Jet lag ను గూర్చి ఈ రోజుల్లో పరిచయం అవసరం లేదు. jet lag అంటే ఇక్కడ ఒకలాంటి సమయాన్ని అనుసరిస్తున్న మన శరీరం (body clock) ఆ వేరే దేశం తాలూకు time zone కు అలవాటు పడలేకపోవడం. అంటే మన నిద్ర, ఆహార సమయాలు తారు మారు అయిపోతాయి. ఈ సమస్య తూర్పు నుంచీ పశ్చిమ దేశాలకు వెళ్ళేటప్పుడు మరింత ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఎన్ని time zones దాటతామో, jet lag అంత ఎక్కువ ఉంటుంది. దీనికి పరిష్కారాన్ని కనుగొన్నాడు పోలాండ్ లోని warsaw కు చెందిన ఒక కుర్రాడు. మరి ఆ విశేషాలు చూద్దామా…

neuroon1
Kamil Adamczyk అనే ఈ 24 ఏళ్ల అబ్బాయి, Inteliclinic అనే సంస్థ ద్వారా, NeuroOn అనే ఐ మాస్క్ ను తయారు చేసాడు. మొబైల్ ఫోనుకు ఒక యాప్ ద్వారా అనుసంధానం చేయబడి ఈ ఐ మాస్క్ పని చేస్తుంది. దీనికి ప్రధానంగా ఆరు ఫీచర్ లు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది Jet lag blocker. ఈ ఫీచర్ ప్రయోజనం ఏంటంటే – ఏదైనా విదేశాలకు వెళ్ళే ముందు మనం ఉన్న దేశం, వెళ్ళే దేశం, వెళ్ళే రోజు వంటి సమాచారాన్ని ఈ యాప్ లో ఒక వారం రోజుల ముందు ఫీడ్ చేసి ఆ రాత్రి మనం దీనిని పెట్టుకుని పడుకుంటే, ఇది మన నిద్రకు సంబంధించిన సమాచారాన్ని గమనించి యాప్ కు పంపిస్తుంది.
అటు పైన ఈ యాప్ – ఈ ఐ మాస్క్ ను నిద్రించేటప్పుడు ఎన్ని రోజుల ముందు నుంచీ పెట్టుకోవాలి flight లో ఎంత సేపు పెట్టుకోవాలి వంటి సమాచారాన్ని ఇచ్చేస్తుంది. తదనుగుణంగా మనం ప్రయాణానికి ముందు, ప్రయాణంలో (flight లో ) పెట్టుకుంటే మనo ఆ వేరే దేశం లో దిగేసరికల్లా మనం శరీరాన్ని ఆ time zone కు సిద్ధం చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా. ఈ ఐ మాస్క్ ఆ పనిని ఎలా చేస్తుందో చూడండి మరి.

neuroon22
ఈ ఐ మాస్క్ ను ధరించినప్పుడు దీనిలోని సెన్సర్స్ వ్యక్తి మెదడు లోని brain waves ను, కను గుడ్డు కదలికలను, ఆక్సిజన్ స్థాయిని అలాగే వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను గమనించి ఆ సమాచారాన్నియాప్ కు పంపిస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించిన తరువాత ఈ మాస్క్ లోని సెన్సర్స్ వ్యక్తి నిద్రిస్తున్నపుడు ఆ రాబోయే time zone కు అనుగుణంగా అతన్ని నిద్ర లేపుతాయి. అంటే కంటిలోని light sensors ను ప్రభావితం చేయడం ద్వారా ఇవి మెదుకు సూర్యోదయం అవుతున్నట్టు భ్రమింప చేయడం వల్ల ఇది సాధ్య పడుతుంది. దీనిని Bright light therapy అంటారు. అంతే కాదు ఈ విధంగా నిద్ర లేవడం వల్ల వ్యక్తికి అలసట వంటివి ఉండవు. ఈ ఐ మాస్క్, light therapy ద్వారా మెదులోని నిద్రకు కారణమైన melatonin అనే హార్మోన్ ను నియంత్రించడం ద్వారా ఇది సాధ్య పడుతుంది.

neuroon feature
ఇక ఇది రాత్రంతా పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీనిని తేలిగ్గా మెషిన్ వాష్ చేయవచ్చు అంటున్నాడు దీనిని తయారు చేసిన Adamczyk. ప్రయాణాల్లోనే కాదు నిద్ర లేమి వంటి సమస్యలు ఉన్న వారికి, ఎక్కువగా కంప్యూటర్ ముందు గంటలు గంటలు పని చేసే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర $299. ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ నెల అందుబాటులోకి వచ్చింది.

Courtesy