మనిషి ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. మనిషికి ఆ రోజు పగలంతా ఉలాసంగా గడవాలంటే ముందు రోజు బాగా నిద్ర పోవాలి. కానీ ఎంతో మందికి పడుకుంటే త్వరగా నిద్ర పట్టదు, ఒక వేళ పడితే ఉదయం పెట్టుకున్న అలారం కాస్త మంచి కునుకు తీసేటప్పుడు మోగి నిద్రా భంగం కలిగించడం, ఇంకా కొంత మందికి రాత్రి నిద్ర సరిపోక పగలు వారి వారి కార్యాలయాల్లో నిద్ర మత్తు ఆవహిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం నిత్యం ఎదుర్కొనే సమస్యలే కదూ. ఇప్పుడు వీటికి సులువైన పరిష్కారం Sleepman వచ్చేసింది.

ఈ Sleepman చేతి మణికట్టుకు అంటించుకునే ఒక పరికరం (wearable). అక్కడి నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు, మెదడు నుండి శరీరానికి అందే సంకేతాలను ఈ పరికరం గమనిస్తూ ఉంటుంది. తద్వారా పడుకున్నప్పుడు మన నిద్రలో ఉండే వివిధ దశలను కనిపెట్టి తిరిగి ఉదయం తక్కువ గాఢత కలిగిన నిద్ర అవస్థలో మనల్ని లేపుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మంచి నిద్రలో లేచినప్పుడు కలిగే చిరాకును పోగొడుతుంది. ఇలా లేపేటప్పుడు మనం పెట్టుకున్న అలారం కు ఒక 10-20 నిముషాల ముందున్న సరే మంచి నిద్రను అంచనా వేసి ఆ నిద్రకు భంగం కలిగించకుండా నిద్ర లేపుతుంది. నిద్రలో మన గురించి మనకే తెలియదు కనుక, మన శరీరం, మెదడు నిద్రా ద్వారా స్వాంతన పొందిన తరువాత లేవడంతో మనకు రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. అంతే కాదు దీనిలో Power nap, doze alert అని మరో రెండు ఫీచర్లు ఉన్నాయి. అందులో మొదటిది power nap. ఉదయం కార్యాలయంలో మనకు నిద్ర వస్తే వెంటనే ఇది power nap అలెర్ట్ ఇస్తుంది. ఈ power nap mode ను ఆన్ చేసి మీరు పడుకుంటే, ఆ nap లో కూడా తక్కువ గాఢత కలిగిన నిద్రాసమయం (light స్లీప్)లో మిమ్మల్ని లేపుతుంది. ఆ విధంగా మీ శరీరానికి 10 నిముషాలు power nap అవసరం అయితే 10 నిముషాల్లోనే మిమ్మల్ని తట్టి లేపుతుంది. అలాగే మరొకరికి 20 నిముషాలు అవసరం అయితే 20 నిముషాలు పడుకోనిస్తుంది. ఇది అందికీ ఒకేలా పని చేయదు. ఒక్కో వ్యక్తి యొక్క శరీరము, మెదడు, నిద్ర అవస్థలను గమనిస్తూ ఇది పనిచేస్తుంది.

దీనిలో ఉండే మరో ముఖ్యమైన ఫీచర్ doze alert. నిద్ర అంటేనే మనకు తెలియకుండా ముంచుకొచ్చేది. మనం ఏదైనా కారులో ఎక్కువ దూరం ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్లు ఎక్కువగా నిద్ర మత్తు వస్తుంది. అలాంటప్పుడు ఈ పరికరం మీ మణికట్టును తట్టి లేపడం ద్వారా మీరు నిద్రలోకి జారే ముందే మీకు సూచన అందుతుంది. అప్పుడు దానికి తగిన ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు. ఇలా ఎవరూ పక్కన లేకపోయినా డ్రైవర్ సేఫ్టీ పాటించి తద్వారా ప్రమాదాలను ఈ ట్రాకర్ అరికట్టగలదు. మిగతా స్లీప్ ట్రాకర్ల తో పోల్చితే ఈ doze alert ఫీచర్ దీని ప్రత్యేకత.

ఇక సాధారణ స్లీప్ ట్రాకర్ల మాదిరి దీనిలో మీ నిద్రకు సంబంధించిన సమాచారమంతా మీ ఫోన్ కు చేరవేస్తుంది. అది చూసి మీ రోజులో మీరు తగిన మార్పులు చేసుకోవచ్చు. దీని ధర $99-130.