బిగ్ బాస్ సీజన్ 5 (Big boss season 5) లో గత కొద్దీ రోజులుగా హౌస్ లో రణ రంగాన్ని తలిపిస్తోంది. అయితే వీకెండ్ వస్తే ఆడియన్స్  తో పాటు హౌస్ మేట్స్ కూడా ఫుల్ జోష్ లో వుంటారు.

ఇక రెండో వారం ఎలిమినేషన్(Elimination) తో పాటు బోలెడంత ఎంటెర్టైమెంట్ తో అలరించడానికి హోస్ట్ నాగార్జున మన ముందుకు వచ్చేశాడు.

మొదటి శనివారం హౌస్ మేట్స్ కి ఎలాంటి క్లాస్ తీసుకోలేదు. కానీ ఈ వారం క్లాస్ తీసుకోవడానికి రెడీ అయ్యిపోయాడు నాగ్.

అయితే దీనితో పాటు హీరో రాంచరణ్ ఈ షో కి వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు, అంతే కాదు మేస్ట్రో టీం కూడా ఈ వారం వీకెండ్ షో లో సందడి చేసారు.

మరి ఆ సందడి ఏంటో సెప్టెంబర్18 వ తేదీ న జరిగిన 14 వ ఎపిసోడ్ లో మనము తెలుసుకుందామా.

ఏక్ బార్.. ఏక్ బార్ పాటకి డాన్సర్ల తో కలసి స్టెప్‌లు వేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. హౌస్‌లో ఆర్డర్ కాస్త తప్పిందని సెట్ చేస్తా అని అన్నారు నాగార్జున. దానికంటే ముందు శుక్రవారం లో ఏమి జరిగిందొ చూద్దాం అని మన టీవీ లో చూస్తారు నాగ్.

లహరి, యానీ మాస్టర్, శ్వేత  సన్నీ జైలు లో కూర్చుని ఫుల్ కామెడీ  చేస్తున్నాడని, ఏవేవో గాసిప్ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక మరో వైపు జెస్సీ, షన్ను .. ఇంట్లో ఉన్న గాసిప్‌లపై చర్చించారు.. ఇంతలో సన్నీ జైలు నుంచి విడుదల అయ్యాడు.

ఇక సాయంత్రం పూట లోబో- ఉమా బెడ్‌పై పడుకుని ఇద్దరు రొమాంటిక్ గా మాట్లాడుకుంటుంటారు. అది ఇంట్లో వాళ్లు చూసి తెగ నవ్వుకోవడం.. అటు గా వెళ్తున్న రవి, సిరిలు వీళ్లని చూసి ఆటపట్టించారు.

ఆ తరువాత కూడా ఉమ, లోబోలు పెర్ఫామెన్స్ కొనసాగించి హౌస్ లో అందరిని ఎంటర్టైన్ చేసారు.

హౌస్‌లో ఫన్ ఉంది.. రొమాన్స్ ఉంది.. కానీ సెట్ చేయాల్సింది చాలా వుంది అంటూ, దానికంటే ముందు ఒక సర్ప్రైజ్ వుంది అని,  హాట్ స్టార్ కి సంబంధించిన రామ్ చరణ్ యాడ్‌ వీడియోను ప్లే చేసి చూపించారు నాగార్జున.

హీరో రామ్ చరణ్  హాట్ స్టార్ (hot star) బ్రాండ్ అంబాసిడర్‌గ (ambadessor) నియమించబడ్డ సంగతి తెలిసిందే.

షో మ్యాన్ గా రామ్ చరణ్ ఆ యాడ్‌లో అదిరిపోయాడు. తరువాత  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని బిగ్ బాస్ స్టేజ్ మీదికి తీసుకుని వచ్చారు నాగార్జున.

చిరుత సినిమాలోని రచ్చ సాంగ్‌తో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్.

అనంతరం హౌస్‌లో ఉన్నవాళ్లందరితో మాట్లాడుతూ రామ్ చరణ్ ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. హౌస్‌లో అంతా తమ ఒరిజినల్ క్యారెక్టర్‌తోనే ఉండి బాగా ఆడండి  అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు రామ్ చరణ్. తరువాత కాసేపు హోస్ట్ గా రామ్ చరణ్ వ్యవహరిస్తూ, తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో  స్ట్రీమ్ అవుతున్న మేస్ట్రో మూవీ టీం ని బిగ్ బాస్(Big boss) స్టేజి మీదకు ఆహ్వానించారు.

ఈ మూవీ లో అంధుడిగా నటించిన నితిన్ స్టేజ్ మీదికి కూడా అంధుడిగానే ఎంట్రీ ఇచ్చి ఫన్ చేసారు . సినిమాలో ఇలా చేసే చాలామందిని మోసం చేశావ్.. ఇక్కడ కూడా అవసరమా? అది కూడా నాముందు అని గాలి తీసేశాడు రామ్ చరణ్.

ఆ తరువాత తమన్నా, నితిన్, నభా నటేష్‌లతో  మాట్లాడి.. డాన్స్ చేసి అలరించారు రామ్ చరణ్.

ఇక ఆ తరువాత హౌస్ మేట్స్(House mates) మాట్లాడుతూ, గత వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్‌ ని రణ రంగం గా మార్చేసి.. శాడిస్టులు గా ప్రవర్తించిన ఇంటి సభ్యులు ఒక్కొక్కర్నీ నిలబెట్టి మరీ వాయించిన నాగార్జున.

హౌస్‌లో మీ బిహేవియర్ బాలేదు.. ఎవరి బిహేవియర్ బాలేదో మీరే చెప్పాలి .. మీకు 15 సెకన్లు టైం ఇస్తున్నా మీరే నిలబడండి అని చెప్పడంతో.. ప్రియ, జెస్సీ, ప్రియాంక, విశ్వ, లహరి మినహా తక్కిన వాళ్లంతా తమంతట తాము నిలబడ్డారు.

ఉమతో  మొదలైంది బ్యాండ్ బాజా .. ‘నామినేషన్స్(Nominations) అప్పుడు నేను అసభ్యకరంగా మాట్లాడాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి అని అన్నది.. నామినేషన్స్ అప్పుడేనా?? ఇంకెప్పుడూ తిట్టలేదా? అని నాగార్జున అడగడంతో.. నీ ఎంకమ్మా అని అన్నా కానీ అమ్మా అనలేదు అని చెప్పడంతో.. ‘మాకు అమ్మా అనే వినిపించింది అని విశ్వతో పాటు షణ్ముక్ కూడా చెప్పడంతో.. నాగార్జున సీరియస్ అయ్యారు.

ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో మీరు బూతులు మాట్లాడటం సమంజసం  కాదని.. గుంజీలు తీసి మరీ క్షమాపణ చెప్పాలని కోరారు. దీంతో ఉమ.. తెలుగు ఆడియన్స్ అందరికీ క్షమాపణ చెప్తూ ఇంకెప్పుడూ ఇలా చేయనని గుంజీలు తీసింది. దీంతో నాగార్జున క్షమిస్తూ.. ఇది ఆడియన్స్ కోసమే అని చెప్పారు.

ఇక లోబో నామినేషన్స్(Nominations) అప్పుడు మానస్‌పై అరిచానని అందుకే నిలబడ్డానని చెప్పడంతో.. అది ఓకే కానీ.. రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతున్నావ్ అని అడిగారు.. ఏడు తాగుతున్నా అని చెప్పడంతో.. ఆ అలవాటు మానేస్తే నీ ఫ్యామిలీ కూడా సంతోషిస్తుంది కదా అని అనడంతో తప్పకుండా మానేస్తా అని మాట ఇచ్చాడు లోబో.

ఇక యాని  మాస్టర్ తప్పు చేశా అని నిలబడితే.. అరవడం పెద్ద తప్పేం కాదని క్షమించేశారు నాగార్జున.

నామినేషన్స్(Nominations) అప్పుడు తన బిహేవియర్ బాగాలేదని  ముఖానికి రంగు పూయమంటే కోపంలో రంగు మొత్తం పూసేశా అని తన తప్పుని ఒప్పుకుంది శ్వేతా. అయితే నాగార్జున.. ‘నువ్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. వారికి మానవత్వం లేదని అన్నావ్.. మరి నువ్వు చేసింది ఏంటి?? హమీదా ఫేస్ మీద పెయింట్ కొట్టడం మానవత్వమా? అని అడిగారు. దీంతో శ్వేతా నేను తప్పుచేశా సార్.. అందుకే హమీదా, లోబో ఫ్యామిలీకి తెలుగు ఆడియన్స్‌ (Audience)కి క్షమాపణ  చెప్తున్నా అని.. రెండు చేతులతో ముఖంపై గట్టిగా కొట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

సన్నీ ఏం తప్పు చేసాడో చెప్పుమనగా, టాస్క్ లో తమ టీం పై అరిచాను అని కానీ గేమ్ లో కోఆర్డినేషన్ తక్కువైంది అనే అరిచాను అని చెప్పాడు సన్నీ. అయితే నాగ్ నువ్వు అలాగే నిలుచో అని సిరి ని అడిగాడు నాగ్ సన్నీ ని షర్ట్ లోపల చెయ్యి పెట్టాడా అని అడుగుతాడు. దీని కి సంబంధించి ఒక వీడియో ప్లే చేయగా  అందులో శ్వేతా చెయ్యి సిరి షర్ట్ లోపల పెట్టిందని తేలిపోతుంది. దాంతో సిరి సన్నీ కి సారీ చెప్తుంది. దీనితో గేమ్ లో   స్ట్రాటజీస్(strategies) ఉండాలి కానీ క్యారక్టర్ ని తప్పు పట్టకూడదు అని చెప్తారు నాగ్.

ఆ తరువాత ఎలిమినేషన్(elimination) టైం రానే వచ్చేసింది. నామినేషన్ లో వున్నా కంటెస్టెంట్స్ నుంచున్నాక, వారికి  కెప్టెన్ విశ్వ ఒక బాగ్ ఇస్తారు. అందులో రెడ్ ఉంటే సేఫ్ కాదని చెప్తారు నాగ్. ఇందులో యానీ మాస్టర్, లోబో సేఫ్ జోన్ లోకి వస్తారు. హౌస్ లో కొత్త కెప్టెన్ అయినా విశ్వకి కంగ్రాట్స్ చెప్తారు నాగ్. ఆ తరువాత రౌండ్ లో ప్రియాంక సేఫ్ అవుతుంది.

మరి రేపటి ఎపిసోడ్లో ఎవరి సేఫ్ అవుతారో ఎవరు ఇంటికి పయనం అవ్వన్నారో మరి…