ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం చూసిన త‌మ‌న్నా(Tamanna) వేరు. ఇప్పుడు చూస్తున్న త‌మ‌న్నా వేరు. త‌న‌లో ఉన్న బోల్డ్ నెస్(Boldness)  ఏ స్థాయిలో ఉంటుందో తాజాగా వెబ్ సిరీస్‌ల‌తో నిరూపించింది త‌మ‌న్నా. హాట్ స్టార్ (Hot star)వెబ్ సిరీస్ జీ క‌ర్దాలో పలు హాట్ సీన్ల‌లో న‌టించి షాక్ ఇచ్చింది త‌మ‌న్నా. ఆ వెంట‌నే ల‌స్ట్ స్టోరీస్ 2లో కూడా మ‌రింత రెచ్చిపోయింది.

ఈ వెబ్ సిరీస్ కోసం తొలిసారి లిప్ లాక్ స‌న్నివేశాల్లో కూడా న‌టించింది. అయితే త‌మ‌న్నా ఇంత హాట్ (Hot)గా ద‌ర్శ‌నం ఇస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. త‌మ‌న్నా కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఇలాంటి వెబ్ సిరీస్‌లు (Web series) చేస్తోంద‌ని, వీటితో త‌న ఇమేజ్ దిగ‌జారిపోతుంద‌ని, ఇక అవ‌కాశాలు రావ‌ని.. జ‌నం బాగా గ‌గ్గోలు చేస్తున్నారు. ఇన్నేళ్ల తన కెరీర్‌(Career)లో ఎప్పుడూ లేనంత విమ‌ర్శ‌ని ఇప్పుడే ఎదుర్కొంటోంది త‌మ‌న్నా.

అయితే ప్రస్తుతం నిజం ఏమిటంటే, ఈ హాట్ నెస్ ఆమెకు ఇపుడు మ‌రిన్ని ఆఫ‌ర్లు తెచ్చి పెడుతోంది. అంతేకాదు ,తాజాగా త‌మ‌న్నా హాట్ స్టార్ కోసం ఓ రెండు వెబ్ సిరీస్‌ల‌పై సంత‌కాలు చేసింద‌ట‌. నెట్ ఫ్లిక్స్ కోస‌మూ కొన్ని కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొంద‌ట‌. ఇదంతా, త‌న బోల్డ్ నెస్ పుణ్య‌మే. నిజానికి వెబ్ సిరీస్‌ల స్టోరీ ప్ర‌కార‌మే, త‌మ‌న్నా ఆయా పాత్ర‌లలో అలా చేసింది.ఏది ఏమైనా ఈ అందాల భామ కిస్ సీన్ అంటే ప్రేక్షకులు తెగ ఆసక్తిగా ఉన్నారనే చెప్పాలి.

ప్రస్తుత రోజుల్లో వెబ్ సిరీస్ కంటూ ఒక ప్ర‌త్యేక ప్రేక్ష‌క వ‌ర్గం ఉంది. వాళ్ల‌కు ఇలాంటి బోల్డ్ కంటెంట్ అంటే బాగా న‌చ్చుతోంది. రానా నాయుడుని అంత తిట్టుకొన్నా, జ‌నం బాగా చూశారు. నెట్ ఫ్లిక్స్‌ (Netflix)లో అత్య‌ధిక వ్యూస్ వ‌చ్చిన సిరీస్‌లో అది కూడా ఒక‌టి. ఇప్పుడు త‌మ‌న్నా పుణ్య‌మా అని ల‌స్ట్ స్టోరీస్‌(lust stories)కీ ఊహించ‌ని రేంజ్ లో వ్యూస్(Views) వ‌స్తున్నాయి. త‌మ‌న్నా క్రేజ్‌ (craze) ని అర్థం చేసుకొన్న ఓటీటీ (OTT)సంస్థ‌లు ఆమెతో ఇప్పుడు మ‌రిన్ని వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నాయట . ఇదంతా త‌మ‌న్నాకు ప్ల‌స్సే క‌దా…!

మరి ఈ అందాల భామ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి .