టాలీవుడ్(Tollywood) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

గాడ్‌ ఫాదర్(God Father), బోళా శంకర్(Bola Shankar) సినిమాలు చేస్తూనే.. మరిన్ని సినిమాలను లైన్‌లో పెట్టారు.

అయితే మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌(Lucifer)’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న గాడ్‌ ఫాదర్ మూవీని త్వరగా రిలీజ్ చేసేందుకు చిరు ప్రయత్నాలు చేస్తున్నారు.

మోహన్‌రాజా(Mohan raja) దర్శకత్వం(Direction)లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌(Konidela Prodcutions), సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకాల(Supergood Films Banner)పై ఆర్‌బీ చౌదరి(RB Chowdary), ఎన్వీ ప్రసాద్‌(NV Prasad) నిర్మిస్తున్నారు.

గాడ్‌ ఫాదర్ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌(First LooK Poster)తో పాటు వీడియో గ్లింప్స్‌(Video Glimpse) ను సోమవారం చిత్ర యూనిట్(Movie Unit) రిలీజ్ చేసింది. ఈరోజు మరో పోస్టర్‌ విడుదల కానున్నదని సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది.

ఇందులో చిరంజీవి గాగుల్స్ పెట్టుకుని స్టయిల్‌ కూర్చుని అదిరే లుక్‌లో స్టెలిష్‌గా ఉన్నారు. ది రియల్ గ్యాంగ్‌స్టర్(The Real Gangster) అని కూడా రాసుంది. ఈ పోస్టర్‌ను ‘చిరంజీవి కొణిదెల ఫాన్స్ క్లబ్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా(Instagram Account)లో పోస్ట్ చేయబడింది. ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్(Viral) అవుతోంది. మెగా అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

పొలిటికల్‌ డ్రామా(Political Drama)గా తెరకెక్కిస్తున్న గాడ్‌ ఫాదర్ మూవీలో మెగాస్టార్ కి జోడిగా నయనతార(Nayanatara) నటిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో(Bollyood Star Hero) సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌,(Director Puri Jaganath), హీరో సత్యదేవ్‌(Hero Satyadev), నటుడు సునీల్(Actor Sunil) ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

దసరా పండుగ(DASARA Festival)ని పురస్కరించుకొని ప్రచంచవ్యాప్తం(World wide)గా భారీస్థాయిలో ఈ సినిమాను రిలీజ్(Release) చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమన్‌(Thaman) మ్యూజిక్(Music) సమకూర్చుతున్నారు.