ఇప్పుడు హవా అంతా wearables దే. ఫిట్నెస్ ను మన రోజు వారీ పరికరాలలోకి ఇమిడ్చి ఇవి వాచ్ రూపు రేఖలనే మార్చేశాయి. ఇప్పుడు fitbit, Apple ఇంకా మరెన్నో అంతర్జాతీయ సంస్థల స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కేవలం ఫిట్నెస్ మాత్రమేనా, మన ఫోనులో ఉండే మ్యూజిక్, కాంటాక్ట్స్, అలారం వంటి ఫీచర్ లతో ఇవి అందుబాటులోకి వచ్చేసాయి.

అయితే ఎంత కొత్తగా ఉన్నా దీనితో ఉండే ఇబ్బందులు, పరిమితులూ దీనికి ఉన్నాయి. అందులో మొట్ట మొదటిది స్క్రీన్. ఇవి టచ్ స్క్రీన్ కావడం, ఆ స్క్రీన్ ఏమో చిన్నది కావడం వలన వాచ్ కు ఏదైనా కమాండ్ ఇవ్వడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే స్మార్ట్ వాచ్ లని ఉపయోగిస్తున్న వారికి ఈ ఇబ్బంది ఏంటో బాగా తెలుసు. మన చేతి వెళ్ళ కంటే ఆ స్క్రీన్ చిన్నది కావడమే ఇందుకు కారణం. అయితే సాంకేతికత అంటే దేన్నైనా సరళీకృతం చేయడమే కదూ. అందుకోసం ఇక పై ఇలాంటి wearables ను ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది ఈ SkinTrack.

Carnegie Mellon University కి చెందిన పరిశోధకులు ఇటువంటి స్మార్ట్ వాచ్ లు స్మార్ట్ wearables కోసం ప్రత్యేకంగా ఒక ring ను తయారు చేసారు. ఈ ring ను మన చూపుడు వేలికి పెట్టుకొని, స్మార్ట్ వాచ్ పెట్టుకున్న చేతి పై భాగంలో దానికి కావాల్సిన కమాండ్స్ ఇవ్వచ్చు. ఈ ring ద్వారా ఆ స్మార్ట్ వాచ్ 99 శాతం విజయవంతంగా కమాండ్స్ ను స్వీకరించింది. ఇది ఎలా పని చేస్తుంది అంటే, ఈ ring పెట్టుకోగానే, దీని ద్వారా వచ్చే low energy, high frequency emw (electro magnetic waves) మన చేతి పై భాగం ద్వారా స్మార్ట్ వాచ్ లోని electrodes కు చేరతాయి. ఇక ఈ వాచ్ లో అమర్చబడిన x-axis మరియు y-axis electrodes మన చేతి మీద వేలి కదలికలను 2D లో గ్రహిస్తాయి. చేతి మీద మన వేలి కదలికల వల్ల ఏర్పడే phase difference ను బట్టి కమాండ్స్ ను స్వీకరిస్తాయి. ఈ SkinTrack ద్వారా మ్యూజిక్, కాంటాక్ట్స్, డైరెక్షన్స్, గేమ్స్ వంటివి సులువుగా చేయవచ్చు.

అంతా బానే ఉంది కానీ ఈ SkinTrack రింగ్ కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. దీనిని ఛార్జ్ చేయాల్సి రావడం, చెమట, ఎక్కువసేపు ధరించడం వంటి కారణాల వల్ల signals సరిగ్గా రాకపోవడం అనే సమస్య ఉంది. ఇది అలా ఉంచితే దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగకపోవడం విశేషం.

ఏదేమైనా స్మార్ట్ వాచ్ వాడకాలను సులభతరం చేసందుకు చేసిన ఈ SkinTrack కు ఉన్న పరిమితులను అధిగమించి ఇది అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.

Courtesy