వేసవి మొదలవుతోంది అంటే ఎండ తీవ్రత పెరుగుతుంది. అయితే శరీరానికి ఎంత ఎండ, ఏ సమయంలో ఎంత కావాలో సాధికారికంగా చెప్పే ట్రాకర్లు ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి. ఈ పరికరాలు మనకు రోజులో కావాల్సిన ఎండ ఎంత సేపు కావాలో చెప్పేస్తున్నాయి. సహజంగా ఒక్కో కాలంలో, ఒక్కో సమయంలో ఎండ నుంచి వివిధ తీవ్రత కలిగిన కిరణాలు బయటకి వస్తాయి. ఆ ఎండలో కూడా ఒక్కో మనిషికి, వారి వారి చర్మ రంగును బట్టి శరీరం ఎండ నుండి విటమిన్ D తయారు చేసుకుంటుంది. అంటే మనకు ఇప్పుడు మన ఆరోగ్యానికి Sun Exposure మరియు ఆ ఎండ నుండి శరీరం తగినoత Vitamin D తయారు చేసుకోవటం అవసరం. ఈ రెండూ చెప్పగలిగేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే Qsun ట్రాకర్. ఇలాంటి ట్రాకర్లు ఇప్పటికే మార్కెట్ లో ఉన్నా ఇది కేవలం UV exposure తో పాటు మరిన్ని విభిన్నమైన పనులు కూడా చేయగలదు. సరే మరి అవేంటో చూద్దామా..

Qsun ఇది మన అరచేతిలో పట్టే పెద్ద రూపాయి నాణెం అంత పరిమాణంలో ఉంటుంది. దీనిని మన బట్టలకు, హ్యాండ్ బ్యాగ్, టోపీ, ఇలా దేనికైనా పెట్టుకోవచ్చు. ఈ పరికరం ఒక యాప్ కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. ఇది వాడటానికి ముందుగా ఈ యాప్ లో మన చర్మానికి సంబంధించి కొన్ని మౌలికమైన ప్రశ్నలకు జవాబులు చెప్తే చాలు ఇది వాడటానికి సిద్ధం అయినట్టే. దీనిలో ఎలాంటి బటన్స్ ఉండవు. కేవలం ఒకసారి అటూ ఇటూ విదిలిస్తే బయట ఎండ తీవ్రత ఎంత ఉందో 5 స్కేల్ లో చూపించేస్తుంది. అలాగే మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండ అధికమై sunburn కు దగ్గరయితే ఇది మీకు ఒక చిన్న పాటి శబ్దం ద్వారా సూచిస్తుంది. ఆ పైన ఒక వేళ సన్ స్క్రీన్ రాసుకుంటే, దానిని కూడా పరిగణలోకి తీసుకుని శరీరానికి తగిలే ఎండను గణన చేస్తుంది. అంతే కాదు మీ చర్మాన్ని, అది తయారు చేసుకునే vitamin D ని బట్టి ఈ యాప్ లో మీకు సరిపడే సన్ స్క్రీన్ ను కూడా ఈ పరికరం సూచిస్తుంది. ఇలా రోజులో, నెలలో ఎంత ఎండ తగులుతోందో, శరీరం ఎంత విటమిన్ D తయారుచేస్తోందో ఈ యాప్ లో సమాచారం చేరుతూ ఉంటుంది. ఇంకా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ కలిగిన వారి కోసం వారు రోజులో ఎన్ని అడుగులు వేస్తున్నారో లెక్కిస్తుంది కూడా. పరిమాణంలో చిన్నది కావడం, స్టెప్ కౌంట్, సన్ స్క్రీన్ ఆప్షన్, అతి తక్కువ ధర ఈ పరికరాన్ని మార్కెట్లో ఉండే UV Exposure ట్రాకర్స్ కంటే ప్రత్యేకమైనదిగా నిలబెట్టాయి.

ఈ పరికరం ధర కేవలం $99. ప్రీ ఆర్డర్ చేస్తే $49 కే కిక్starter (kickstarter) లో ఇది లభ్యం అవుతోంది. అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారందరికీ ఇటువంటి పరికరాల అవసరం ఎంతైనా ఉంది కదూ.

Courtesy