ఈ దశాబ్దం ఆరంభం నుండి స్మార్ట్ అప్లికేషన్స్ పురుడు పోసుకున్నాయి. ఇదంతా ఇంటర్నెట్ మహత్యమే అయినా దాని నుండి మనం వాడే ఒక్కో వస్తువు రూపు రేఖలే మారిపోతున్నాయి. ఇప్పటికే స్మార్ట్ హోం పరికరాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. అందులో హోం సెక్యూరిటీ (ఇంటి భద్రత), స్మార్ట్ ఫ్రిడ్జ్ మొదలుకుని వాయిస్ అసిస్టెంట్ల వరకు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి ఫర్నిచర్ కూడా వచ్చి చేరింది. ఒకప్పుడు ఒక జడ పదార్ధంలా ఉండే బల్లలు (tables) మొదలైనవి కూడా సాంకేతిక మెరుగులద్దుకుని కొత్తగా తయారవుతున్నాయి. అందుకు ఉదాహరణే ఈ Sobro side table.

ఈ side టేబుల్ ను న్యూయార్క్ కు చెందిన ఒక సంస్థ రూపొందించింది. వీరు గతంలో ఈ side table మాదిరి smart coffee table ను కూడా రూపొందించారు. అది విజయవంతం కావడంతో ఇప్పుడీ side table తో మన ముందుకు వచ్చారు. side table, అంటే మరీ పెద్దది కాకుండా ఇంట్లో ఓ మూల కొంచెం స్థలంలో కొన్ని వస్తువులను పెట్టుకోవడానికి పనికొస్తుంది. దీనినే అమెరికాలో నైట్ టేబుల్ అని కూడా అంటారు. పేరు ఏదైనా చేసే పని ఇదే. మరి ఈ side table Sobro side table గా తయారయ్యిoది. మరి దీనిలో ఏమున్నాయో చూద్దామా. దీనితో బహుళ ప్రయోజనాలు కలిగేలా దీనిని రూపొందించారు దీని రూపకర్తలు. దీనిలో ఫ్రిడ్జ్ మాదిరి కూలర్, స్మార్ట్ లాకర్, వైర్లెస్ ఛార్జింగ్, బ్లూటూత్ స్పీకర్స్, మోషన్ సెన్సర్ లైటింగ్, ఛార్జింగ్ పోర్ట్స్, మూడ్ లైటింగ్ ఇంకా మంచి నిద్ర పట్టడానికి ఉపకరించే యాప్ కూడా ఉంది.

దీనిలో చాలానే ఫీచర్లు ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫర్నిచర్ కాబట్టి ఒక యాప్ ద్వారా అనుసంధానం చేయబడి ఇవన్నీ పని చేస్తాయి. కూల్ డ్రింక్స్ మొదలైన వాటి కోసం ఒక కూలర్, ముఖ్యమైన వస్తువులు లేదా పత్రాలు దాచేందుకు స్మార్ట్ లాకర్, అలాగే దీని పైన ఒకేసారి రెండు ఫోన్లు వైర్లెస్ ఛార్జింగ్ చేయబడతాయి. అలాగే నిద్ర మధ్యలో లేచి బయటకు వెళ్ళాల్సి వస్తే కాలు కింద పెట్టగానే LED లైట్ వెలుగుతుంది. అంటే చీకట్లో గోడ మీద స్విచ్ కోసం వెతుకులాట అవసరం లేదన్నమాట. అలాగే ఫోన్ ను బ్లూటూత్ ద్వారా ఈ టేబుల్ కు అనుసంధానం చేసుకుని పాటలు కూడా ప్లే చేయచ్చు. అలాగే 4 యుఎస్బి పోర్ట్లు కూడా కలవు. అంతే కాదు లాప్టాప్ ఛార్జింగ్ చేసేందుకు ఆ వైర్లు చుట్టుకోకుండా cord management system కూడా కలదు. ఇక తెల్లారి లేవాల్సి వస్తే ఫోన్లోనో గడియారంలోనో అలారం పెట్టుకోనవసరం లేదు. ఈ యాప్ లో పెట్టుకుంటే ఆ సమయానికి ఆహ్లాదకరమైన శబ్దం చేస్తూ సూర్య కాంతిని తలపించే లైటింగ్ తో మనల్ని ఈ టేబుల్ నిద్ర లేపుతుంది. అలాగే దీనిలో మనకు మంచి నిద్రకు ఉప్రకమించే యాప్ కూడా ఉంది. ఇక ఈ టేబుల్ లోని LED బుల్బ్ నైట్ బుల్బ్ లా కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ నైట్ బల్బ్ లో కూడా చాలా రకాల ఛాయలను మన యాప్ లో చూసి ఎంచుకోవచ్చు.

సరే, మరి మన జీవన శైలికి తగ్గట్టు ఇన్ని పనులు చేసి పెట్టే ఈ Sobro side table కొంచెం ఖరీదులోనే లభిస్తోంది. దీని ధర $900.