టాలీవుడ్ హీరో సుమంత్ (Sumanth) క్రేజీ ప్రాజెక్ట్(Crazy Project) లతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఓటీటీ(OTT)లో రిలీజ్ అయిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్(Family & Romantic)  సినిమా ‘మళ్లీ మొదలైంది’(Malli Modalaindi)తో ఫామ్ లోకి వచ్చాడు ఈ హీరో.

ఈ చిత్రానికి ఓటీటీలో ఊహించని విధంగా స్పందన లభించింది. సుమంత్ ఫాన్స్ ఈ మూవీతో  ఫిదా అయ్యారు. తమ అభిమాన హీరో సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ పై కాస్తా ఆశలు పెంచుకుంటున్నారు. మళ్లీ మొదలైంది మూవీని  టీజీ కీర్తి కుమార్(TG Keerthi Kumar) దర్శకత్వం(Direction) వహించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని నిర్మాత(Producer) కే రాజశేఖర్ రెడ్డి(K.Rajasekhar Reddy) నిర్మించారు. మెయిన్ రోల్(Main Role) లో సుమంత్ నటించగా, హీరోయిన్ గా నైనా గంగూలీ (Naina Ganguly) జత కట్టారు.

ఈ చిత్రం ఇచ్చిన పాజిటివ్ రెస్పాన్స్(Positive Response) తో సుమంత్ తన తదుపరి చిత్రం షూటింగ్ శరవేగంగా చేసారు . గతంలోనే తన తదుపరి చిత్రం ‘అహాం రీబూట్’ (Aham Reboot)గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సుమంత్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు.

కచ్చితంగా హిట్ కొడతారని అనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్(First Look Release) అయి ఆడియెన్స్(Audience) నుంచి మంచి రెస్పాన్స్(Good Response) ను దక్కించుకుంది. ఈ క్రమంలో సుమంత్ మరో చిత్రాన్ని కూడా ప్రకటించారు.

తన నెక్స్ట్ చిత్రంగా సుమంత్ (Sumanth) క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. హీరోగా సుమంత్ నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – ప్రశాంత్ సాగర్ అట్లూరి వహిస్తున్నారు. అద్భుతమైన మ్యూజిక్(Music) ని శ్రీరామ్ మద్దూరి(SriRam Madduri) అందిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ(Cinematography) బాధ్యతలను వరుణ్ అంకర్ల(Varun Ankarla) చూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్(Script Work) ను సూపర్ విజన్(Supervision) – సుమ కార్తికేయ(Suma Karthikeya) పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రొడక్షన్ డిజైన్(Production Design) గా ఏఆర్ వంశీ, సౌండ్ ఇంజనీర్(Sound Engineer) గా నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో బాధ్యతలను జీఎస్కే మీడియా(GSK Media) చూస్తోంది. నిర్మాతలు(Producers)గా రఘువీర్ గోరిపర్తి(Raghu Veer Goriparthi), సృజన్ యరబోలు(Srujana Yerrabolu) వ్యవహరిస్తున్నారు.

సుబ్రహ్మణ్యపురం, లక్ష్య చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్(Young Director) సంతోష్ జాగర్లపూడి(Santhosh Jagarlamudi) సుమంత్ తదుపరి చిత్రానికి దర్శకతవం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన “సుబ్రహ్మణ్యపురం” సినిమా మంచి విజయాన్ని(Success) సాధించింది.

ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకం(KR Creations Banner)పై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్(Hit Combination) లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు. పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్(Pre Production) కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత(producer) కే. ప్రదీప్(K.Pradeep) తెలిపారు.