స్మాల్ స్క్రీన్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 (Bigboss season5 ) మూడో వారం కూడా పూర్తయింది. మూడో వారం ఎలిమినేషన్ తో హౌస్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ వుంటారు. ఆదివారం (Sunday) ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ (Housemates)తో సరదాగా కొన్ని గేమ్స్ ఆడించిన నాగ్. ఫన్ తో పాటు ఎలిమినేషన్ కూడా తప్పలేదు. సోషల్ మీడియా వేదికగా ఊహించినట్టే లహరి ఎలిమినేట్ అయింది. మరి ఆ సరదా గేమ్స్ ఏంటో, ఎలిమినేట్ అయినా లహరి బయటకు వచ్చి నాగ్ (Nag) మరియు హౌస్ మేట్స్ తో  ఎం చేపిందో  తెలుసుకోవాలంటే సండే ఎపిసోడ్ పై ఓ కన్నేయాల్సిందే.

అఖిల్ (Akhil) మూవీలోని  లెహరాయి అనే సాంగ్ కు తనదైన స్టైల్ లో స్టెప్పులు వేస్తూ నాగ్ ఎంట్రీ  ఇచ్చాడు. హౌస్ మేట్స్ తో  స్పాటిఫై సాంగ్ అనే ఆట ఆడబోతోన్నామంటూ ప్రేక్షకులను ఎక్సైట్ చేసాడు. ఏంజెల్ లా కనిపిస్తున్నావ్ అంటూ హమీదని పొగిడిన నాగ్. కొత్తగా ఏదైనా చెప్పు అని హమీద సెట్టైర్  వేసింది.

యు అర్ లూకింగ్ హాట్ బేబీ (you are looking hot baby ) అంటూ హమీదను పొగిడేశాడు నాగ్.  రెండు టీంలుగా కంటెస్టెంట్లను విడగొట్టేశాడు.  మధ్యలో పాట ఆగుతుంది,  హౌస్బ మేట్స్ బజర్ (buzzer) నొక్కాలి, అలాగే  బజర్ నొక్కిన వాళ్లు పాటను పూర్తిగా పాడాలి. ఆ తరువాత ఆ పాట వచ్చినప్పు ఏ కంటెస్టెంట్ (Contestant) గుర్తుకు వచ్చారో.. చెప్పాలి. వారితో డ్యాన్స్ చేయాలని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో ఇరు టీంల నుంచి సిరి, లహరి ముందు గా గేమ్ ఆడారు.

బుట్టబొమ్మ పాటను సరిగ్గా గెస్ సహాసింది. ఆ తరువాత సిరి ఈ పాటకు శ్రీరాంతో కలిసి డ్యాన్స్ చేసింది. ఆ తరువాత జెస్సీ, హమీదను పిలిచారు. జాతిరత్నాలు చిట్టి సాంగ్‌ను జెస్సీ టీం కనిపెట్టింది. ఆ తరువాత హమీదతో ఈ పాటకు జెస్సీ డ్యాన్స్ చేసాడు .

మూడో రౌండ్‌లో విశ్వ, శ్వేతను పిలిచాడు. క్రేజీ ఫీలింగ్ అనే పాటను విశ్వ గెస్ చేశాడు. ఆ తరువాత యానీ మాస్టర్‌తో విశ్వ స్టెప్పులేశాడు. నాల్గో రౌండ్లో సన్నీ, ప్రియాంకలు గేమ్ ఆడారు. కానీ పాట వినకుండానే సన్నీ బజర్ కొట్టేశాడు. దీంతో సన్నీ టీంకు నెగెటివ్ పాయింట్ వచ్చింది.

ధిమాక్ ఖరాబ్ అనే పాటకు ప్రియాంక, మానస్ కలిసి స్టెప్పులు వేశారు. ఆ తరువాత మానస్, కాజల్‌ను పిలిచాడు నాగ్. నీ కన్ను నీలి సముద్రం అనే పాటను కాజల్ టీం గెస్ చేసింది. షన్నును పిలిచిన కాజల్, ఇద్దరు డాన్స్ చేసారు.

ఆ తరువాత షన్ను, రవిని పిలిచాడు నాగ్. ఓ మైగాడ్ డాడీ అనే సాంగ్ ను షన్ను గెస్ చేశాడు. ఆ పాటకు నటరాజ్ మాస్టర్‌తో షన్ను డ్యాన్స్ వేశాడు.

ఆ తరువాత నటరాజ్ మాస్టర్, ప్రియాలను నాగ్ పిలిచాడు. ప్రియ రాగాలే అనే పాటను నటరాజ్ మాస్టర్ టీం కనిపెట్టడంతో నటరాజ్ మాస్టర్, యానీతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ తరువాత యానీ మాస్టర్‌ను, లోబోను నాగ్ పిలిచాడు. పక్కా లోకల్ అనే పాటను యానీ మాస్టర్ కనిపెట్టేసింది. లోబోతోనే యానీ మాస్టర్ డ్యాన్స్ చేసింది.

ఈ గేమ్ లో టీం ఏ గెలిచిందని అనౌన్స్ చేసిన నాగ్ . చివరగా సారంగా దరియా పాటకు సిరి, శ్రీరామచంద్ర డ్యాన్స్ చేసారు . ఆ తరువాత ఎలిమినేషన్ లో వున్నా ముగ్గురి లో ఒకరిని సేఫ్ చేసే టైం రావడం తో  మానస్, ప్రియ, లహరిలోంచి మానస్‌ సేఫ్ అయినట్టు వెల్లడించాడు.

అనంతరం నాగ్ అందరితో టచ్ చెయ్యి గెస్ చెయ్యి అంటూ మరో గేమ్  ఆడించాడు. ఈ గేమ్ (Game) ఇద్దరు కంటెస్టెంట్స్ కి  గంతలు కట్టి.

ఆ ఇద్దరిలో ఒకరు ఇచ్చిన ఐటంలను టచ్ చేయాలి. ఇంకొకరు గెస్ చేయాలని చెప్పాడు. టీం ఏ నుంచి సిరి, షన్ను వచ్చారు. అయితే సిరికి ఆవాలు వచ్చాయి. కానీ వాటిని షన్ను గెస్ చేయలేకపోయాడు. దీంతో షన్ను (shannu)పరువుపోయింది. ఆవాలు కూడా తెలీదా, రేషన్ మ్యానేజర్ అంటా అని సెట్టైర్ లు వేశారు. ఆ తరువాత ప్రియ, లహరి వచ్చారు.

ప్రియ (Priya)చెప్పడంతోనే లహరి పల్లీలు అని టక్కున చెప్పేసింది.నెక్స్ట్ ప్రియాంక, శ్వేతా వర్మ వచ్చారు. ప్రియాంక సగ్గుబియ్యం గురించి క్లూ ఇవ్వడంతో శ్వేతా చివరకు గెస్ చేసింది.

టీం బీ (Team B) నుంచి యానీ మాస్టర్, విశ్వ వచ్చారు. ఆ లిక్విడ్ గా  వున్న ఇంక్‌ను  గెస్ చేయలేకపోయారు యానీ మాస్టర్. టీం ఏ నుంచి నటరాజ్, మానస్ వచ్చారు. గోరు చిక్కుడుకాయను నటరాజ్ మాస్టర్ హింట్ ఇచ్చినా కూడా మానస్ చెప్పలేకపోయాడు.

టీం బీ నుంచి సన్నీ, హమీద వచ్చారు. సీతాఫలం గురించి సన్నీ హింట్లు ఇచ్చినా హమీద చెప్పలేకపోయింది. టీం ఏ నుంచి శ్రీరామచంద్ర వచ్చాడు. టూత్ పేస్ట్‌ను శ్రీరామచంద్ర గెస్ చేయలేకపోయాడు.

ఆ తరువాత కాజల్ రవి వచ్చారు. దాల్చిన చెక్క గురించి కాజల్ టచ్ చేసి క్లూ ఇవ్వగానే రవి  దాల్చిన చెక్క అని  చెప్పేశాడు. ఈ  ఆటలో టీం బీ గెలిచిందని నాగ్ తెలిపాడు. తరువాత లహరి ఎలిమినేట్ అయ్యిందనిప్రకటించిన నాగ్.

దీంతో నోరెళ్లబెట్టిన రవి. దీంతో హౌస్ మేట్స్  కూడా షాక్ అయ్యారు. సీక్రెట్ రూం (Secret room) అయి ఉంటుందని జెస్సీ ఊహించాడు. ఇక శ్వేతా వర్మ ఎమోషనల్ అయింది . చివర్లో ప్రియను గట్టిగా హత్తుకుంది లహరి.

ఒకరు చేశారని మీరు నామినేట్ చేయకండి అని కాజల్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తరువాత  రవికి హగ్ ఇచ్చిన లహరి.

స్టేజ్ మీదకు వచ్చిన లహరి.. శ్రీరామచంద్రను ఓ పాట పాడమని కోరింది. ఎటో వెళ్లిపోయింది మనసు అంటూ ఎంతో ఫీల్‌తో శ్రీరామచంద్ర పాడేశాడు. ఆ పాటకు లహరి ఎమోషనల్ అయింది.

ఆ తరువాత లహరితో ఆట ఆడించేందుకు నాగ్ ప్రయత్నించాడు. ఐదుగురు ఫెయిల్డ్ హౌస్ మేట్స్ (Failed Housemates) గురించి చెప్పమని అడిగితే.. అందరి గురించి చెబుతాను అని లహరి చెప్పేసింది.

సిరి మంచిదే కానీ.. ఇతర అమ్మాయిలంటే ఇన్ సెక్యురిటీ (Insecurity) ఫీలవుతుంది . యానీ మాస్టర్ ఎంతో స్వీట్ పర్సన్ కానీ.. ఆ స్వీట్ నెస్‌ను పూర్తిగా నేను చూడలేదు.. ఆమెతో ఇంకా జర్నీ చేయాలని ఉందని చెప్తుంది . కెమెరాలున్నాయ్.. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటూ రవికి, కాజల్‌కు సలహాలు ఇచ్చింది. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించండి అక్కా అని ప్రియకు తెలిపింది.

నీ గురించి కూడా నువ్ టైం ఇచ్చుకో అని శ్రీరామచంద్రకు సలహా ఇచ్చింది. స్ట్రాంగ్‌గా ఉండమని విశ్వకు సూచించింది. ఎలిమినేషన్ ప్రక్రియలో తన ఈక్వేషన్ మారిందని, మనం ఒకలా అనుకుంటే జనాలు ఇంకోలా అనుకుంటున్నారు అని లోబోకు అద్విచె చేసింది . భోళా శంకరుడు, అమాయకుడు, అన్నీ తెలుసు అని అనుకుంటాడు.. కానీ ఏం తెలియదు అంటూ నటరాజ్ మాస్టర్ గురించి చెప్పింది.

తాను లేకపోయినా ఇంట్లో స్ట్రాంగ్‌గా ఉండమని శ్వేతా వర్మను మోటివేట్  చేసింది. సిరి నామినేట్ చేసిందని నువ్ నన్ను చేసేశావ్.. ఏంట్రా ఇది  షన్ను అంటూ లహరి  మళ్లీ టార్గెట్ (target) చేసింది.

దీనితో షన్ను అందుకే అక్కడ వున్నావ్ ఆ మాట అనద్దు  అంటూ కాస్త ఇర్రిటేట్ అయ్యాడు.

జెస్సీ తమ్ముడు లాంటి వాడు. ఎవ్వరో ఒకరిని ఫాలో అవుదామని చూస్తున్నాడు. కానీ ఎవరినీ ఫాలో అవ్వాలో తెలియడం లేదని తెలిపింది. సన్నీ అయితే చాలా సెన్సిటివ్.. షార్ప్ అని అనుకుంటాడని . మానస్ గురించి ఇంకా ఏం తెలుసుకోలేదు.. తెలుసుకుందామని అనుకునేలోపు ఇలా బయటకు వచ్చాను అని చెప్పింది.

ప్రియాంక చాలా గ్రేట్.. ఆమెను గనుక నేను స్ఫూర్తిగా తీసుకుంటే నా జీవితంలో నేను ఎంతో స్ట్రాంగ్‌(Strong)గా ఉండగలను అని చెప్పింది.

ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్ల(lady contestants) లో హమీద సూపర్ స్ట్రాంగ్ అని ఆలానే వుండు అంటూ అందరికి సెండ్ అఫ్ ఇచ్చిన లహరి.