దక్షిణ కొరియా(South Korea) స్మార్ట్ దిగ్గజం శాంసంగ్ నిన్న (ఫిబ్రవరి 9)న నిర్వహించిన గెలాక్సీ అన్​ప్యాక్డ్ ఈవెంట్​లో(Galaxy Unpacked Event) సరికొత్త ప్రొడక్ట్స్ (Products) లాంచ్​ చేసింది. గెలాక్సీ ఎస్​22 సిరీస్​ ఫోన్లతో పాటు గెలాక్సీ ట్యాబ్​ ఎస్​8(Galaxy tab S8) సిరీస్​ ట్యాబ్లెట్లను రిలీజ్ చేసింది. ఈ ఆండ్రాయిడ్​ ట్యాబ్లెట్లు యాపిల్ ఐప్యాడ్ లైనప్‌కు గట్టి పోటీనిచ్చే ఛాన్స్ ఉంది. శామ్​సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 సిరీస్​లో(Samsung Galaxy Tab S8) గెలాక్సీ ట్యాబ్​ S8, గెలాక్సీ ట్యాబ్​ S8 ప్లస్(Plus), గెలాక్సీ ట్యాబ్​ S8 అల్ట్రా(ULTRA) అనే మూడు వేరియంట్లు ఉంటాయి. అన్ని మోడల్స్ 5జీ కనెక్టివిటీ(Connectivity)కి మద్దతును ఇస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 12 వెర్షన్(Android 12 Version) అవుట్ ఆఫ్ ది బాక్స్‌ ఓఎస్(Out Of the Box)​పై పనిచేస్తాయి. గెలాక్సీ ట్యాబ్​ ఎస్​ 8 సిరీస్​ ట్యాబ్లెట్లలోని ఫీచర్ల(Features)ను పరిశీలిద్దాం.

శామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్ S8 స్పెసిఫికేషన్లు

గెలాక్సీ ట్యాబ్ S8 అనేది రెగ్యులర్ వేరియంట్. ఇది 11-అంగుళాల WQXGA డిస్‌ప్లే(Display)తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతిస్తుంది. దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌(Finger Print Sensor)ను కూడా అందించింది. ఈ ట్యాబ్లెట్​ ఎస్​ పెన్‌(Tablet 0S)కు మద్దతిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ S8 8 జీబీ, 12 జీబీ ర్యామ్(Ram) ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆక్టా-కోర్ చిప్‌సెట్​పై పనిచేస్తుంది. గెలాక్సీ ట్యాబ్​ ఎస్​8 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్​ మోడళ్ల(Storage Model)లో వస్తుంది.

డెడికేటెడ్ కార్డ్ స్లాట్‌(Dedicated Card Slot)ని ఉపయోగించి స్టోరేజ్​ను 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఈ టాబ్లెట్‌కు రెండు వైపులా కెమెరాలు ఉంటాయి. దీని వెనుకవైపు, 13 మెగాపిక్సెల్, 6- మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాలను అందించింది. ఇక, ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను చేర్చింది. టాబ్లెట్‌లో AKG, డాల్బీ అట్మోస్‌తో నడిచే క్వాడ్ స్టీరియో స్పీకర్లను అమర్చింది. శామ్​సంగ్​ టాబ్లెట్ 8,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45W ఫాస్ట్​ ఛార్జింగ్​(Fast Charging)కు మద్దతిస్తుంది.

శామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ S8+ స్పెసిఫికేషన్లు..

శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 ప్లస్​ 12.4 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే(Display)తో వస్తుంది. గెలాక్సీ ట్యాబ్ S8 మాదిరిగానే దీని రెండు వైపులా సింగిల్​ సెట్ కెమెరాలను అమర్చింది. డిస్​ప్లే కింది భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్​ను అందించింది. ఈ ట్యాబ్లెట్​లో 10,090mAh బ్యాటరీ(Battery)ని అమర్చింది. ఈ బ్యాటరీ 45W వరకు ఫాస్ట్​ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది.

శామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా స్పెసిఫికేషన్లు..

శామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా వేరియంట్​ అత్యుత్తమ ఫీచర్లతో వస్తుంది. ఈ టాబ్లెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 14.6 -అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే(Display)ను కలిగి ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్​ 8 అల్ట్రా మోడల్ 8 జీబీ, 12 జీబీ, 16 జీబీ ర్యామ్​ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలోని 512 జీబీ స్టోరేజ్​ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. సెక్యూరిటీ కోసం డిస్ప్లే క్రింద ఇంటిగ్రేటెడ్​ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 13- మెగాపిక్సెల్, 6 -మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలను చేర్చింది. ఇక, దీని ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం డ్యూయల్ 12 -మెగాపిక్సెల్, 12 -మెగాపిక్సెల్ (అల్ట్రా-వైడ్) కెమెరాల(Cameras)ను పొందుపరచి వుంది. ఈ ట్యాబ్లెట్​ 11,200mAh బ్యాటరీ ప్యాక్(Battery Pack)​తో వస్తుంది.