స్మాల్ స్క్రీన్ కాంట్రవర్సియల్ షో బిగ్ బాస్ సీజన్ 5(Big boss 5) సక్సెసఫుల్ గా ముందుకు దూసుకుపోతుంది. చూస్తుండగానే అప్పుడే వారం  చివరకు చేరింది. వీకెండ్ జోష్ ని మన ముందు కు తీసుకువచ్చారు హోస్ట్ నాగార్జున. ఇందులో భాగంగా ఎలిమినేషన్(Elimination) ప్రక్రియ కూడా ఉంటుంది.

మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్(Nomination) లో ఆరుగురు నామినెటే అయ్యారు. మరి ఈ మొదటి వీకెండ్ షో లో ఎవరు సేఫ్ అవుతారో ఎవరు ఎలిమినేట్ అవుతారో పూర్తి గా తెలుసుకోవాలంటే శని, ఆదివారాలు రెండు రోజులు జరిగే వీకెండ్ షో ని చూడాల్సిందే. మరి శనివారం జరిగిన ఎపిసోడ్ 7  లో హోస్ట్ నాగార్జున మంచి సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇచ్చి షో ని స్టార్ట్ చేసారు. పంచ అక్షరాల, పంచేంద్రియాల, పంచ భూతాలసాక్షి గా నా పంచ ప్రాణాలు మీరే అంటూ ఆడియన్స్ కి వెల్కమ్ చెప్పిన నాగ్.

బిగ్ బాస్ హౌస్(Big boss house) లోకి హౌస్ మేట్స్ వెళ్లి అప్పుడే వన్ వీక్ అవుతోంది అని, చాలా డ్రామా, కోపాలు, కామెడీ అన్ని రకాల ఎమోషన్స్ జరుగుతున్నాయి  అని నాగ్ అన్నారు. ఉమ అందరి మీద అరుస్తుంది, కాజల్ ఊరికే అందరి విషయాల్లోనూ వేలు పెడుతోందని, లహరి ఇర్రిటేట్ అవుతుందని . జెస్సీకి పెద్దవాళ్లంటే  రెస్పెక్ట్ లేదని, లోబో బాగానే ఎంటర్ టైన్ చేస్తున్నాడని అన్నారు. అయితే హౌస్‌లో జరిగే తప్పొప్పుల్ని మీతో పాటు  నాకూ హౌస్ మేట్స్(Housemates) ని కడిగేయాలి అనిపిస్తోంది, కానీ మొదటి వారంలో ఒకర్నొకరు అర్థం చేసుకోనిద్దాం.  ఈ వారం వదిలేదం నెక్స్ట్ వీక్ నుంచి చూసుకుందాం అని మన టీవీ లో శుక్రవారం జరిగిన షో ని చూసారు.

జైలు లో వున్నా  జెస్సీ పట్ల హౌస్ మేట్స్ జాలీ, చూపించడాన్ని ఆనీ మాస్టర్ సహించలేకపోయింది . వీళ్ల నటన చూడలేకపోతున్నాం, అని తెగ ఫీల్ అవుతూ రవి తో చెప్పింది.  రవి కూడా ఆనీకి సపోర్ట్‌గా మాట్లాడాడు. జైలుకి వెళ్లాడు గా తెలుసుకుంటాడులే అని అన్నాడు. ఇక ఆ తరువాత ఉమా తో గొడవ పడ్డ ప్రియాంక  ఉమా కు సారీ చెప్పి  నేను అల మాట్లాడకుండా ఉండాల్సింది అని ఎమోషనలైంది. ఉమా కి హాగ్ ఇచ్చి ప్రాబ్లెమ్ క్లియర్ చేసుకుంది ప్రియాంక. ఇక ప్రియా, ప్రియాంక ల మధ్య మానస్ ఇంకా హౌస్  లోని అబ్బాయిలు మంచోలని, సాధారణంగా నేను త్వరగా అబ్బాయిలతో కలవనని. ఈ సీజన్  లో అబ్బాయిలు  అందరు కలిసిపోయారని ప్రియా చెప్పింది.  వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ(discussion) చాలా ఇంట్రస్టింగ్(interesting) అనిపించింది.

ఇక బిగ్ బోస్ హౌస్ లో ఎంటర్టైన్ (entertain) చేసే లోబో ని రవి కాసేపు ఆటాడేసుకున్నాడు. లహరిని చూస్తున్న లోబో రేయ్ నువ్వు అలా చూడ్కురా . నిన్ను మూళ్ళ పంది అనుకుంటుంది ఆమె అని లహరికి కన్ను కొట్టాడు యాంకర్ రవి. అవును నేను మూల కూర్చున్నా కాబట్టి.. ముళ్లపందినే అని అన్నాడు. ఆ తరువాత ముళ్లపందితో పాటు దున్నపోతు అని లోబోని ఆటపట్టించాడు రవి. ఆ తరువాత ఉమా, లోబో ల  మధ్య నడిచిన ఫన్నీ డిస్కషన్. జెస్సీ జైలు నుంచి విడుదల కావడంతో చిందులు వేసిన హౌస్ మేట్స్ (house mates) . మొత్తంగా హౌస్ మంచి జోష్‌లో వుంది అంటూ హోసే మేట్స్ (House mates) తో మాట్లాడడం స్టార్ట్ చేసిన కింగ్ నాగార్జున. గ్రీకు వీరుడు  పాట పాడి హౌస్ మేట్స్ నాగ్ కి వెల్కమ్(Welcome) చెప్పారు.

మొదట ఆని మాస్టర్ తో మొదలుపెట్టి మీకు కోపం వస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది అనడం తో న 18 ఏళ్ళ  వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు కోపడటం చూడలేద్దన్నారు ఆని మాస్టర్. ప్రియాంక తో మాట్లాడుతూ అందరిని కలుపుకుని పోతు చాలా మెచూరిటీగా బెహవె చేస్తున్నావ్ అని, సిరి కెప్టెన్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పారు నాగ్,  ప్రియను కిచెన ని మేనేజ్ చేస్తునందుకు పొగిడారు. లోబో ​ని హౌస్ లో ఎంటర్టైన్ చేస్తునందుకు  అప్రిసియేట్(appreciate) చేసారు, సరయూ ని బూతులు ఎం వినపడట్లేదు జాగ్రత్త గా ఆడుతున్నావా అంటూ, ఇక షన్ను ని అరేయ్ ఏంట్రా అది, కొంచం మాట్లాడారా, వన్ వీక్ అయిందిరా, ఆడడం మొదలెట్రా అని నవ్వుతూనే ఇచ్చి పడేసారు. విశ్వ, శ్రీ రామ చంద్ర ని లక్సరీ బడ్జెట్ (Luxury budget) టాస్క్ బాగా ఆడారని, హౌస్ మేట్స్(House mates) అందరిని పలకరించిన నాగ్.

ఆ తరువాత ఇంటి సభ్యుల అసలు పేస్ ని  తెలపటానికి  ఎవరు సెట్ ఎవరు కట్ అనే టాస్క్ ఇచ్చారు నాగార్జున. హౌస్‌లో మీకు ఎవరితో బాగా సెట్ అయ్యారో వాళ్లకి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇవ్వాలి, అలాగే ఎవరితో కట్ చేసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ల ఫొటోని చింపి డస్ట్ బిన్‌లో పడేయాలని చెప్పారు  నాగార్జున. ఈ టాస్క్‌ లో చాలామంది ఆర్జే కాజల్‌ని టార్గెట్ చేశారు. హౌస్‌లో ఉన్నవాళ్లలో దాదాపు సగం మంది ఆమె ఫొటోలను చింపి డస్ట్ బిన్ పడేసారు. ఉమాదేవి అయితే కాజల్ ఫొటోని కోపం తో  ముక్కలు ముక్కలు చేసి, నా పుట్టలో వేలు పెడితే నేను వదలను సార్ అంటూ నాగార్జున తో అన్నారు. ఇక సిరి-సరయల మధ్య కూడా ఆర్గుమెంట్ జరిగింది. గ్రూప్‌లుగా ఆడి గెలవడం కాదు, ఒక్కదానివే  ఆడి గెలవాల్సింది అని  టార్గెట్ చేసి , మాట్లాడినది సరయు. దీంతో సిరి ఏడుస్తూ  నేను కెప్టెన్ కావాలని అసలు అనుకోలేదని, గ్రూప్‌లుగా ఎవరు టాస్క్ లు ఆడటం లేదని   వెక్కి వెక్కి  ఏడ్చింది. శ్వేతా మాట్లాడుతూ  అమ్మ లేని తనకు ఈ హౌస్ లో ఆని మాస్టర్ తో  కనెక్ట్ అయ్యానని  ఎమోషనల్ అయింది . అలాగే లోబో మాట్లాడుతూ షన్ను తో బాగా సెట్ అయ్యాను అని తన తండ్రి లాగా అని విషయంలో అడ్వైస్ ఇస్తుంటాడు అని ఎమోషనల్ అయ్యాడు.

ఇప్పటికే నామినేషన్స్ లో వున్నా ఆరుగురు హౌస్ మేట్స్(house mates) లో ఇద్దరినీ సేఫ్ చేసిన నాగ్. రవి, హమీద లు సేఫ్ జోన్(safe zone) లో వున్నారు మానస్, సరయు,కాజల్, జెస్సి ఎలిమినేషన్(elimination) లో వున్నారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ ఆవ్వనున్నారో, బిగ్ బాస్  సీజన్ (Big boss season 5). లో  మొదటి హౌస్ మెట్ అవుట్ అవ్వుతున్నది ఎవరో  చూడాలని నాతో పాటు మీరు ఎక్ససైట్ అవ్వుతున్నారా. అయితే రేపటి ఎపిసోడ్  వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.