బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) షో ఈ మధ్య హౌస్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లో జోరు తగినట్టు అనిపిస్తుంది. గేమ్ పరంగా కంటెస్టెంట్స్ ఎవరి స్ట్రాటజీ లతో వాడు ఆడుతున్నా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు.

తొమ్మిదో వారం కంటెస్టెంట్స్ కష్టపడి టాస్క్(Task) లు ఆడిన సిరి-షన్ను, మానస్-పింకీల లవ్ ట్రాక్ లతో వారమంతా కాస్త సోదిలా అనిపించింది.

శనివారం నాగ్ సార్ వచ్చి కంటెస్టెంట్స్ (Contestants) కి క్లాస్ పీకడం మాములే.అప్పుడప్పుడు సర్ప్రైజ్ లు ఇచ్చి కంటెస్టెంట్స్ ని సంతోష పెడుతుంటారు.

ఇక సండే అంటే ఫండే హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించడంతో ప్రేక్షకులను కాస్త ఎంటర్టైన్ చేస్తుంటారు. అలాగే సండే ఎలిమినేషన్(Elimination) ప్రక్రియ ఉంటుంది.

ఈవారం నామినేషన్స్‌(Nominations) లో షణ్ముఖ్ తప్ప మిగిలిన పది మంది నామినేట్ అయ్యారు. వారిలో ఆనీ మాస్టర్, మానస్‌లు స్పెషల్ పవర్‌తో సేవ్ కాగా, మిగిలిన ఎనిమిది మంది జెస్పీ, సిరి, కాజల్, ప్రియాంక, యాంకర్ రవి, శ్రీరామ్, విశ్వ, సన్నీ నామినేట్ అయ్యి ఓటింగ్‌(Voting )లో నిలిచారు.

ఈ వారం వరస్ట్ పెరఫార్మెర్(Worst performer) ఎవరో కూడా తేలిపోతుంది. ఈ వారం ఎలిమినేషన్ లో వెళ్ళేది ఎవరో? మరి సండే ఎపిసోడ్ వివరాల్లోకి వెళ్ళితే..

సండేను ఫండేగా చేసి హౌస్ మేట్స్(House mates) తో ఆడియెన్సు(Audience) ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయ్యాడు హోస్ట్ నాగార్జున.

కంటెస్టెంట్స్ తో ‘బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ?’ అనే గేమ్‌ ఆడించాడు. అందులో భాగంగా హౌస్ మేట్స్  రెండు టీములుగా విభజించాడు.

ఇందులో  భాగంగా A టీమ్‌లో విశ్వ, సన్నీ, షణ్ముఖ్‌, కాజల్‌, ప్రియాంక ఉండగా మిగిలిన వారంతా B టీమ్‌లో ఉంటారు. ఇక ఈ గేమ్‌లో విజువల్స్‌ చూసి సాంగ్‌ గెస్‌ చేయాలి.

ఈ గేమ్‌లో B టీమ్‌ గెలిచింది.

తర్వాత నామినేషన్స్(Nominations) లో ఒక్కరిని సేవ్(Save) చేయాల్సి ఉండగా  శ్రీరామ్‌ సేవ్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌.

తరువాత  నాగ్‌ ఇంటిసభ్యులతో ‘నేను ఎవరిని?’ అనే ఆటాడించారు . ఒక బౌల్ లో కంటెస్టెంట్ల పేర్లు  చిట్టిలలో రాసి వున్నాయి.

టీమ్‌ నుంచి ఒక్కొక్కొ కంటెస్టెంట్(Contestant) తాము తీసుకున్న చీటీలో ఎవరి పేరైతే ఉంటుందో వారిని ఇమిటేట్‌ చేయాలి. అవతలి  టీమ్‌ వాళ్లు గెస్‌ చేయాలి.

ఇందులో ఒకరినొకరు బాగా ఇమిటేట్‌ చేస్తూ సరదాగా అట ఆడారు. చివరగా ఈ గేమ్‌లో సన్నీ( A) టీమ్‌ గెలిచింది. తర్వాత జెస్సీ సేఫ్‌ అయినట్లు సేఫ్(Safe) జోన్ అయినట్టు చెప్పేశాడు నాగ్.

వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎంపిక చేయాలంటూ నాగ్‌ హౌస్ మేట్స్(House mates) ని ఆదేశించాడు.

దీంతో సన్నీ, మానస్‌- షణ్ముఖ్‌ను, షణ్ముఖ్‌- ప్రియాంకను వరస్ట్‌ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారు.

ప్రియాంక-విశ్వను; విశ్వ- జెస్సీని; జెస్సీ, సిరి, శ్రీరామ్‌- కాజల్‌; కాజల్‌- సిరి; రవి- మానస్‌ను; యానీ- సన్నీని వరస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొన్నారు.

అయితే ఇందులో ఎక్కువ ఓట్లు పడ్డ కాజల్‌ వరస్ట్‌ పర్ఫామర్‌(Worst Performer)గా ఎంపికైంది.

తర్వాత ప్రియాంక సింగ్‌ సేఫ్‌ అయింది, ఇక నామినేషన్స్(Nominations) లో చివరకు ఇద్దరు మిగలగా, కాజల్‌, విశ్వ లను గార్డెన్ ఏరియా లోఉన్న బాక్సులు ఓపెన్ చేస్తే ఎవరి బెలూన్లు ఎక్కువ ఎత్తుకు ఎగిరితే వాళ్లు సేఫ్ అయినట్టుగా, ఎగరకపోతే ఎలిమినేట్ అయినట్టు అని చెప్పాడు.

దీంతో విశ్వ ఎలిమినేట్(Eliminate) అయిపోవడంతో కంటెస్టెంట్లు(Contestants) షాకయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్‌(perfect) గా గేమ్‌ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ యానీ ఎమోషనల్ అయింది.

టాస్కులో వంద శాతం ఇస్తాడు. ఇంట్లో అందరితో కలిసి మెలిసి ఉంటాడు. అలాంటి వాడు వెళ్లిపోతే ఎలా అంటూ ఆనీ, శ్రీరామచంద్ర మాట్లాడుకుంటారు.

అయితే జనాలు కేవలం టాస్కు(Task)లు అని చూడటం లేదేమో అని షన్ను, రవి, శ్రీరామచంద్ర అనుకుంటారు.

ఇక బయటకు వచ్చిన విశ్వ తన జర్నీని చూసి ఎమోషనల్ అవుతాడు. వెళ్లేముందు విశ్వకు ఓ టాస్క్ ఇచ్చాడు నాగ్ సర్. ఇంట్లో పది మంది సభ్యులున్నారు. వారికి ర్యాంక్స్ ఇవ్వమని అన్నాడు.

అలా చివరి నుంచి వచ్చిన విశ్వ పదో స్థానంలో ప్రియాంకను, కాజల్‌ను తొమ్మిదో స్థానంలో, జెస్సీ ఎనిమిదో  స్థానంకే పరిమితం చేశాడు. ఆనీ మాస్టర్‌ను ఏడో స్థానంలో పెట్టేశాడు. మానస్‌ను ఆరో స్థానంలో పెట్టేసిన విశ్వ, సిరిని  ఐదో స్థానంలో పెట్టేశాడు.

సన్నీకి నాల్గో స్థానాన్ని, షన్నుకు మూడో స్థానాన్ని, రవికి  రెండో స్థానాన్ని ఇచ్చాడు.

ఇక చివరగా శ్రీరామచంద్రను చూస్తే నాకు చనిపోయిన తన యంగర్ బ్రదర్ గుర్తుకు వస్తాడు.

అచ్చం మా తమ్ముడిలానే ఉంటాడని ఎమోషనల్(Emotional) అయినా విశ్వ, శ్రీరామకు నంబర్ వన్ స్థానాన్ని ఇచ్చేసాడు……

 

..