భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(Railway Recruitment Cell), నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (North Central Railway) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌(Job Notification) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1659 అప్రెంటీస్ (Apprentice Vacancies) ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత(Qualified), ఆసక్తి(Interested)గల అభ్యర్థులు ఆన్‌లైన్‌(Online) విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 1 దరఖాస్తులకు ఆఖరి తేది(Last Date). అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrcpryj.org/ అధికారిక  వెబ్‌సైట్‌(Official Website) చూడొచ్చు.

ముఖ్య సమాచారం

మొత్తం ఖాళీలు: 1659

పోస్టులు: అప్రెంటీస్ ఖాళీలు

ఉద్యోగ విభాగాలు: వెల్డర్‌, అర్మచ్యుర్‌ విండర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, వైర్‌మెన్‌, ప్లంబర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు(Age) 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు శాలరీ(Salary) చెల్లిస్తారు.

అర్హతలు: మెట్రిక్యులేషన్‌(Matriculation)/పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్‌(ITI Certificate) కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌(Academic Merit) ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్ధులకు: రూ.100

ఎస్సీ(SC)/ఎస్టీ(ST)/పీడబ్ల్యూడీ(PWD)/మహిళా అభ్యర్ధుల(Women Candidates)కు ఫీజు మినహాయింపు(Fee exemption) వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌(Online) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభ తేది: జులై 2, 2022

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.rrcpryj.org/