రియల్‌మీ సీ35 (Real me C35) మొబైల్‌ సేల్‌(Mobile Sale) మొదలైంది. బడ్జెట్ రేంజ్‌(Budget Range)లో రియల్‌మీ (Real me) ఇటీవల విడుదల చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ తొలిసారిగా నేడు (మార్చి 12) భారత్‌లో సేల్‌కు వచ్చింది.

50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా(Main Camera), 5000ఎంఏహెచ్ బ్యాటరీ(Battery), ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్(Fast Charging Support) లాంటి స్పెసిఫికేషన్ల(Specifications)తో ఈ మొబైల్‌ వస్తోంది. సైడ్లకు ఫ్లాట్ ఫ్రేమ్‌(Flat Frame)తో డిజైన్(Design) సైతం ఆకట్టుకునేలా ఉంది.

Real me C35 మొబైల్‌ సేల్‌(Mobile Sale), ధర(Price), ప్రస్తుత ఆఫర్(Present Offer) లాంటి పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరచి ఉంది.

Real me C35 ధర, ఆఫర్ వివరాలు

రియల్‌మీ సీ35(Real me C35) మొబైల్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ బేసే(Storage Base) వేరియంట్ ధర(Variant Price) రూ.11,999గా ఉంది.4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్‌ మోడల్(Storage Top Model) ధర రూ.12, 999. గ్లోయింగ్ గ్రీన్(Glowing Green), గ్రోయింగ్ బ్లాక్(Growing Black) కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్‌ లభ్యమవుతోంది.

ఈ కామర్స్ సైట్(Commerce Site) ఫ్లిప్‌కార్ట్‌(Flip Kart) తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌(Official Website)లో రియల్‌మీ సీ35 మొబైల్ కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుత సేల్‌ సందర్భంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు(SBI Credit Card)తో కొంటే రూ.1000 అదనపు డిస్కౌంట్(Extra Discount) లభిస్తుంది. రియల్‌మీ వెబ్‌సైట్‌లో ఏ క్రెడిట్ కార్డుతో కొన్నా రూ.1000 తగ్గింపు వర్తిస్తుంది. అంటే బేస్ వేరియంట్‌ను రూ.10,999కే దక్కించుకోవచ్చు.

Real me C35 స్పెసిఫికేషన్లు

రియల్ మీ స్మార్ట్ఫోన్(Smart Phone) 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే(LCD Display)తో రియల్‌మీ సీ35 వస్తోంది. అలాగే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అంచులు సన్నగా ఉండడంతో 90.8 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో(Skin too Back Body Ratio)ను కలిగి ఉంది.

రియల్ మీ (Real me)  C35 మొబైల్‌ అక్టాకోర్(Actocore) యునిసోక్ టీ616 (Unisoc T616) ప్రాసెసర్‌(Processor)పై రన్ అవుతుంది. గరిష్ఠంగా 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అలాగే స్టోరేజ్ పెంచుకునేందుకు మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్(Micro SD Card Slot) కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0తో ఈ మొబైల్‌ వస్తోంది. రియల్ మీ (Real me) C35 మొబైల్‌ వెనుక మూడు కెమెరాల సెటప్ (Cameras Setup) ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్(Macro Sensor), ఓ బ్లాక్ అండ్ వైట్ కెమెరా(Black  AND White Camera) ఉన్నాయి.

ఇక వీడియో కాల్స్(Video Calls), సెల్ఫీల(Selfies) కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా(Front Camera)ను రియల్‌మీ పొందుపరచింది. అలాగే 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్‌ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌(Fast Charging)కు సపోర్ట్(Support) చేస్తుంది.