ప్రముఖ టెలికాం సంస్థ (Telecom company) అయిన ఎయిర్ టెల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త డేటా ప్లాన్ ను అందిస్తోంది. కేవలం రూ.119 లకే 4g డేటా రీచార్జ్ ప్లాన్ ను ప్రీపెయిడ్ (prepaid) వినియోగదారులకు ఎప్పుడు డేటా కనెక్ట్ అయ్యివుండేలా, ఈ కొత్త డేటా ప్లాన్ ను ప్రవేశ పెట్టారు.

ఇప్పటికే టెల్కో యొక్క వెబ్‌సైట్‌లో  ఈ ఆఫర్ కనిపిస్తుంది. ఈ ప్యాక్‌తో వినియోగదారులు 15GB డేటాను పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు వినియోగదారుల ప్రస్తుత అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్ వలె ఉంటుంది. రూ.119 ప్లాన్‌తో అదనంగా 30 రోజుల పాటు  ‘ఎక్స్‌ స్ట్రీమ్ మొబైల్ ప్యాక్’ ( (XStream Mobile Pack) యొక్క ప్రయోజనం కూడా పొందవచ్చు.

దీని గురించి మరిన్ని వివరాలు తెలుకోండి.

ఈ ఆఫర్ కి వ్యాలిడిటీ(validity) ఉండదు. అంటే, ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ గడువు ముగిసే వరకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఇది కూడా ఎక్స్ పెయిర్ అవుతుంది. కేవలం డేటాను మాత్రమే పొందవచ్చు. అదనంగా కాలింగ్, SMS లాభాలు  పొందలేరు. అపరిమిత ప్లాన్స్ (Unlimited plans) లో మీకు నచ్చిన ప్లాన్ ఏదైనా ఎంచుకోవచ్చు. కానీ, ఈ కొత్త యాడ్-ఇన్ డేటా ప్యాక్ తీసుకుంటే ఎక్సట్రా లాభాలు ఉన్నాయి.

ఈ ప్లాన్ కస్టమర్ల కు ‘ఎక్స్‌ స్ట్రీమ్ మొబైల్ ప్యాక్’ ( Xstream Mobile pack) అందిస్తుంది. ఎయిర్ టెల్ ఎక్స్‌ స్ట్రీమ్ (Airtel Xstream) యాప్ ద్వారా ఎరోస్ నౌ, (ErosNow),  హొయిచోయ్ , (Hoichoi), మనోరమ మాక్స్,( ManoramaMax) ఫ్రీ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది 30 రోజులకు వర్తిస్తుంది. ఎయిర్ టెల్ అందించే add-on packs జాబితాలో ఈ కొత్త డేటా ప్యాక్ చేరింది. ఈ లిస్ట్ లో రూ .48, రూ .78, రూ .89, రూ .98, రూ .131, రూ .248 రూ .251 ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ వినియోగదారుల  ప్రస్తుత ప్లాన్‌ల వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటాయి. రూ .48, రూ .98 రూ .251 ప్యాక్‌లతో అదనపు డేటాను మాత్రమే పొందవచ్చు. ఇతర ప్లాన్‌లు వివిధ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్‌ఫారమ్‌ల్లో అడిషనల్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇంకా వినియోగదారులు హలో ట్యూన్స్( Hello tunes) మరియు వియన్క్ (Wynk) మ్యూజిక్     అపోలో 24/7 సర్కిల్, (Apollo 24/7 Circle,)  ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ (free online courses), యొక్క ఉచిత ప్రయోజనాన్ని ఏడాదివరకు పొందుతారు.

ఇప్పటికే ఎయిర్ టెల్ (Airtel)  కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఫ్రీ డిస్నీ + హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ అందించ్చింది.  రూ .499 ప్లాన్ 3GB డెయిలీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS, ఒక ఏడాది పాటు  డిస్నీ + హాట్ స్టార్ (Disney+ Hotstar mobile),  అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ (Amazon Prime Video mobile) 30 రోజుల వరకు వినియోగించుకోవచ్చు.

ఫాస్ట్ టాగ్ రీచార్జ్ (FASTag recharge) ద్వారా రూ .100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది 28 రోజుల వరకు వ్యాలిడిటీ (validity) ఉంటుంది. రూ .699 ప్లాన్ కస్టమర్లకు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. 56 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్ (unlimited calls), రోజుకు 100 SMS లు పొందవచ్చు. ఇక ఇతర లాభాలు చూస్తే.. రూ .499 ప్లాన్ లాగానే ఉన్నాయి. రూ .2,798 ప్లాన్ రూ .699 ప్లాన్ మాదిరిగానే 365 రోజుల వ్యాలిడిటీ వరిస్తుంది.