ప్రయాణానికి పలు రకాల వాహనాలు ఇప్పటికే ఉన్నాయి. అందులో చాలా వరకు కార్లు, రైళ్ళు, విమానాలు, పెద్ద పెద్ద ఓడలు నాలుగు రకాలు. అయితే వ్యక్తిగతంగా ఎవరైనా ఈ నాలుగు మార్గాల్లో ప్రయాణించవచ్చు. కానీ ఒక్కరే అలా రెక్కలు కట్టుకుని గాల్లో ఎగరాలని ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఒక్కసారైనా అనిపించకమానదు. ఇదుగో సరిగ్గా ఈ ఆలోచనే వచ్చింది ఫ్రెంచ్ దేశస్థుడు Franky Zapata కు. ఆయన వ్యక్తిగతంగా గాల్లోకి దూసుకెళ్ళే ఒక వాహనాన్ని తయారు చేసాడు. అదే ఈ Ezfly Hoverboard.

సహజంగా Hoverboard అంటే రెండు చక్రాలు కలిగి పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించడానికి ఉపయోగిస్తారు. అదే మాదిరిగా గాల్లో ఎగరడానికి ఈ వాహన్నాన్ని తయారు చేసాడు Zapata. అయితే Zapata గతంలో ఇదే మాదిరి Flyboard Air అనే వాహనాన్ని తయారు చేసాడు. కానీ దాంట్లో ఒంటికి స్ట్రాప్స్ తగిలించుకోవాల్సి రావడం ఒక పరిమితి అయి కూర్చుంది. అందువల్ల ఈ Ezfly లో ఆ పరిమితిని అధిగమించి ఎలాంటి స్ట్రాప్స్ లేకుండా దీనిని రూపొందించారు.

ఇక్కడ చూపించే వీడియోలో టెక్సాస్ లోని ఒక చెరువు పై ఒక మనిషి ఈ వాహనంతో గాల్లో చక్కర్లు కొట్టడం మనకు కనిపిస్తుంది. ఈ వాహనం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ముందుకు వెనక్కి వాహనాన్ని నియంత్రిoచడానికి పొడుగాటి కర్రలు రెండు ఉన్నాయి. వాటిని పట్టుకుని మన శరీరాన్ని అటు ఇటూ తిప్పుతూ ఉంటే దిక్కులు మారుతూ ఈ వాహనం గాల్లో తిరుగుతుంది. ప్రస్తుతం ఈ వాహనం నడపడానికి అక్కడ జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఈ వాహనాన్ని mass production చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిని అమెరికా మిలిటరీ కోసం వినియోగించనున్నారు.

Courtesy