big Boss) ఎలాంటి ట్విస్ట్ లు ఇవ్వనున్నారో మండే ఎపిసోడ్ చూడాల్సిందే.