యుద్ధమంటే ఎవరికైనా భయమే. ఇరు దేశాల వారికీ, చుట్టూ పక్కల దేశాల వారికీ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అని భయం. ఇక యుద్ధం చేసే వారికి శత్రు సైనికుల వల్ల, వారు ఉపయోగించే ఆయుధాల వల్ల భయం. ఎదో ఒక రకంగా ఎవరో ఒకరు గెలిచినా ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజానీకం ఎలా ఉన్నా ఆ యుద్ధం జరిగిన ప్రదేశంలో బాంబు దాడుల వల్ల పర్యావరణానికి ఎంతో హాని హరుగుతుంది. ఎన్నో భయంకర విష వాయువులు గాలిలో, నీటిలో కలుస్తాయి. వీటిని కనిపెట్టడమూ కష్టమే, అటు పైన వాటిని పర్యావరణం లో నుంచి వేరు చేయడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది.

ఈ సమస్యకు University of Washington (UW) ఎంతో సులువైన పరిష్కారాన్ని కనుగొంది. అదే ఒక ప్రత్యేకంగా తయారు చేసిన “గడ్డి”. గడ్డి అని మనం ఎంతో చిన్న చూపు చూసే గడ్డే అక్కడి పర్యావరణాన్ని శుద్ధి చేయగలదు అని UW పరిశోధకులు ఒక ప్రయోగం ద్వారా రుజువు చేసారు. అదేలాంటే ఒక ప్రత్యేకమైన బాక్టీరియా జన్యువులతో గడ్డిని తయారు చేసి, ఆ గడ్డిని బాంబు దాడులు జరిగిన ప్రాంతంలోని మట్టిలో పెంచడం మొదలు పెట్టగా కేవలం రెండు వారాల్లో ఆ మట్టి నుంచి RDx లేకుండా పోయిందని తేలింది. అంతేనా చివరికి ఆ గడ్డి యొక్క ఏ భాగం అంటే ఆకులు, మొదలు, వేర్ల వంటి భాగాలలో కూడా ఈ విష వాయువు లేదని రుజువైంది. UW వారి ఈ ప్రయోగం, పర్యావరణాన్ని శుద్ధి చేయడంలో మొక్కలకు ఉన్న సామర్ధ్యాన్ని ప్రపంచానికి చూపించిన మొట్ట మొదటి ప్రయోగం కావడం విశేషం.

ఈ ప్రయోగాన్ని అన్ని దేశ ప్రభుత్వాలు గుర్తించాలి. బాంబు దాడులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే దేశాలు ఈ గడ్డిని దేశంలోని అన్ని చోట్ల విధిగా పెంచుకుంటే దేశాలకు ఎంతో మేలు జరుగుతుంది అనడంలో సందేహం లేదు కదూ.