బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) వీకెండ్ షో మొదలైంది. పదకొండో వారం మొత్తం హౌస్ మేట్స్(House mates) టాస్క్ లు ఆడేటప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూనే వున్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్ ఫూల్ టాస్క్(Task)లో సన్నీ, రవి కి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఇక కాజల్  తీసుకున్న డెసిషన్ కి విసిగిపోయిన అనీ మాస్టర్ కోపంతో చిందులువేసింది. ఇక షన్ను-సిరి, మానస్-పింకీ ల కథ దారి తప్పుతోంది. వాళ్ళుగేమ్ అడకుండా ఎమోషనల్(Emotional) గా  కనెక్ట్(Connect) అవ్వడమేంటో.

శనివారం నాగ్ సర్ షన్ను, సిరి, మానస్, అనీలను కన్ఫెషన్ రూమ్(Confession Room) కి పిలిచి పెర్సొనల్ గా మాట్లాడారు. మరి ఏమో మాట్లాడారో ఎవరెవరికి క్లాస్ ఇచ్చారో ? ఆ హైలైట్స్(HighLights) మీ కోసం.

బిగ్ బాస్(Big Boss) ఇచ్చిన ‘నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా’ టాస్క్‌ లో సన్నీని విజేతను చేయడం కోసం కాజల్‌, కెప్టెన్‌(Captain) మానస్‌తో వాగ్వాదానికి దిగింది. మానస్ అవునంటే, కాజల్ కాదంటూ ముప్పు తిప్పలు పెట్టింది. సన్నీ గెలవాలంటే సిరి, యానీ ఇద్దరి ఫొటో కాల్చేయాల్సిందేనని మొండిపట్టు పట్టింది.

హౌస్‌ అంతా కళ్లలో నిప్పులు పోసుకుంటున్నా తను మాత్రం సన్నీ కోసం ఒంటరిగా ఫైట్‌ చేసింది. మానస్‌ ఎంత నచ్చచెప్పిన కాజల్ ససేమీరా ఒప్పుకోలేదు. వీరిద్దరూ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో యానీ, సిరి ఇద్దరి ఫొటోలు కాలిపోయాయి.

టాస్క్ మొత్తానికి ఒక్కసారైనా ఫొటో కాలని సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌(Eviction free pass) దక్కడంతో సన్నీ ఆనందంతో స్టెప్పులేశాడు.

అయితే సిరి, యానీ మాత్రం డబల్ పేస్ చూపెట్టిందని కాజల్‌ మీద మండిపడ్డాడరు. యానీ అయితే వెక్కెక్కి ఏడుస్తూ వాళ్లతో మాట్లాడేది లేదని శపథం చేసింది. తొండి గేమ్‌లు, నాటకాలంటూ ఆవేశంలో నానా మాటలు అంటూ నోరుపారేసుకుంది. వీరిని కూల్‌ చేయాల్సింది పోయిన రవి ఇంకొంచం నిప్పు రాజేసాడు. ఇప్పుడు ఆడోళ్లను అడ్డం పెట్టుకుని ఆట  ఆడింది సన్నీ కాదా? అంటూ హౌస్‌మేట్స్‌(House mates) ను మరింత రెచ్చగొట్టాడు.

యానీ బాధను చూడలేకపోయిన శ్రీరామ్‌ ఒక అడుగు ముందుకేసి ఆమెను అంతలా ఏడిపిస్తూ, తన ఉసురు పోసుకోవడం అవసరమా? అని ప్రశ్నించాడు. దీంతో బిత్తరపోయిన కాజల్‌ ఉసురు పోసుకోవడం వంటి పెద్దపెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదని, ఇది ఆట అని గట్టిగానే కౌంటర్ వేసింది.

తర్వాత నాగార్జున, కంటెస్టెంట్స్(Contestants) కి  ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌(Best Performer)కు బంగారం, వరస్ట్‌ పర్ఫామర్‌(Worst Performer)కు బొగ్గు ఇవ్వాలని ఓ టాస్క్‌(Task) ఇచ్చాడు. అందులో భాగంగా మాజీ కెప్టెన్‌(Captain) రవిని ఈ టాస్క్ లో గోల్డ్, బొగ్గు ఇవ్వమని ఆదేశించాడు. దాంతో రవి, ప్రియాంక సింగ్‌, మానస్‌, యానీ, శ్రీరామ్‌లకు బంగారం ఇచ్చాడు. సన్నీ, కాజల్‌, సిరి, షణ్నుతో పాటు తనకు తాను బొగ్గిచ్చుకున్నాడు.

ఈ సందర్భంగా నాగ్‌, స్విమ్మింగ్‌ టాస్క్‌ లో సన్నీ మీద పగ తీర్చుకున్నావు  కదా అని రవిని అడగగా అతడు అలాంటిదేం లేదని తెలిపాడు. అలాగే కెప్టెన్సీ(Captency) కంటెండర్స్‌ టాస్క్‌లో శ్రీరామ్‌ దగ్గరున్న నెగెటివ్‌ పవర్‌(Negative Power)ను తీసుకుని బంగారం కోల్పోయి బకరా అయ్యావని సెట్టైర్ ఇచ్చాడు.

బాత్రూం లోపల, బయట తల కొట్టుకుంటూ నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావని నాగ్‌ సిరిని ప్రశ్నించాడు. ఆమను కన్ఫెషన్‌ రూమ్‌(Confession Room)లోకి పిలిపించి మాట్లాడాడు. కోట్లమంది నిన్ను చూసి ఈ అమ్మాయిలా ఉండాలనుకోవాలి కానీ ఈ అమ్మయిలా మాత్రం ఉండకూడదు అని భావించకూడదని క్లాస్ ఇచ్చాడు. అసలేంటి ని ప్రాబ్లెమ్ అని అడగగా.

దీంతో సిరి మాట్లాడుతూ  ‘నేను ఎమోషనల్‌ పర్సన్‌. నేను ఎదుటివాళ్లను హర్ట్‌ చేసే వ్యక్తిని కాను. ఎవరేం అన్నా నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడిచేకొద్దీ షణ్నుతో నా కనెక్షన్‌ ఇంకా ఎమోషనల్‌ అయిపోతుంది. ఇది తప్పా? రైటా? తెలియట్లేదు. లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు. కానీ నేను నటించడం లేదు. నాకు ఈ ఫీలింగ్‌ తప్పని తెలిసినా సరే చేయాలనిపిస్తే చేసేస్తున్నా’ అని చెప్తూ బాధపడింది సిరి.

ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే బిగ్‌బాస్‌(Big Boss) హౌస్‌ నుంచి పంపించేస్తానని నాగ్‌ హెచ్చరించి  మరోసారి ఇలా చేయనని తన దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు నాగ్.

ఆ తరువాత కన్ఫెషన్‌(Confession) రూమ్‌లోకి వచ్చిన షణ్ను, మెంటల్లీ వీక్‌ అయిపోయాను. సిరి అలా తనను తాను గాయపర్చుకోవడానికి కారణం నేనే, అంటే తప్పు నాదే అని ఒప్పుకున్నాడు. తన లవర్ దీప్తి సునయనను మిస్‌ అవుతున్నావా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు.

అంతలా దీప్తిని మిస్‌ అవుతుంటే, ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్లిపోమని గేట్లు తెరిచాడు నాగ్‌. పదేపదే ఇలా ట్రిప్‌ అవ్వకూడదని సూచించాడు.

తర్వాత మానస్‌ కన్ఫెషన్‌ రూమ్‌లోకి వచ్చాడు. ప్రియాంక హౌస్‌లో ఎవరినీ నమ్మదని, ఎవరితోనూ ఎక్కువ క్లోజ్‌గా ఉండదన్నాడు. నన్ను మాత్రమే ఎక్కువగా నమ్ముతూ కొన్నిసార్లు ఆట కన్న నామీదే ఎక్కువ ఫోకస్(Focus) చేస్తోందని, అది తనకు ఇబ్బందిగా ఉంటోందని చెప్పాడు.

మానస్‌ మాటలు విన్నాక నాగ్‌, ప్రియాంక అతడి కోసం ఏడ్చేసిన వీడియో చూపించాడు. ఆమె ఫీలింగ్స్‌ ఎక్కడివరకు వెళ్తున్నాయో చూసుకోమన్నాడు.

తను బాధపడుతుంది  ఏమీ చెప్పకపోతే సిట్యుయేషన్స్(Situations) చేదాటిపోతాయని హెచ్చరించాడు. కాజల్‌తో ప్రవర్తించిన తీరు బాగోలేదని యానీకి చురకలేశాడు నాగ్‌. వెక్కిరించడం కొంతవరకే బాగుంటుందని, కానీ అది హద్దులు మీరుతోందని తెలిపాడు.

అయితే యానీ మాత్రం తనది చైల్డిష్‌ బిహేవియర్‌ అని, ఏదున్నా ముఖం మీదే చెప్తానంటూ ఏవేవో చెప్తూ చివరాఖరకు వెక్కిరించడం మానుకుంటానని హామీ ఇచ్చింది.

తరువాత నామినేషన్స్(Nominations) లో వున్నవాళ్లలో శ్రీరామచంద్ర, సన్నీ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌.

ఇక ఆదివారం ఫండే తో పాటు ఎలిమినేషన్(Elimination) వుంది. ఈ వారం  బిగ్ బాస్(Big Boss) ఇంటి నుంచి ఎవరు బయటకు వేళనున్నారో మరి….