డిజిటల్ లెండింగ్ యాప్స్(Digital Lending Apps) కోసం త్వరలో ఓ రెగ్యులేటరీ విధానాన్ని(Regulatory system) తీసుకు వస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్(Governor Sakthi Kanth) గురువారం తెలిపారు.

ఆయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌(Ajadi kaa Amruth Mahosthav)లో భాగంగా నిర్వహించిన ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్(Icon Week Celebrations) కార్యక్రమంలో మాట్లాడారు.

ఆన్ లైన్ రుణ యాప్స్(Online Lending App) పైన రెగ్యులేటరీ విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా రుణాలు ఇస్తున్న యాప్స్‌లో ప్రస్తుతం చాలా వరకు అక్రమంగా, అవ్యవస్థీకృతంగా కొనసాగుతున్నాయి.

ఆర్బీఐ వద్ద రిజిస్టర్(Register) కాని పలు యాప్స్‌కు చెందిన ఏజెంట్ల వేధింపులకు కొంతమంది బలైపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ లెండింగ్ యాప్స్ నియంత్రణ(Control)కు త్వరలో మార్గదర్శకాలు తీసుకు వస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.

డిజిటల్ యాప్స్(Digital Apps) ద్వారా రుణాలు(borrows) ఇస్తున్న వారితో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు వీలైనంత త్వరలో ఓ బోర్డు రెగ్యులేటరీ నిర్మాణాన్ని తీసుకు రానున్నామని, ఈ యాప్స్‌ లో చాలావరకు అనధికారిక(Unofficial), గుర్తింపులేని(Recognized), అక్రమసంస్థలు(Fraud Companies) ఉన్నాయన్నారు.

మీరు ఆన్ లైన్ యాప్ ద్వారా రుణం తీసుకుంటే ఆ సంస్థకు ఆర్బీఐ గుర్తింపు ఉందా లేదా తెలుసుకోవాలని, గుర్తింపు ఉన్న సంస్థ ఏమైనా అవకతవకలకు పాల్పడితే ఆర్బీఐ తక్షణమే చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇది నా తరఫున ఇచ్చే హామీ అన్నారు. ఆన్ లైన్ లోన్ యాప్స్ నుండి సమస్య(Raise Problems) ఎదురైతే స్థానిక పోలీస్ స్టేషన్ల(PS)ను ఆశ్రయించాలన్నారు.