ప్రస్తుతం అన్ని కంపెనీలూ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ల(Wireless Headphones)ను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో చాలా రకాల వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు సమంత సేల్ అవుతన్నాయి. ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు బ్లూటూత్ ద్వారా పనిచేస్తాయని చాలా మందికి తెలుసు.

పాత హెడ్‌ఫోన్ల లాగా వీటికి హెడ్ ఫోన్ జాక్ ఫోన్‌కి కనెక్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు.అందువల్ల వీటిని వాడటం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవి త్వరగా డ్యామేజ్ అవ్వవు. ఐతే.. చాలా వైర్‌లెస్ హెడ్‌ఫోన్లకు ఛార్జింగ్ సమస్య లు తలెత్తుతాయి.

అయితే వాటిని ఛార్జ్ చెయ్యడం తప్పనిసరి. ఛార్జ్ సరిగా అవ్వకపోతే ఇబ్బందే. దీనికి పరిష్కారంగా వీవో (vivo) 30 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను విడుదల  చేసింది.

దాంతో  బ్యాటరీ లైఫ్ విషయంలో ఏ సమస్య రాదు. మరి అవి ఎలా పనిచేస్తాయి, ఎలా ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

వివో TWS 2, వివో TWS 2e హెడ్‌ఫోన్లు బ్లూటూత్ v5.2ని కనెక్టివిటీ కోసం యూజ్ చేస్తున్నాయి. చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా అలాగే చూడగానే కొనుక్కోవాలి అనిపించేలా ఉన్నాయని సమాచారం.

ఇక వివో TWS 2, వివో TWS 2e హెడ్‌ఫోన్ల హైలెట్స్ విషయానికి వస్తే , వివో TWS 2, వివో TWS 2e ఇయర్‌ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్. మనకు ఎట్రాక్టివ్ బ్లూ లేదా ఎట్రాక్టివ్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వివో తన TWS Neo ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్లను 2020 సంవత్సరంలో భారత దేశం లాంచ్ అయింది .

ఇయర్‌ఫోన్ ఫీచర్లు:

ఈ ఇయర్‌ఫోన్ల(Ear phones)లో సరికొత్త ఫీచర్ కలిగి వున్నాయి. వీటిలో యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది. అలాగే క్వాల్‌కమ్ aptX ఆప్టివ్ బ్లూటూత్ కోడెక్‌ను సపోర్ట్ చేస్తోంది.

ఐతే ఈ ఇయర్‌ఫోన్లు ప్రస్తుతం చైనాలో మాత్రమే ముందుగా ఆర్డర్ చేసుకునే వీలుంది. వీటిని ఇతర దేశాల్లో ఎప్పుడు లాంచ్ చేస్తారో కంపెనీ చెప్పలేదు.

వివో నుంచి వచ్చిన సెకండ్ జనరేషన్ ఇయర్ ఫోన్లు మనకు బ్లూ, వైట్ అట్రాక్టివ్ కలర్స్‌లో లభించాయి. ఈ కలర్లు కస్టమర్స్ కి బాగా నచ్చాయని టాక్.

వివో TWS 2, వివో TWS 2e హెడ్‌ఫోన్ల ధరలు:

మల్టీ నేషనల్  సంస్థ అయిన వివో(VIVO) తన ఉత్పత్తుల్లో క్వాలిటీ పాటు ధరలు కూడా పెంచుతోంది. చైనాలో TWS 2 ధర 499 చైనా యెన్స్ (CNY)గా ఉంది.

మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.5,700. అలాగే TWS 2e ధర చైనాలో 299 CNY ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.3,400. చైనాలో వీటికి ప్రీ-ఆర్డర్స్ ఉన్నాయి. చైనాలో వివో స్టోర్లలో, వివో పోర్టల్‌లో,ఇతర ఆన్‌లైన్ పోర్టల్స్‌(Online Portals) లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఇయర్‌ఫోన్లు త్వరలోనే భారత్ లో  సహా ప్రపంచ దేశాల మార్కెట్లలోకి వస్తాయనే అంచనా ఉంది.

ఇండియాలో ఇలాంటి వాటికి డిమాండ్ ఎక్కువే. కాబట్టి త్వరలోనే ఇక్కడి మార్కెట్లలోకి విడుదల చేసే  అవకాశం వుంది. మరి ధరలు ఎలా వుంటాయో చెప్పాలంటే ఇయర్‌ఫోన్స్ అందుబాటులోకి రావాల్సిందే.