వాయు కాలుష్యం సాధారణంగా ఇంటి బయటే ఉంటుంది అనుకుంటారు చాలామంది. కానీ మన ఇంట్లో మనం పీల్చే గాలి కూడా ఎంత వరకు సురక్షితమో అని ఎప్పుడైనా ఆలోచించారా. అసలు ఆ ఆలోచనే రాలేదు కదూ. సరే ఆ దిశగా ఇప్పుడు దృష్టి సారిద్దాం. మన ఇంట్లో మనం ఉపయోగించే వస్తువులను బట్టి కొన్ని విష పదార్ధాలు మనం పీల్చే గాలిలో కలిసి పోతాయి. అవి ప్రింటర్లు, నెయిల్ పోలిష్ మొదలైన కాస్మెటిక్స్, మన ఇంట్లో ఉండే ఫర్నిచర్, పెయింట్ మొదలైన వాటి ద్వారా గాలి కలుషితం అవుతుంది.

ఈ గాలిని పీల్చడం వల్ల ఎక్కువగా తల తిరగడం, ఆస్తమా కొన్ని రకాల ఎలర్జీ లు వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి పరిష్కారం ఏది అంటే చాలా సులభం. ఇంట్లో మొక్కలు పెంచడమే. ఇళ్ళల్లో మొక్కలు పెంచడం అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్న అలవాటే. అయితే ప్రస్తుత భవన సంస్కృతి దృష్ట్యా మనం కుండీలలో పెంచే మొక్కలు కూడా విష వాయువులను హరించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Vadoud Niri అనే State University of New York కు చెందిన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం భవనాలు కూడా పైన చెప్పుకున్న వస్తువుల వల్ల Acetone, Benzene, Formadehyde వంటి VOC’s (Volatile Organic Compounds) ను విడుదల చేస్తాయి. అందువల్ల వీటిని హరించేందుకు ఏ ఏ మొక్కలు ఏ విధంగా పని చేస్తాయో ఈయన పరిశోధించారు. ఇందుకోసం Jade, Spider plant, Bromeliad, Dracaena, Carribbean tree Cactus మొదలైనవి సమర్ధవంతంగా ఉన్నాయని కనుగొన్నారు.

ఇందుకోసం వీరు ఒక ప్రయోగం చేసారు. ఒక మూసి ఉంచిన గదిలోని గాలి నాణ్యతను, అందులోని ఎనిమిది రకాల VOC’s స్థాయిలను ఈ మొక్కలు ఉన్నప్పుడు అదే లేనప్పుడు ఏ విధంగా ఉన్నాయో వీరు గమనించారు. అందులో పై మొక్కలన్నీ acetone ను సమర్ధవంతంగా హరించగా, Dracaena అనే మొక్క acetone ను 94% హరించింది. Bromeliad అనే మొక్క ఎనిమిది లో ఆరు రకాల VOC లను 80% మేర హరించిందని గమనించారు.

Niri ఈ మొక్కలను ఒక బ్యూటీ సలోన్ లో ఉంచి వీటి సమర్ధతను పరీక్షించనున్నారు. ఈ పరిశోధన వివరాలను Niri, 252వ National Meeting & Exposition of the American Chemical Society (ACS) లో సమర్పించారు.

మొక్కలు ఇంటి అందానికే కాదు మన ఆరోగ్యానికీ అవసరమని తెలుసుకున్నాం కదూ.

Courtesy