బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) ఆరో వారం లోకి అడుగుపెట్టేసింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా హౌస్ మేట్స్(House mates) మధ్య నిప్పులు చెలరేగింది.

హౌస్ మేట్స్ ఒక్కరి మీద ఒక్కరు మాటల బాణాలు వదిలారు. ఇక హమీద ఎలిమినేట్ అవ్వడంతో శ్రీ రామ్ కాస్త డల్ గా కనిపించాడు. అక్క అని పిలవద్దు అంటూ రెచ్చిపోయిన యాని మాస్టర్. గేమ్ ఆడితే తట్టుకోలేవంటున్న సన్నీ.

విశ్వాన్ని రేషనల్ మేనేజర్ గా పనికి రావు అన్న ప్రియా. సిగ్గుండాలి అని కోప్పడ్డ ప్రియాంక, షన్ను శ్రీరామ్- మధ్య , సిరి- శ్రీ రామ మధ్య మాటల యుద్దాలు ఇలా బిగ్ బాస్ హౌస్ లో హీట్ అర్గుమెంట్స్ జరిగాయి.

ఈ వారం ఎవరు నామినేషన్ లో వున్నారో, తెలుసుకోవాలంటే 36వ ఎపిసోడ్ వివారాలోకి వెళ్లాల్సిందే.

బిగ్‌బాస్‌ హౌస్‌(Big boss)లో ఆరోవారం నామినేషన్స్‌(Nominations) ప్రక్రియ లో ‘అగ్నిపరీక్ష’ టాస్క్‌ లో ఇచ్చిన బిగ్ బాస్. ఎప్పటి లాగే ఇద్దరినీ నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పి వాళ్ళ ఫోటోని నిప్పులో పడేయాలి.

ముందుగా  సన్నీ- రవి, జెస్సీ ఫొటోలను మంటలో వేశాడు. తర్వాత వచ్చిన విశ్వ. ఎంతో కష్టపడి బిగ్ బాస్ కు వస్తే తనను స్ట్రాంగ్‌ అంటూ నామినేట్‌ చేయడం కరెక్ట్ కాదంటూ యానీ మాస్టర్‌ ఫొటోను నిప్పులో పడేశాడు.

దీన్ని డైజీషన్ చేసుకోలేకపోయిన యానీ శివాలెత్తింది, ఇకపై తనను అక్క అని పిలవద్దంటూ వార్నింగ్‌ ఇచ్చింది. తర్వాత విశ్వ, ప్రియాంక సింగ్‌ను నామినేట్‌ చేశాడు. శ్వేత- సిరి, కాజల్‌ను నామినేట్‌ చేసింది.

ఇక లోబో నమ్మకం అంటే చచ్చిపోతా, అలాంటిది తన నమ్మకాన్ని చంపారంటూ ప్రియాంక సింగ్‌, జెస్సీని నామినేట్‌ చేశాడు. దీనిపై జెస్సీ రియాక్ట్‌ అవుతూ నమ్మకంతో తనకు పని లేదని, ఆట ఆడటానికి వచ్చానని చెప్పాడు .

సిరి మాట్లాడుతూ నీ కెప్టెన్సీలో పక్షపాతం కనిపించిందంటూ శ్రీరామచంద్రను నామినేట్‌ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ నా గేమ్‌ నా ఇష్టం, ఏం చేయాలో నాకు అడ్వైజ్ ఇవ్వకంటూ ఇర్రిటేట్ అయింది. యాంకర్‌ రవి- సిరి  మానస్‌ను నామినేట్‌ చేశాడు.

జెస్సీ – శ్రీరామ్‌, సన్నీని నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో జెస్సీ, సన్నీ మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. నేను గేమ్‌ ఆడితే తట్టుకోలేవు, నా మంచితనం పోతే చాలా వరస్ట్‌ గా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చిన సన్నీ.

ప్రియాంక సింగ్‌ మాట్లాడుతూ.. ప్రతిసారి సిల్లీ రీజన్స్‌తో నామినేట్‌ చేయడమే కాకుండా ట్రస్ట్ గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ లోబో ఫొటోను ముక్కలు చేసి నిప్పుల్లో పడేసింది. విశ్వ గురించి మాట్లాడుతూ.. కండబలమే కాదు బుద్ధిబలం కూడా వాడాలి . ఎధవ రీజన్లు చెప్తారు అంటూ విసుక్కున్న ప్రియాంక.

ఇక  మానస్‌ – యాంకర్‌ రవి, లోబోను నామినేట్‌(Nominate) చేశాడు. యానీ మాస్టర్‌ మరోసారి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌నే నామినేట్‌ చేస్తానంటూ షణ్ముఖ్‌ ఫొటోను నిప్పుల్లో పడేసింది.

అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకు, వెనకాల నుంచి పొడవకు అని వార్నింగ్ ఇస్తూ విశ్వ ఫొటోను బూడిద చేసింది.

తర్వాత శ్రీరామ్  మీ అవసరానికి తగ్గట్టు రిలేషన్స్ ని యూజ్ చేయకండంటూ సిరిని నామినేట్‌(Nominate) చేశాడు. ఆడినా ఆడకపోయినా షణ్ముఖ్‌నెవరూ నామినేట్‌ చేయడంలేదంటూ అతడి ఫొటోను మంటల్లో వేశాడు.

దాంతో చిరెత్తిన షణ్ను బిగ్‌బాస్‌ హౌస్‌(Big boss House)కు నువ్వేమైన  దేవుడివా, నువ్వేం చెప్తే అది చేయాలా? అని నిప్పులు తొక్కాడు. దీంతో శ్రీరామ్‌ అతడికి కూల్‌ చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత కాజల్‌ మాట్లాడుతూ హమీదా నన్ను అక్కా అంటూ పిలిచింది కానీ నేను కనెక్ట్‌ కాలేకపోయా, నేను నిన్ను బ్రదర్‌ అంటూ మాట్లాడదామని ముందుకు వస్తే నువ్వు కనెక్ట్‌ అవ్వలేదు.

ఇదే కర్మ.. ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ పెట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు, కేవలం ఆట  ఆడటానికే వచ్చానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన  కాజల్‌. తనను నామినేట్‌ చేసినందుకు శ్వేత ఫొటోను నిప్పుల్లో వేసింది.

షణ్ముఖ్ – శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేశాడు. కిచెన్‌లో జరిగిన గొడవలు, అక్కడ అన్న మాటలు తనకు నచ్చలేదని శ్రీరామ్ ని  నామినేట్ చేశాడు.

సీక్రెట్ నామినేషన్ల సమయంలో లోబో చెప్పిన కారణాలు తనకు నచ్చలేదని నామినెటే చేసిన షణ్ముఖ్. ప్రియ నువ్వేం మాట్లాడతావో అర్థం కాదు, టక్కున నోరు జారేస్తావు. రేషన్‌ మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు హౌస్ మేట్స్(House mates) కి పెట్టాకే తినాలి అంటూ విశ్వను నామినేట్‌ చేసింది. తర్వాత సన్నీ ఫొటోను మంటల్లో వేసింది.

ప్రతివారం తనను నామినేట్‌ చేయడమే పనిగా పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు సన్నీ. మీరున్నన్ని రోజులు మిమ్మల్నే నామినేట్‌ చేస్తాను అన్నాడు.

దీని కి ప్రియా  బెదిరిస్తున్నావా, బయపెడ్తున్నావా అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా ఈ వారం  నామినేషన్(Nomination) ప్రక్రియలో షణ్ముఖ్‌, జెస్సీ, శ్రీరామ్‌, ప్రియాంక సింగ్‌, లోబో,  రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, నామినేట్‌ అయినట్లు ప్రకటించిన బిగ్ బాస్(Big boss).