మన వరకూ మనం అలంకార ప్రియులం కదూ. ఎంచక్కా మంచి మంచి రంగు బట్టలు వేసుకుని ముస్తాబవుతాం. అలాగే మనo తినే ఆహారంలో కూడా కూరగాయలు తలో రంగులో ఉంటాయి. ఆయా కూరగాయల రంగును బట్టి ఆహార పదార్ధం రంగు కూడా మారుతుంటుంది. అయితే ఇవన్నీ పై వరకే. మన గొంతు దాటాక అన్నీ ఒక్కటే. పైకి అందంగా కనిపించే మన శరీర లోపలి భాగం ఎలా ఉంటుందో కేవలం వైద్యులకు తప్ప అన్యులకు తెలియదు. అలాగే మన గొంతు దాటాక మనo తినే ఆహారం ఎలా జీర్ణమవుతుందో కూడా మనకు తెలియదు. వైద్యులు కూడా ఏదో పుస్తకాల్లో చదువుకోవడం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. అలాంటిది మనం తినే ఆహారం ప్రత్యక్షంగా మన గొంతు దాటి మన కడుపులోకి ఎలా వెళ్తుందో, అలా వెళ్ళిన ఆహారం ఎలా జీర్ణమవుతుందో ప్రత్యక్షంగా చూడగలిగితే? ఆశ్చర్యంగా ఉంది కదూ, ఇది జరిగే పనేనా అని అనుకోకండి. జరిగిన పనే. అభివృద్ధి చెందిన సాంకేతికత ద్వారా సాధ్యం అయ్యిన పనే.
అయితే ఎవరు ఏంటి ఎలా అని అంటే…
2012 లో BBC రూపొందించిన ఒక science documentary Guts: The Strange and Mysterious World of the Human Stomach లో భాగంగా, BBC కి చెందిన science journalist Michael Mosley ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన లండన్ లోని సైన్సు museum లో ఆయన మీదనే ఈ ప్రయోగం చేసారు. ఇందుకోసం అందరూ చూస్తుండగా ఆయన ముక్కు లోకి ఒక గొట్టం ద్వారా ఒక చిన్న కెమెరా ను లోపలి పంపించారు. అలా ఆ కెమెరా లోపలి వెళ్ళిన తరువాత ఆయనకు కొన్ని ఆహార పదార్ధాలు తినిపించారు. అవి నమిలి మింగిన తరువాత అవి లోపల ఎలా జీర్ణం కాబడ్డాయో ఇక్కడ వీడియో లో చూడచ్చు.

Courtesy