పరాయి దేశంలో వారి భాషను అర్ధం చేసుకుని మెలగటం చాలా కష్టం. ఈ కష్టం మామూలు కష్టం కాదు. అక్కడ నుంచీ మళ్ళీ ఎప్పుడు వెనక్కు వస్తాం అని చదువుకున్న వారే అనుకుంటారు. ఇంగ్లీష్ మచ్చుకకు కూడా మాట్లాడని దేశాలు Germany, Spain, France ఇటలీ మొదలైన దేశాలు. అక్కడకు వెళితే కనీసం బోర్డు మీద కూడా ఇంగ్లీష్ పదాలు ఉండవు. ఇదీ అక్కడి పరిస్థితి. ఇక పై ఈ కష్టం ఉండబోదు. ఈ భాషా హద్దులను చెరిపేసేందుకు మనకు ఎన్నో apps అలాగే ఒక రకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. మరి అవేంటో చూద్దామా.

Pilot-Earpiece

Pilot ear piece: అమెరికా లోని న్యూ యార్క్ కు చెందిన Waverly labs అనే సంస్థ Pilot అనే ఒక ear piece ను తయారు చేసింది. ఇది ఒక wireless ear piece. ఇది మన ఫోనులో ఒక యాప్ కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. దీనిని రెండు వేర్వేరు భాషలు మాట్లాడే వారు పెట్టుకుని, ఎవరి భాషలో వారు సంభాషించినా ఇవతలి వారికి వారి భాషలో మాట్లాడినట్టే వారి Pilot ear piece లో వినిపించడం విశేషం. అయితే ఈ Pilot ear piece దేని ఆధారంగా ఇలా చేయగలుగుతుందో మాత్రం ఈ సంస్థ ఇంకా బయట పెట్టలేదు కానీ వీరు మాత్రం “Translation టెక్నాలజీ” ఆధారంగా అని మాత్రం పేర్కొన్నారు. అయితే ఇది ప్రస్తుతం english, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జర్మన్ వంటి భాషలకు అనువాదం చేస్తుంది. మరిన్ని భాషలకు అంటే హిందీ, అరబిక్, స్లావిక్ వంటి భాషలకు అనువాదం కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ pilot ear piece ను ఇద్దరూ పెట్టుకుంటేనే కానీ ఇది పని చేయదు. అందువల్ల ఈ సంస్థ ప్రస్తుతం రెండు ear piece లను కలిపి విక్రయిస్తోంది. కానీ త్వరలోనే ఈ సంస్థ ఈ ear piece ద్వారా చుట్టూ జరుగుతున్న సంభాషణను కూడా అనువదించి అందించే పనిలో ఉంది. ఈ ear piece తెలుపు, ఎరుపు మరియు నలుపు రంగుల్లో లభ్యం అవుతుంది. ఇక దీని ధర $129 – $300 వరకు ఉండవచ్చు.

ఈ సంస్థే కాదు గూగుల్, microsoft వంటి సంస్థలు ఇప్పటికే స్మార్ట్ ఫోను ఆధారంగా ఇటువంటి భాషలను అనువదించే యాప్ లను ప్రవేశ పెట్టే పనిలో ఉన్నాయి.

Google Translate: గూగుల్ ఇప్పటికే Translate అనే యాప్ ను ప్రవేశ పెట్టింది. ఈ యాప్ లో రెండు వేర్వేరు భాషలకు అనువాదం సాధ్య పడుతుంది. ఈ యాప్ లోకి వెళ్లి మీరు mic బటన్ నొక్కి మీరు చెప్పాల్సింది చెబితే చాలు ఈ యాప్ మీ భాషను గుర్తించి, మీరు అన్న మాటలు ఆయా వాక్యాల రూపంలో అవతలి వారికి అందుతాయి. ఇక అక్కడి నుంచీ అవతలి వారితో voice translation mode లో రెండు వేర్వేరు భాషలలో సంభాషణ చేసుకోవచ్చు. అంతేనా ఈ యాప్ లోనే Word lens అనే ఒక tool ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే, మీరేదైనా పర దేశంలో sign borad ల తో ఇబ్బంది పడుతుంటే ఈ యాప్ ద్వారా ఆ sign ను photo తీస్తే చాలు వెంటనే 36 భాషలలోకి అది అనువదిoచబడుతుంది. ఇక ఇది data connection లేకపోయినా పని చేస్తుంది. ఈ యాప్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్టుగీస్, రష్యన్, స్పానిష్ ఇంకా మరిన్ని భాషలకు అందుబాటులో ఉంది.

Skype translator

Skype Translator: మైక్రోసాఫ్ట్ వారి Skype కూడా ఈ విషయం లో ముందంజ లో ఉంది. ఇది కూడా సుమారు గూగుల్ మాదిరిగానే పని చేస్తుంది. Skype, గత అక్టోబర్ లో ఈ translator ను ప్రవేశ పట్టింది. దీని ద్వారా వేర్వేరు భాషలలో సంభాషిస్తుంటే ఈ translator ఒకరు చెప్పింది అనువదించి, అవతలి వారికి వారి భాషలోనే వినిపిoచడమే కాదు వారి భాషలో text ను కూడా పంపిస్తుంది.

word lens

అర్ధం అయింది కదూ, ఇక పై మీరు కానీ మీ వాళ్ళు కానీ పరాయి దేశంలో ఉంటే వారికి సాయం చేసే ఈ యాప్ లను గూర్చి తప్పక చెప్పండి.

Courtesy