సముద్రఖని(Samdrakani) దర్శకత్వం(Direction)లో పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌(Saidharam Tej) కలిసి నటిస్తున్న సినిమా  `బ్రో(BRO)`.

ఇటీవలే ఈ సినిమా టైటిల్‌(Title)ని ప్రకటిస్తూ పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తాజాగా మరో అప్‌డేట్‌ (Update) తో వచ్చారు మూవీ మేకర్స్, (Movie Makers)ఈ చిత్రం నుంచి మరో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ లుక్‌(First Look), మోషన్‌ పోస్టర్‌(Motion Poster)ని రిలీజ్(Release) చేశారు.

ఇందులో టైమ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో, శివుడి నామస్మరణ జరుగుతుండగా, వైట్‌ అండ్‌ వైట్‌(White and White) డ్రెస్‌లో సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌ అదిరిపోయింది. వైట్‌ టీషర్ట్, వైట్‌ షర్ట్, వైట్‌ ప్యాంట్‌ ధరించి ఉన్న సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆయన స్టయిల్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది.

మెగా ఫ్యాన్స్(Mega Fans) కి మంచి ట్రీట్‌లా ఉందని చెప్పొచ్చు. అయితే ఇందులో కాలానికి సంబంధించిన అంశం, శివుడి ఎలిమెంట్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తగ్గట్టుగా వచ్చే బీజీఎం(BGM) గూస్‌బంమ్స్(Goose bumps) తెప్పించేలా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ మార్కండేయ(మార్క్) అనే పాత్రలో నటిస్తున్నారు.

ఇక తమిళం(Tamil)లో సక్సెస్(Success) అందుకున్న`వినోదయ సీతం(Vinodhaya Seetam)` చిత్రానికి రీమేక్‌(Remake) అనే సంగతి తెలిసిందే. తమిళంలో  దర్శకత్వం వహించిన సముద్రఖని దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్‌ప్లే(Screen Play), మాటలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) అందిస్తున్నారు.

జీ స్టూడియోస్‌(Zee Studios)తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(Pupils Media Factory) పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 28(July 28th)న రిలీజ్ కానున్నది.  ఫస్ట్ టైమ్‌ పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్లు మరింత అంచనాలను పెంచుతున్నాయి. ఈసినిమాకి థమన్‌(Thaman) మ్యూజిక్(Music) తో  తన మార్క్ చూపించబోతున్నారు.

ఇందులో పవన్‌ దేవుడిగా, సాయితేజ్‌ ఆయన శిష్యుడిగా కనిపిస్తారని సమాచారం.