మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. లేదా పాలు అయినా తాగుతారు. ఇవన్నీ వేడిగా తాగితేనే దాని రుచి అని వెరే చెప్పకర్లేదు. కానీ ఒక్కోసారి పని తీరికలో పడి తెచ్చుకున్న పానీయాలు చల్లరిపోతాయి. కొంత మందికి అయితే పని తీవ్రత వల్ల గంటకో కాఫీ నో టీ ని తాగే అలవాటు ఉంటుంది. ఈ పానీయాలు వేడి తగ్గకుండా గంటల తరబడి ఉండేందుకు ఒక కొత్త మగ్ ను తయారు చేసారు. అదే ఈ Jul.

Power Practical అనే అమెరికన్ సంస్థ ఈ కాఫీ మగ్ ను తయారు చేసింది. ఈ మగ్ లో కాఫీ లేదా టీ మొదటి సిప్ నుండి ఆఖరి వరకు వరకు వేడిగా ఉండడం విశేషం. మీరు ఇప్పుడు తాగండి, ఇది మీ పానీయాలను వేడిగా ఉంచుతుంది. ఇది ఎలా పని చేస్తుంది అంటే, ఒక యుఎస్బి కేబుల్ తో దీనిని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే, కాఫీ ని వేడిగా ఉంచాలి అంటే, ఈ యుఎస్బి కేబుల్ ను ప్లగ్ లో పెట్టి, దీనికి గుండ్రని ప్లేట్ లా ఉండే ఒక కోస్టర్ మీద ఈ మగ్ ను ఉంచాలి. అప్పుడు ఆ కోస్టర్ పై ఎరుపు రంగు లైటు వెలుగుతుంటే కాఫీ వేడి అవుతునట్టు, ఇక తెల్లని రంగు లైటు వస్తే, తాగడానికి సిద్ధంగా ఉన్నట్టు. అంతేనా, ఇందులో మీరు ఎంత వేడిలో కాఫీ/టీ తాగాలి అనుకుంటారో ఆ ఉష్ణోగ్రతను కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇక దీని పైన ఒక మూత ఉంటుంది. మీ పానీయం ఒలికిపోకుండా ఉండడమే కాక, ఇది మీ కాఫీ ని వేడిగా ఉంచుతుంది. దీనిని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్లడానికి వీలుగా దీనిని కార్ లో కూడా పెట్టుకునే విధంగా తయారు చేసారు.

ఇలా కాఫీ లేదా టీ ఉంటే బావుంటుంది అనిపిస్తోంది కదూ. ఈ Jul మగ్ అక్టోబర్ నుండి మార్కెట్ లోకి విడుదల కానుంది. అయితే ఇది కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక దీని ధర $45 నుండి ఉంటుంది.