ఈ స్మార్ట్ సాంకేతికత పుణ్యమా అని ఇంటిలోని ఒక్కో వస్తువు స్వరూపం మారి పోతోంది, ప్రయోజనాలు మరి పోతున్నాయి. కేవలం 50, 60 ఏళ్ళు వెనక్కు వెనక్కి వెళితే అప్పుడు ఊహకు కూడా అందని ఎన్నో ప్రయోజనాలు, జడం అనుకున్న వస్తువులు ద్వారా సాధింపబడుతున్నాయి. ఆ కోవలోకే వీధి లైటు కింద సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ లాక్స్ ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు కొత్తగా మన ఇంటి గోడలు కూడా స్మార్ట్ అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో చూద్దామా.

కార్నెగీ మేల్లోన్ యూనివర్సిటీ (Carnegie Mellon University)కి చెందిన పరిశోధకులు ఇంట్లో ఈ జడమైన గోడలకు ఒక రకమైన పెయింట్ పూస్తే అప్పుడు ఆ గోడ విద్యుదయస్కాంత శక్తిని గ్రహించగలదని నిరూపించారు. Yang Zhang అనే Ph.D విద్యార్ధి, CMU కు చెందిన Human-Computer Interaction Institute (HCII) లో ఈ పరిశోధన చేసారు. ఈ మేరకు వీరి బృందం CHI 2018, మాంట్రియల్ లో జరిగే ఒక కార్యక్రమంలో వీరి పేపర్ ‘Wall++’ ను ప్రవేశపెట్టనున్నారు.

అయితే ఏంటి అంటే, దానితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఉదా. గదిలో జరిగే పనులను గమనించవచ్చు మనం ఎక్కడున్నా గమనించవచ్చు. స్విచ్బోర్డు అవసరం ఇక ఉండదేమో కూడా. ఇంకా చాలా విధాలైన ఉపయోగాలు ఉన్నాయి. Zhang ఒక conductive paint (విద్యుత్తుకు స్పందిoచగల) ను గోడ మీద ‘డైమండ్’ ఆకారం వచ్చేలా తాపడం చేసారు. ఆ పైన మరో రెండు కోట్లు పెయింట్ వేసి దానికి ఎలక్ట్రోడ్లను అమర్చారు. ఆ పైన ఆ ఎలక్ట్రోడ్లు పాడవకుండా మరో కోట్ పెయింట్ వేసారు. ఆ ఎలక్ట్రోడ్ల నుండి కంప్యూటర్ కు అనుసంధానం చేసారు ఈ గోడను. ఇప్పుడు ఈ గోడ రెండు విధాలుగా పని చేస్తుంది – capacitive sensing మరియు Electromagnetic sensing. మొదటిది చెప్పాలంటే గోడ ఒక టచ్ పాడ్ లా పని చేస్తుంది. అంటే కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను కేవలం గోడ ద్వారా ఆన్/ఆఫ్ ఇంకా నియంత్రించవచ్చు. ఆ పైన EM సెన్సింగ్ అంటే, ఒక్కో ఎలక్ట్రానిక్ వస్తువు కు ఉండే నిర్దిష్ట విద్యుదయస్కాంత తరంగాలను (Electromagnetic Signature) బట్టి ఏ వస్తువు వాడకంలో ఉందో చెప్పేస్తుంది. అంతే కాదు ఒక సెల్ ఫోన్ పట్టుకుని ఒక వ్యక్తి ఆ గదిలో నుంచుంటే ఆ వ్యక్తి సరిగ్గా ఇక్కడ నుంచున్నాడో కూడా కంప్యూటర్ లో చెప్పేస్తుంది. ఈ పరిజ్ఞ్యానంతో ఎన్నో అద్భుత స్మార్ట్ హోం ఉపయోగాలున్నాయని Zhang అంటున్నారు. ఈ గోడ మీద వేసిన conductive paint కూడా ఖరీదేమీ కాదు, కేవలం మీటర్ కు $20 మాత్రమే అంటున్నారు. దీనిని బట్టి మొత్తం గోడకు ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు.

ఈ పరిశోధన చాలా ప్రధమ స్థాయిలో ఉంది, ఇది మరింత అభివృద్ధి చెంది త్వరలోనే అందుబాటులోకి రావచ్చని Zhang అన్నారు.

Courtesy