బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) రియాలిటీ షో మూడో వారం వెకెండ్ షోమొదలైంది. ఈ ఆదివారం ఒకరు ఎలిమినేషన్ కానున్నారు . శనివారంనాటి  షో లో నాగార్జున ఈ వారంలో హౌస్ మేట్స్(House mates) మధ్య జరిగిన రచ్చ పై సీరియస్ అయ్యారు. హౌస్ మేట్స్ కు క్లాస్ పీకిన నాగ్.  మరి నామినేషన్ లో వున్నా ఐదుగురు లో ఎవరు సేఫ్ అయ్యారో, ఎవరు ఎలిమినేషన్సె జోన్ లో వున్నారో, తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 25 ఎపిసోడ్ హై లైట్స్ ఇక్కడ చూద్దాం.

ఎన్టీఆర్ రావణ పాట తో ఎంట్రీ ఇచ్చి షో మొదలెట్టిన నాగ్. హౌస్ మేట్స్(house mates) ని పలకరించడంలోనే చాలా సీరియస్ గా కనిపించిన నాగార్జున. దాంతో టెన్షన్ పడ్డ హౌస్ మేట్స్. ఈ రోజు హౌస్ లో వున్న మీకు, నాకు, మరియు ఆడియన్స్ కి చాలా క్యూస్షన్స్ వున్నాయి .. వాటన్నిటికీ ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం అన్న నాగ్.  ముందు గా ప్రియ, రవి-లహరిల మధ్య జరిగిన గొడవ గురించి అడిగిన నాగార్జున దాంతో నామినేషన్లో జరిగిన గొడవను మళ్ళీ ప్రస్తావించిన హౌస్ మేట్స్. అయితే ఈ గొడవ వల్ల హర్ట్ అయినా లహరి కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళమని చెప్పిన నాగ్. రవి, ప్రియా మాట్లాడిన వీడియో చూపించి అసలు నిజమేంటో తెలియజేసిన బిగ్ బాస్(Big boss). ఆ వీడియోలో లహరి యాంకరింగ్‌ కోసం ట్రై చేస్తుందని, సింగల్ మెన్  ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని తప్పుగా మాట్లాడిన మాటల్ని చూసి షాకైంది లహరి. దీంతో నాగ్‌.. తప్పు చేసినవాళ్లను నిలదీసి, తప్పు చేయనివాళ్లకు హగ్గివ్వమని తెలిపాడు,

కన్ఫెషన్ రూమ్(Confession room) నుంచి వచ్చిన లహరి’యాంకర్‌ అవ్వాలనుకున్న, ఇక్కడ సింగిల్‌ మెన్‌ను వదిలేసి నీ వెనకాలే పడుతున్న అని అన్నారు. ఇది చాలా తప్పు. నేను వీడియో చూశాను’ అని రవిపై ఫైర్ అవ్వుతూ. ప్రియకు హగ్గిచ్చింది. దీంతో  ప్రాబ్లెమ్ సాల్వ్ అయిందా అని నాగ్‌ రవిని అడగ్గా అతడు ఏదో కవర్‌ చేద్దామని ప్రయత్నించాడు. ఇంతలో నాగ్‌ మధ్యలో అడ్డుకుంటూ.. ఇదంతా కాదు, అమ్మ మీద ఒట్టు, నేను సింగిల్‌ మెన్‌ అనే పదమే అనలేదు అక్కా అని అన్నావా? లేదా? అని గట్టిగా నిలదీయడంతో రవి నిజం ఒప్పేసుకున్నాడు. కానీ ప్రియ, లహరి దగ్గర అప్పటిదాకా ఆ విషయం ఒప్పుకోలేదని వాళ్లు చెప్పుకొచ్చారు. ఈ  రచ్చ వల్ల రవికి  టూ ఫేసెస్ వున్నాయి అని తేలిపోయింది .

తరువాత మానస్‌ తనకు తానే వరస్ట్‌ పర్ఫామర్‌(worst performer) అని అన్నడం, జైలు జీవితం బాగుందనడాన్ని కూడా తప్పుపట్టిన  నాగ్ . కాజల్‌.. విశ్వను వరస్ట్‌ కెప్టెన్‌ అందన్న నాగ్‌.. ఇంట్లోవాళ్ల అభిప్రాయం అడిగాడు. అయితే కాజల్‌కు దిమ్మతిరిగేలా ఎక్కువ ఇంటి సభ్యులు  అతడిని బెస్ట్‌ కెప్టెన్‌ అని తెలిపారు. ఇక ఈ వారం కెప్టెన్‌ అయిన జెస్సీకి కెప్టెన్‌ బాండ్‌ ఒక్కటే ఉందని, నిర్ణయాలు మాత్రం షణ్ముఖ్‌ తీసుకుంటున్నాడని కౌంటర్ ఇచ్చిన  నాగ్‌. అలాగే సిరితో ఫ్రెండ్‌షిప్‌ కట్‌ చేయడాన్ని వ్యతిరేకించాడు. ఎలిమినేట్‌(eliminate) అయి బయటకు  వెళ్లిపోయినవాళ్లు ఏదో అన్నారని, అనుకుంటున్నారని సిరిని  దూరమ పెట్టొద్దని చెప్పడం తో మల్లి కలిసిపోయిన షన్ను, సిరి . ప్రియాంక లవ్‌స్టోరీ గుర్తు చేసిన నాగ్‌.. నిన్ను బాధపెట్టినవాడి కోసం ఆలోచించొద్దని, నాగ్ దైర్యం చెప్పాడు.

తరువాత కంటెస్టెంట్స్(contestants) తో షట్ ది డోర్ ఆన్ ది పేస్ అనే  గేమ్ ఆడించిన నాగ్.  హౌస్ లో ఉండడానికి అర్హతలేని వాళ్లమీద డోర్ దగ్గర నిలబెట్టి కంటెస్టెంట్స్ పేస్ మీద తలుపేసి దానికి గల రీజన్ చెప్పాలన్న నాగ్. ప్రియా మొదలు పెట్టిన గేమ్ లో లోబో  ఇంట్లో ఉండడానికి అర్హత  లేదని చెప్పింది. ఇక లోబో లహరి తన డ్రెస్సింగ్ స్టైల్ తో  పరేషాన్ చేస్తోందని. లహరి.. రవి; రవి.. ప్రియ; జెస్సీ, ప్రియాంక సింగ్‌, విశ్వ, కాజల్‌.. లోబో; శ్వేత, యానీ మాస్టర్‌.. మానస్‌; మానస్‌.. యానీ మాస్టర్‌; నటరాజ్‌ మాస్టర్‌, హమీదా.. కాజల్‌; షణ్ముఖ్‌, సిరి.. సన్నీ; సన్నీ.. సిరి; శ్రీరామ్‌.. జెస్సీ పేర్లను ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ఏమిపక చేసారు. ఇక టాస్క్‌లో శ్వేతను, ఫ్రెండ్‌షిప్‌ కట్‌ చేసి సిరిని ఏడిపించిన షణ్ముఖ్‌ మీద సెట్టైర్ వేసిన నాగ్‌. ఇక గుంటనక్క ఎవరని నాగ్‌ నటరాజ్‌ మాస్టర్‌ను నిలదీయగా నెక్స్ట్‌ టైమ్‌ చెప్తానని దాటవేశాడు. తర్వాత ప్రియాంక సింగ్, శ్రీరామ్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు. ఇంకా ముగ్గురు నామినేషన్లో ఉండగా ఎవరు సేఫ్ లో వుంటారో, ఎవరు ఈ వారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లనున్నారో తెలియాలంటే ఆదివారం షో చూడాల్సిందే. అయితే సోషల్ మీడియా వేదికగా లహరి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ గా వున్నాయి అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.