రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Railtel Corporation of India Limited) వివిధ పోస్టుల కోసం 69 ఖాళీలతో నోటిఫికేషన్‌ను విడుదల(Release) చేసింది. డిప్యూటీ మేనేజర్(DM), మేనేజర్(Manager), సీనియర్ మేనేజర్(Senior Manager) ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్(Online) లో దరఖాస్తులను  ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు Railtelindia.com లో దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. రైల్‌టెల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ (RRE) 2022 ఆన్‌లైన్ మోడ్‌(Online Mode)లో నిర్వహించనున్నారు. వయో పరిమితి(Age Limit), విద్య(Education), ఎంపిక ప్రక్రియ(Selection Process), దరఖాస్తు రుసుము(Application fee), రైల్‌టెల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలా దరఖాస్తు చేయాలి & ఇతర సమాచారం(Details) వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఎంపిక విధానం:

ఇందులో మొత్తం 150 మార్కుల(150 marks) మల్లిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు(MCQ) ఉంటాయి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్(Short List) చేసి 50 మార్కులతో ఇంటర్వ్యూ ఇర్వహిస్తారు. ఉద్యోగానికి ఎంపిక కావాలంటే అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష(Online Exam), ఇంటర్వ్యూ(Interview)లో కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుముగా రూ.1200 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు(RCA) రూ.600 చెల్లించాలి.

అర్హత పత్రాలు            

  • అభ్యర్థులు విద్యార్హత(Education Qualification), సర్టిఫికేట్(Certificate), కుల ధృవీకరణ పత్రం(Caste Certificate) [SC/ST/OBC (NCL)/EWS], ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్, వైకల్య ధృవీకరణ పత్రం, మాజీ సైనికులు, ఇతరుల విషయంలో డిశ్చార్జ్ సర్టిఫికేట్(Discharge Certificate) వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకునే విధానం :
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్(Official Website) railtelindia.com కి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో ‘కెరీర్స్’(Careers) ట్యాబ్‌ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ కొత్త పేజీ ఓపెన్(New Page OPEN) అవుతోంది. ‘ప్రస్తుత ఉద్యోగ అవకాశాలు’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • రైల్‌టెల్ RailTel కార్పొరేషన్ టెక్నికల్/మార్కెటింగ్/ఫైనాన్స్/లీగల్ విభాగాల్లో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ (SC/ST/OBC బ్యాక్‌లాగ్(Backlog) ఖాళీలతో సహా) ట్యాబ్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలి.
  • తరువాత రైల్‌టెల్(RailTel) రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ఫారమ్(Application Form) స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • మీ వివరాలను పూరించి, నిర్ణీత ఫార్మాట్‌లో అవసరమైన పత్రాలను అప్‌లోడ్(Upload) చేయండి.
  • దరఖాస్తు రుసుము(Application Fee) చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్(Format Submit) చేయాలి. రిఫరెన్స్(Reference) కోసం ప్రింట్ అవుట్(Printout) తీసుకొని ఉంచుకోవాలి.