స్మార్ట్ ఫోన్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. అంటే, సంఖ్యలలో కాదు సెకన్ల వరకు. అర్ధం కాలేదా అదే, ఎక్కడ ఉన్నా, ఎక్కడికెళ్ళినా సరే, దీనిని వదిలిపెట్టడం కష్టం. పొద్దున్నే లేచిన దగ్గర నుంచీ రాత్రి నిద్ర పోయే వరకు ఎక్కడ ఉన్నా ఏంచేస్తున్నా ఇది మనతో ఉండాల్సిందే. అంతే కాదు ఒక సర్వే ప్రకారం, సెల్ ఫోనును కొద్ది నిముషాలు కూడా విడిచి పెట్టడం ఈ తరానికి కష్టంగా మారింది అని కూడా తేలింది.

సరే, మరి అలాంటి సెల్ ఫోనులో మన వ్యక్తిగత సమాచారం అంతా ఉంటుంది. ఇక దానిని ఎక్కడైనా బహిరంగ స్థలాల్లో ఉపయోగించేటప్పుడు మనం ఏం చూస్తున్నాం, దానిలో ఏం చేస్తున్నామనేది ఎవరైనా గమనిస్తారేమోననే అనుమానం లేక పోదు. అలా అవతలి వ్యక్తులు మన ఫోనులోకి తొంగి చూస్తే ఇబ్బందే. ఈ ఇబ్బందిని అధిగమించడానికి టర్కీ కి చెందిన ఒకతను ఒక వినూత్న ప్రయత్నం చేసాడు. అదేంటో చూద్దాం.

సెల్ ఫోనులో ఒక చిప్ ద్వారా ఒక కొత్త సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి, దానికి అనుసంధానంగా ఒక చిప్ ను ఒక కళ్ళజోడు లో అమర్చాడు. ఫోనులోని ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మనం ఉపయోగిస్తున్న ఫోను స్క్రీన్ బ్లాంక్ గా కనిపిస్తుంది. అది మన కంటికి కనిపించాలంటే, ఆ ప్రత్యకమైన కళ్ళ జోడు పెట్టుకుంటేనే మనకు కనిపిస్తుంది. ఇక దీనితో ఎక్కడ ఉన్నా, మన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా దొంగిలిస్తారనే భయం మనకు ఉండదు. ఇది ఎలా పని చేస్తుందో ఇక్కడ వీడియో లో చూడచ్చు. అయితే ఇది తయారు చేసిన వ్యతి టర్కీ కి చెందిన వ్యక్తి కావడం తో వీడియో కూడా టర్కిష్ లోనే ఉంటుంది.

అయితే ఇది మార్కెట్ లోకి రావడానికి మాత్రం మరింత సమయం పడుతుంది అంటున్నాడు దీని రూప కర్త.

Courtesy