మీకు రంగులు మార్చే ఊసరవెల్లి తెలుసా? ఆ తెలిసే వుంటదిలేండి! కానీ రంగులు మార్చే స్మార్ట్ ఫోన్(Color Change Smart Phone) చూసారా? ఇప్పుడు చూడచ్చు. ఈ రంగులు మార్చే సరికొత్త స్మార్ట్ ఫోన్ వివో(VIVO) సంస్థ అందిస్తోంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ రంగులు ఎలా మారుస్తుంది. దాని స్పెసిఫికేషన్స్ ఏంటి? దాని ధర ఎంత?  వంటి వివరాలు ఇక్కడ చూద్దాం. చైనీస్(Chinese) స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ వివో బుధవారం భారతదేశం(INDIA)లో వీ23 సిరీస్‌(V23 Series)ను ప్రారంభించింది, ఈ స్మార్ట్ ఫోన్ రంగును మార్చే(Color Change) బ్యాక్ ప్యానెల్(Back Panel) మరియు భారతదేశపు మొట్టమొదటి 50MP ‘ఐ AF డ్యూయల్ సెల్ఫీ(Dual Selfie)’ కెమెరా(Camera)ను అందిస్తుంది.

“వీ23 (V23) రంగును మార్చే (Color Change) భారతదేశపు మొట్టమొదటి ఫ్లోరైట్ AG గ్లాస్ డిజైన్(AG Glass Design) తో వస్తుంది, దీని కారణంగా బ్యాక్ గ్లాస్‌(Back Glass)పై నేరుగా సూర్య కిరణాలు(Sun Lights) పడితే రంగులు మారుతుంది. అంటే ఎండకు వెళితే ఈ మొబైళ్ల వెనుక భాగం విభిన్న కలర్స్‌(Different Colors) లో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌(Feature)తో ఇండియా(INDIA) లో వచ్చిన మొదటి మొబైల్స్ ఇవే. అంతే కాకుండా భారతదేశపు మొట్టమొదటి 50MP ఐ ఆటోఫోకస్ డ్యూయల్ సెల్ఫీ మరియు 108 MP వెనుక కెమెరాతో సహా అసాధారణమైన పనితీరు మరియు పరిశ్రమ-ప్రముఖ ఆవిష్కరణలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది” అని వివో(VIVO) ఇండియా డైరెక్టర్-బ్రాండ్ స్ట్రాటజీ(Director Brand Strategy) యోగేంద్ర శ్రీరాముల(Yogendra Sriramulu) అన్నారు. “ప్రపంచవ్యాప్తం(World Wide)గా ఉన్న మా ఆర్ అండ్ డి(R&D) కేంద్రాలు 5 జి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AJ), ఎర్గోనామిక్ డిజైన్(Ergonomic Design) మరియు ఫోటోగ్రఫీ సామర్థ్యాల(Photography Capacity)ను నిర్మించడం వంటి కొత్త టెక్నాలజీ(New Technology)ల అభివృద్ధిపై దృష్టి సారించాయి” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

వివో వీ23 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (Vivo V23 Pro 5G Specifications)

వివో వీ23 5జీ ప్రో 5జీ మొబైల్ మీడియాటెక్ డైమంసిటీ 1200 ఎస్ఓసీ (MediaTek Dimensity 1200 Soc)తో వస్తోంది. అలాగే 6.56 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ+ అమోల్డ్  కర్వ్‌డ్ డిస్‌ప్లే(Full HD+AMOLED Curves Display)  ఉంది. వివో వీ23 5జీ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్(3 Camera Setup) తో వస్తోంది. 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాలు (Micro Cameras) ఉన్నాయి. ఇక రెండు ఫ్రంట్ కెమెరాలు(Two Front Cameras) ఉన్నాయి.50MP ఐ ఆటోఫోకస్ కెమెరా (I Auto Focus Camera) ప్రధాన ఆకర్షణ కాగా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. 4300ఎంఏహెచ్ బ్యాటరీ (Battery)తో వస్తున్న వివో వీ23 ప్రో 5జీ (Vivo V23 Pro 5G) మొబైల్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌(Fast Charging)కు మద్దతు(Support) ఇస్తుంది.

వివో వీ23 5జీ స్పెసిఫికేషన్లు (Vivo V23 5G Specifications)

వివో వీ23 మొబైల్ 6.44 ఇంచుల ఫుల్‌హెచ్‌డీ+ అమోల్డ్  డిస్‌ప్లేతో వస్తోంది. అలాగే 44MP, 8MPగా ఉన్న రెండు ఫ్రంట్ కెమెరాల కోసం నాచ్‌ డిజైన్‌ ఉంది. వివో వీ23 మొబైల్‌ వెనుక మూడు కెమెరాల సెటప్(Camera setup) ఉంది. 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా (Ultra Wide Camera), 2MP డెప్త్ సెన్సార్ కెమెరా (Depth Sensor Camera) ఉన్నాయి. వివో వీ 23 మొబైల్ మీడియాటెక్ డైమంసిటీ 920 (MediaTek Dimensity) 5జీ ప్రాసెసర్‌(Processor)తో నడుస్తుంది. 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ కూడా 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌(Fast Charging)కు సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ (Android) 12 ఆధారిత ఫన్‌టచ్(One Touch) ఓఎస్ 12తో వివో వీ23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు వస్తున్నాయి.

వివో వీ23 ప్రో 5జీ ధర, అమ్మకాలు (Vivo V23 Pro Price, validity)

ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ(Storage)తో ఉన్న వివో వీ 23 ప్రో(VIVO V23 PRO) ప్రారంభ ధర రూ.38,990 గా ఉంది.12జీబీ ర్యామ్(Ram), 256జీబీ స్టోరేజీ వేరియంట్ (Storage Variant) ధర రూ. 43,990 గా ఉంది. ఈకామర్స్(E-Commerce) సైట్ ఫ్లిప్‌కార్ట్‌(Flip Kart) లో జనవరి 19వ తేదీ నుంచి ఈ మొబైల్(E-Mobile) అమ్మకాలు(Sales) మొదలుకానున్నాయి. అలాగే vivo.comతో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్ల(Offline Stores)లోనూ వివో వీ23 సిరీస్ మొబైళ్లు(VIVO V23 Series Mobiles) అందుబాటులో ఉండనున్నాయి. అయితే ప్రీఆర్డర్లు(Pre Orders) ఇప్పటి నుంచే చేసుకోవచ్చు