ఇప్పుడు డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ లకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. అలాగే పిల్లలు సైతం టాబ్లెట్ లకు అతుక్కుపోతున్నారు. ఇలా ఫోన్, టాబ్లెట్, డిజిటల్ అసిస్టెంట్ మొదలైనవి మన రోజువారీ జీవితాల్లో చోటు సంపాదిస్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే పరికరంతో ఏ ప్రదేశాన్నైనా interactive touch screen లా మర్చేయచ్చు. ఇలా మన ఇంట్లో గోడ, తలుపు, బల్ల (table) ఇలా (flat surface) దేన్నైనా ఒక స్క్రీన్ లా మార్చగలదు ఈ Sony Xperia Touch Projector.

Sony సంస్థ ఈ ప్రొజెక్టర్ ను తయారు చేసింది. ఈ పరికరాన్ని (projector) Sony సంస్థ ఈ సంవత్సరం ఫెబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2018) లో ప్రవేశపెట్టింది. ఇది చూడటానికి మన సాధారణ వైఫై router అంత పరిమాణంలో ఉంటుంది. ఈ వైర్లెస్ ప్రొజెక్టర్ బ్లూటూత్, వైఫై కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఈ ప్రొజెక్టర్ ను ముందు పెట్టుకుని బ్లూటూత్/వైఫై కి కనెక్ట్ చేస్తే దీనిలో నుండి వచ్చే ప్రొజెక్షన్ 23 ఇంచ్ స్క్రీన్ ను మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఇంకేముంది దీనితో వీడియో గేమ్స్, skype మొదలైన వీడియో చాట్, వీడియోలు, ఎలాంటి అదనపు వైర్లు, set up అవసరం లేకుండా చూసుకోవచ్చు. ఇది USB కేబుల్ తో ఛార్జ్ చేయబడుతుంది. సరే, దీని వల్ల ఉపయోగమేంటి అనుకుంటున్నారా ఫోన్, tablet, PC లతో ఒక వ్యక్తికి మాత్రమే కనిపించే స్క్రీన్ ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా కుటుంబం మొత్తానికీ కనిపిస్తుంది. అది కూడా ఇంటర్ఆక్టివ్ టచ్ స్క్రీన్ కావడం వల్ల అచ్చం దీనితో ఫోన్ మాదిరి మారిపోతుంది గోడైనా, తలుపైనా, మరే చదును ప్రదేశమైనా. ఇది పూర్తిగా ఆండ్రాయిడ్ ఫోన్ compatible. ఇక తాజాగా దీనిలో gesture control ఫీచర్ ను చేర్చింది Sony. అంటే మనం ఎక్కడికీ కదలనవసరం లేకుండానే మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయిన స్క్రీన్ ను కేవలం మన చేతి వేళ్ళ కదలికల ద్వారా నియంత్రించవచ్చు.

ఈ ప్రొజెక్టర్ ఈ మధ్యనే మార్కెట్లోకి విడుదల అయింది. దీని ధర కొంచెం ఎక్కువే అని చెప్పాలి. ఇది $1700 కు లభిస్తోంది.

Courtesy