బిగ్ బాస్ సీజన్ 5 (Big boss season 5) రియాలిటీ షో లో రెండో వారం వీకెండ్  కూడా పూర్తి కావస్తోంది.

ఎలిమినేషన్(elimination) టైం కూడా దగ్గర పడింది.శనివారం ఎపిసోడ్ లో రాంచరణ్, మాస్ట్రో టీం బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసారు. ఇక నామినేషన్ లో ఏడుగురు ఉండగా అందులో లోబో, యని మాస్టర్, ప్రియాంకలు సేఫ్ అయ్యారు.

మరి సండే అంటేనే ఫన్ కదా. సండే రోజు హోస్ట్ నాగ్ తో కలసి మన హౌస్ మేట్స్(house mates) ఎంత ఎంటర్టైన్ చేసారో? ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఎపిసోడ్ 15న జరిగిన షో గురించి  ఇక్కడ తెలుసుకుందాం.

చిరంజీవి ఆచార్య మూవీ లో నుంచి లాహే లాహే సాంగ్ తో షో ని మొదలుపెట్టిన నాగార్జున. ఇవాళ సండే ఫండే ఎలిమినేషన్ అని, హౌస్ లో  ఒకరు ఎలిమినేట్(eliminate) అవుతారని, అందరికి బాధగా ఉంటుంది. ఆ బాధను మనం దూరం చేద్దాం .

కాసేపు హౌస్ మేట్స్ తో ఫన్ చేద్దాం అని నాగ్ అంటూ మన టీవీ ని చూస్తారు. హౌస్ మేట్స్(House mates) అందరిని విష్ చేసిన నాగ్ వాళ్ళతో డెస్టినేషన్ గేమ్ ఆడిస్తాడు. ఈ గేమ్ లో హౌస్ మేట్స్  కప్పులో బాల్ వేసి,  ఆ కప్పు కింద ఓ పేరు కనిపిస్తుంది.. వారే మీకు జోడి.. అదే మీ డెస్టినీ.. ఆ జోడి తో కలసి డ్యాన్స్ వేయాలి. వారికి నేను మార్కులు ఇస్తాను అని నాగార్జున తెలిపారు.

ఈ గేమ్ లో భాగం గా మొదట ఉమాదేవి – షణ్ముఖ్‌ వచ్చారు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ సాంగ్ కి ఉమా దేవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అలాగే షన్ను వేసిన స్టెప్స్ ని అందరు ఎంజాయ్ చేసారు.

లహరి – జెస్సీ స్వింగ్ జరా సాంగ్ కు డ్యాన్స్ వేశారు. తమన్నా స్టెప్పులను జెస్సీ అలాగే దించేశాడు. కానీ లహరికి డ్యాన్స్ రాదని ఈ పర్ఫామెన్స్‌ (performance) తో అందరికీ తెలిసిపోయింది. ఇక జెస్సి తన డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు.  కాజల్-లోబో భీమవరం బుల్లోడా అనే పాటకు  ఇద్దరూ డ్యాన్సు వేశారు.

ప్రియ- యాంకర్‌ రవి, లక్ష్మీ బావా అనే పాటకు ఈ ఇద్దరూ అదిరిపోయేలా స్టెప్పులు వేశారు.

హమీదా – శ్రీరామ్‌, లంచుకొస్తావా? అనే పాటకు డ్యాన్సులు వేశారు ఇక . ఈ డాన్స్ పెరఫామెన్స్ తో  శ్రీరాం తనలోని మాస్ యాంగిల్‌ను చూపించాడు .

ప్రియాంక – మానస్‌ నచ్చావే నైజాంపోరి అంటూ ఇద్దరూ రెచ్చిపోయారు, యానీ మాస్టర్‌ – విశ్వ జ్వాలా రెడ్డి సాంగ్ కు డాన్స్ చేసారు .

ఇక చివర మిగిపోయిన  సిరి – నటరాజ్‌ మాస్టర్‌ గరంగరం సిలక అంటూ నటరాజ్ మాస్టర్ తన టాలెంట్‌ను చూపించగా, ఇద్దరు పోటీపడుతూ డ్యాన్స్‌ చేశారు.

ఈ జంటలలో ఎక్కువగా అబ్బాయిలే ఎక్కువ స్కోర్‌ చేశారు.  ఓవరాల్‌గా అబ్బాయిలకు ఎక్కువ పాయింట్లు వచ్చినప్పటికీ,  అబ్బాయిలు లెక్కలు సరిగ్గా చెప్పలేకపోయారు. అయితే అమ్మాయిలకు 65 వచ్చాయని, అమ్మాయిలు గెలిచినట్లు నాగ్ ప్రకటించారు.

ఈ గేమ్ తరువాత నామినేషన్(nominations) లో భాగం గా ఒక సాంగ్ ప్లే చేస్తాము అందులో ఎవరి పేరైతే వస్తుందో వారు సేఫ్ అని చెప్తారు నాగ్‌. కాజల్ చెల్లివా అనే సింగ్ ప్లే చేయగా కాజల్‌ సేఫ్‌ అయినట్లు వెల్లడించాడు.

ఇక కాజల్‌ రవి బర్త్ డే సందర్భం గా తనకు మటన్‌ బిర్యానీ తినాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. దీంతో నాగ్‌ అందులో ఏముంది? వండుకుని తినంటూ కౌంటర్ ఇచ్చాడు. కానీ అంతలోనే హౌస్‌మేట్స్‌(Housemates) అందరికీ మటన్‌ పంపిస్తానని కాకపోతే దాన్ని కాజల్‌ మాత్రమే వండాలని మెలిక పెట్టారు.

తరువాత నాగ్‌ మరో గేమ్ తో వచ్చేశాడు.. హౌస్‌మేట్స్‌ తో ‘ఇంట్లో ఉన్న దెయ్యం’ ఆట ఆడించాడు. మొదటగా ప్రియ.. రాత్రి సరిగా నిద్రపోకుండా దెయ్యంలా అటూ ఇటూ తిరుగుతుందని సిరికి దెయ్యం స్టిక్కర్‌ అతికించింది.

మానస్‌.. శ్రీరామ్‌ తీసుకునే కొన్ని నిర్ణయాలు తనకు ఇమ్మేచ్యూర్‌డ్‌గా అనిపించాయంటూ అతడికి స్టిక్కర్‌ అతికించాడు. లహరి.. ఏదైనా గట్టిగా అరుస్తూ చెప్తుందని ఉమాదేవిని స్వీట్ దెయ్యం అంటూనే  స్టికర్ అతికించింది . హమీదా.. యానీ మాస్టర్‌ను దెయ్యం అనేసింది. శ్రీరామ్‌.. ఓటమిని తీసుకోలేడంటూ మానస్‌ను దెయ్యంగా అభిప్రాయపడ్డాడు.సన్నీ.. తనకు అందరి మీదా పగ ఉందంటూనే చివరగా ప్రియాంక సింగ్‌ నుదుటన స్టిక్కర్‌ అతికించాడు.

విశ్వ.. కాజల్‌ దెయ్యంలా తన వెనకాల పడుతుందన్నాడు. ప్రియాంక.. లేట్‌గా పడుకునే లోబోను దెయ్యమని పేర్కొంది. జెస్సీ, శ్వేత, ఉమాదేవి, లోబో.. సిరిని; యానీ మాస్టర్‌.. హమీదాను; కాజల్‌, నటరాజ్‌ మాస్టర్‌.. విశ్వను; సిరి.. ఉమాదేవిని దెయ్యంగా పేర్కొంది .

సన్నీ విషయంలో తప్పు చేశానంటూ షణ్ముఖ్‌ తనను తానే దెయ్యమని చెప్పుకున్నాడు. అది కుదరదని నాగ్‌ తెగేసి చెప్పడంతో సిరిని దెయ్యం అని స్టికర్ పెట్టేసాడు షన్ను .

తర్వాత ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌ సేఫ్‌ అయ్యారు.. ఉమాదేవి ఎలిమినేట్‌(eliminate) అయింది. అయితే ఇక్కడిదాకా వచ్చాను, ఏదో ఒకటి సాధించే వెళ్లాలి అంటూ నటరాజ్‌ మాస్టర్‌ కిందపడి ఏడ్చేశాడు.

ఇక ఉమ వెళుతుంటే లోబో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేశాడు. ఎలిమినేట్ అయినా  ఉమా నాగార్జున దగ్గరికి వెళ్తుంది.ఆమె బిగ్ బాస్  హౌస్ జర్నీ ని  చూపించిన నాగ్.

హౌస్ మేట్స్(house mates) తో మాట్లాడుతూ నాగ్  వెళ్లేముందు ఉమా ని కుండలు బద్దలుకొట్టి వెళ్లాలని, ఇక్కడ 17 కంటెస్టెంట్స్ ఫోట్లను అతికించిన  కుండలు వున్నాయి అని, అందులో 8 పగలకొట్టాలి అని తెలుపుతాడు నాగ్.

సిరి, ప్రియా, లోబో, షన్ను, రవి, లహరి,  యానీమాస్టర్, కాజల్ ల  కుండలను పగలకొట్టి చిన్న చిన్న మైనస్ లు ఉన్నాయని వాటిని సరి చేసుకుంటే సరిపోతుంది అని చెప్తుంది.

అనంతరం రవి పుట్టిన రోజును పురస్కరించుకుని తన భార్య పంపిన లెటర్‌ చదివి ఎమోషనల్‌ అవ్వుతాడు. అలాగే తనకు గిఫ్ట్‌ ఇచ్చిన ఉంగరాన్ని ముద్దాడాడు.

నాగ్ కూడా రవి కి బర్త్ డే విషెస్ చెప్తాడు. ఇక ఉమా ఎలిమినేషన్ తో రెండో వారం ముగిసిపోయింది, మరి మూడో వారం ఎపిసోడ్  ఎలా వుండబోతోంది చూడాలి.